Vadinamma : ఉద్యోగం సంపాదించిన రఘురాం.. పాపం శైలు.. ఒక్క దెబ్బకే తల ప్రాణం తోకకి!

కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడిన ఛాలెంజ్ కోసం ఇరువైపుల వారు తీవ్రంగా కష్టపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లక్ష్మణ్ జీతం 40 వేల రూపాయలు తీసుకువచ్చి శైలు చేతిలో పెట్టడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. వాళ్ళవి 1500 రూపాయలు కానీ మనవి 40 వేల రూపాయలు ఏవి ఎక్కువ అంటూ శైలు శిల్పతో కలిసి కాస్త పొంగిపోతూ ఉంటుంది. మరోపక్క రఘురాం, భరత్ ఇద్దరూ కూడా డబ్బులు సంపాదించడం కోసం కష్టపడుతూ ఉంటారు. అక్కడితో గత ఎపిసోడ్ ముగించారు. తాజా ఎపిసోడ్ లో ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

డబ్బులన్నీ ఖాళీ

డబ్బులన్నీ ఖాళీ

40 వేల రూపాయలు లక్ష్మణ్ తన జీవితం తీసుకువచ్చి శైలు చేతిలో పెట్టాడు. ఆ డబ్బు హుండీలో వేయడానికి ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్క సారి ఎవరో ఒకరు రావడం తమకు సంబంధించిన బిల్లు డబ్బులు తీసుకు వెళ్లడం జరుగుతూ ఉంటుంది. పాలు, పేపర్, కరెంట్ బిల్, కిరాణా సరుకులు ఇలా దాదాపు అందరూ వచ్చి తమ తమ డబ్బులు తీసుకు వెళతారు చివరిగా పదివేల రూపాయలు మిగిలినవి కదా వాటిని హుండీలో వేద్దాం అని అనుకుంటున్న సమయంలో అత్తగారి మందుల కోసం 10 వేల ఆరు వందల రూపాయలు బిల్లు కట్టమని అడుగుతూ షాపతను ఇంటికి వస్తాడు. 600 రూపాయలు లేవు వచ్చే నెలలో ఇస్తామని చెప్పి పదివేల రూపాయలు అతనికి ఇచ్చి పంపిస్తారు. ఇలా జరగడంతో శైలు, శిల్ప కూడా ఇద్దరు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో పడిపోతారు. సిరి వేళాకోళంగా 1500 రూపాయలు ఎక్కువ 0 ఎక్కువ అని అడుగుతుంది.

ఉద్యోగ ప్రయత్నాలు

ఉద్యోగ ప్రయత్నాలు

ఈలోపు ఆమ్మో సీతక్క ఎలా ఈ అన్ని విషయాలను మేనేజ్ చేసిందో నాకు అర్థం కావడం లేదు అని శైలు అనడంతో నువ్వు అలా సీతక్కని పొగడకు నాకు ఇష్టం లేదు ఈ 40 వేల రూపాయలు లేక పోతే నేనేమి నాని తీసుకువచ్చే 35 వేల రూపాయలు ఉంటాయి కదా అని అంటుంది శిల్ప.ఇదిలా జరుగుతుండగా రఘురాం తనకు ఉద్యోగం కోసం కొండల రావు అనే వ్యక్తి దగ్గరకు వెళ్లతాడు. తమ కుటుంబానికి సన్నిహితుడైన రఘురాం ఇబ్బందులు పడుతుంటే చూడలేక పెద్ద మనుషులతో జనార్ధన్ దగ్గర కూర్చొని మాట్లాడదాం నీ షాపు మీకు వచ్చే విధంగా నేను మాట్లాడతాను అని అంటాడు. అయితే షాప్ నాకు కాకుండా పోవడానికి మా చిన్న కోడలు కారణమైంది. ఇప్పుడు ఈ విషయం కనుక మా తమ్ముడికి తెలిస్తే ఆమెకు విడాకులు ఇవ్వడానికి కూడా సంకోచించడు, అలా జరగడం నాకు ఇష్టం లేదు అని అంటాడు.

దుర్గ ప్లాన్

దుర్గ ప్లాన్

నువ్వు నీ కంచంలో తిండిని కూడా వేరే వాళ్ళకి పెట్టేస్తున్నావ్ ఇలా అయితే నిన్ను ఏదో ఒక నడి రోడ్డు మీద బట్టలు ఊడదీసి నిలబెడతారు అని ఆయన అంటాడు. అయితే మీ వద్ద ఏదో ఒక ఉద్యోగం ఇవ్వమని అడిగితే తన దగ్గర ఉద్యోగాలు లేవని కానీ అకౌంటెంట్గా చేయగలిగితే చేయమని అంటాడు. కానీ తన టెంట్ షాపులో పని చేసే వ్యక్తులకు ఇంట్లో పనులు కూడా చెప్పడం తన కుటుంబ సభ్యులకు అలవాటు అని కాబట్టి వద్దులే అంటాడు. తనకు ఎలాంటి పనులు చేయడానికి ఇబ్బంది లేదని చెప్పిన రఘురాం 15 వేల రూపాయల జీతంతో పని చేసేందుకు సిద్ధం అవుతాడు. మరోపక్క సిరి డబ్బుల కోసం జాకెట్లు కుడుతుంది అనే సంగతి తెలుసుకున్న దుర్గ ఈ విషయాన్ని పార్వతికి చెప్పడం కోసం చేతిలో కొన్ని జాకెట్ తో వెళ్లి చేరవేసి వస్తుంది. పార్వతి బయలుదేరి వెళ్ళబోతూ ఉండగా ఆమె భర్త ఆమెను నువ్వు ఏదైనా చేస్తే నేను ఊరుకోను అని అంటాడు.

నాని జీతం ఖాళీ

నాని జీతం ఖాళీ

మరోపక్క నాని రాక కోసం ఇంట్లో అందరూ ఎదురు చూస్తూ ఉంటారు అని వచ్చిన తర్వాత జీవితం ఏమైంది అని అడిగితే నేను గతంలో కొంత డబ్బులు అడ్వాన్స్ తీసుకున్నాను అలాగే నన్ను జైలు నుంచి విడిపించడం కోసం అత్తయ్య గారు చాలా డబ్బు ఖర్చు పెట్టారు కాబట్టి నా జీవితం నుంచి మినహాయించుకోమని అకౌంట్ కు చెప్పాను అని అంటాడు. మిగతా డబ్బు అయినా వస్తుంది కదా అంటే మొత్తం జీతాన్ని మినహాయించుకోమని అన్నాను అని అంటాడు. దీంతో కుటుంబ సభ్యులు అందరూ అవుతారు కానీ ఇంతలో లక్ష్మణ్ వచ్చి తనకు ప్రాజెక్టు ఓకే అయిందని మనం ఎంత త్వరగా ప్రాజెక్టు ఇస్తే అంత త్వరగా రెండు లక్షల రూపాయలు మన చేతికి వస్తాయి అని అంటాడు. దీంతో లక్ష్మణ్ వైపు ఉన్న కుటుంబ సభ్యులందరూ ప్రాజెక్టు కోసం కష్టపడుతూ ఉంటారు. మరోపక్క సీత అదే కొండలరావు ఇంట్లో భార్యకు ఆరోగ్యం బాగోక పోతే కేర్ టేకర్ గా పని చేయడం మొదలుపెడుతుంది.

కేర్ టేకర్ గా సీత

కేర్ టేకర్ గా సీత


విషయం అర్థమైన కొండలరావు ఈ విషయాన్ని తన భార్య కూడా చెప్పి వీరిద్దరూ భార్యాభర్తలు కానీ ఒకరికి తెలియకుండా ఒకరు మన దగ్గర పని చేస్తున్నారు వీరి గురించి ఎక్కడా కూడా మనం ఈ విషయం బయట పెట్టవద్దు అని నిర్ణయం తీసుకుంటారు. ఇక అలా ఈరోజు ఎపిసోడ్ ముగించారు కమింగ్ ఎపిసోడ్ లో చూపిస్తున్న దాని ప్రకారం రఘురాం కొండలరావు ఇంటికి మందులు డెలివరీ ఇవ్వడానికి వెళ్లినట్టు చూపించారు. ఎందుకు ఇంత ఆలస్యం అయింది అని అడగటంతో నడుచుకుంటూ రావడంతో ఆలస్యమైందని రఘురాం చెబుతాడు. అదే ఇంట్లో ఉన్న సీత భర్తను చూసి వెంటనే టీ పెట్టి తీసుకువచ్చి రఘురాం చూడకుండా ఆయన పక్కన పెట్టి వెళ్లి పోతుంది. టీ తాగిన వెంటనే అది సీత చేతితో చేసిన టి అని అర్థమైన రఘురాం ఇంట్లోకి చూడగానే సీత అక్కడ పని చేస్తూ కనిపిస్తుంది. దీంతో రఘురాం ముందు షాక్ అవుతాడు, ఆ తర్వాత బాధపడతాడు. వదినమ్మ కొనసాగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X