Vadinamma: దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన సీత.. రాజేశ్వరికి డెడ్ లైన్?
స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ఆసక్తికరంగా సాగుతుంది. రఘురాం తన కన్న కొడుకు కాదు అనే విషయం రాజేశ్వరి తన కొడుకులు లక్ష్మణ్, నాని ఇద్దరికీ చెప్పడంతో కుటుంబంలో మరో ముసలం ఏర్పడిన సంగతి తెలిసిందే. జైలు నుంచి విడుదలైన రఘురాం తన తల్లిని నా తమ్ముళ్లకు ఈ విషయం చెప్పావా అని అడిగితే చెప్పాను అని చెబుతుంది. అంతేకాక భరత్ గీత దాటి వచ్చేలాగా చేయమని ఆమె రఘు రాముని ఆజ్ఞాపిస్తుంది. అక్కడితో గత ఎపిసోడ్ ముగించారు. ఇక తాజాగా జరుగుతున్న ఎపిసోడ్ ప్రకారం ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

సీత షాక్
రాజేశ్వరి బయట కూర్చుని ఆలోచిస్తూ ఉండగా భర్త ద్వారా రాజేశ్వరి చేసిన ఘనకార్యం తెలుసుకున్న సీత ఆమె దగ్గరకు వెళ్లి ఆమెకు షాక్ ఇస్తుంది. నేను మీతో మాట్లాడాలి అంటే రాజేశ్వరి మాత్రం సీతతో మాట్లాడటానికి ఆసక్తి చూపించకుండా వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకు అలా ముఖం చాటేస్తున్నారు? మీరు తప్పు చేసిన విషయం మీకు కూడా అర్థం అవుతుందా అని సీత ప్రశ్నిస్తుంది.
అదేమీ లేదు నాకు నీతో మాట్లాడే అంత సమయం లేదు అని రాజేశ్వరి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. మీరో నాతో మాట్లాడటం అవసరం లేదు నేను చెప్పేది వింటే చాలు అని సీత ఆమెతో చెబుతుంది. ఏమిటో చెప్పమని రాజేశ్వరి అనడంతో సీత నేను మీ కోడలిగా మీ అడుగుజాడల్లోనే అన్ని విషయాలు మీ నుంచే నేర్చుకున్నాను అని సీత చెబుతోంది.

ఏమైపోతారో?
ఇప్పుడు కూడా మీ బాటలో నడుస్తూ నేను ఒక నిజాన్ని మన కుటుంబ సభ్యులు అందరికీ చెప్పాలని అనుకుంటున్నాను అని అంటుంది. అయితే ఏం చెప్తావ్? ఏమి నిజం? అంటూ రాజేశ్వరి కంగారుపడుతూ సీత మీద ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. దీంతో సీత మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు ఎందుకు కంగారు పడుతున్నారు? మీరు ఎలాంటి తప్పు చేయలేదు కదా అని దెప్పి పొడుస్తూ రిషి నా కొడుకు అనే విషయాన్ని నేను బయట పెట్టాలి అనుకుంటున్నాను అని చెబుతోంది.
అదేంటి అలా ఎలా చెబుతావు? నువ్వు అలా చెబితే లక్ష్మణ్ శైలు ఏమైపోతారో నీకు తెలియదా? నువ్వు అంత స్వార్థంగా ఎలా ఆలోచిస్తున్నావు అని సీతను రాజేశ్వరి ప్రశ్నిస్తుంది.

విషమిచ్చి చంపేయ్
ఇక్కడ ఎవరి స్వార్థం వాళ్లే ఆలోచించు కుంటున్నారు నేను కూడా మీలాగానే స్వార్థంతో ఆలోచించాలి అనుకుంటున్నాను అని చెబుతుంది. అంతేకాక మీరు చెబుతారా నన్ను చెప్పమంటారా అని సీత బెదిరించడంతో కొన్నాళ్ళు టైం ఇవ్వు నేను శైలుకు విషయం చెప్పి మీకు ఇప్పించే ప్రయత్నం చేస్తాను అని రాజేశ్వరి అంటుంది.
అయితే సీత కోపంగా నేను ఎక్కువ రోజులు ఆగలేను అంటే నన్ను ఇలా టెన్షన్ పెట్టడం కంటే కొంచెం విషమిచ్చి చంపేయ్ కదా అని రాజేశ్వరి ఆడుతుంది.. మీరు ఆల్రెడీ మాకు ఇచ్చి చంపేశారు అని సీత బాధపడుతుంది. మరోపక్క తన అన్నయ్య రఘురాంతో తల్లి మాట్లాడుతున్న అన్ని మాటలు విన్న భరత్ తీవ్రస్థాయిలో బాధపడుతూ ఉంటాడు.

తగ్గిపోయిందా?
అలాగే లక్ష్మణ్ పనిచేస్తున్న ఆఫీస్ దగ్గరికి వెళ్లిన భాస్కర్ లక్ష్మణ్ తో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. నువ్వు మీ అన్నయ్య విషయంలో చేస్తున్నవన్నీ తప్పు అని చెప్పే ప్రయత్నం చేయడంతో అసలు రఘురామ్ మా అన్నయ్య కాదు అని లక్ష్మణ్ బాంబు పేల్చాడు. తన తల్లి కడుపున రఘురాం పుట్టలేదు అని చెబుతూ తన తమ్ముడు భరత్ కోసం నేను ఆ కిరాణా షాపు మా మామ గారి దగ్గర తీసుకొని వాడికి ఇచ్చేస్తాను అని చెబుతాడు.
ఈ సమాధానాలు ఏ మాత్రం ఊహించని భాస్కర్, ఈ ఒక్క నిజం తెలియడంతో మీ అన్నయ్య మీద ఉన్న గౌరవం అంతా తగ్గిపోయిందా? ఇప్పటివరకు వాడు చేసిన అన్ని పనులు నీకు ఇప్పుడు శత్రుత్వంగా కనిపిస్తున్నాయా అని ప్రశ్నిస్తాడు.

కమింగ్ అప్ లో
మరోపక్క భరత్ బాధపడుతూ ఉండడంతో సిరి వెళ్లి ఏం జరిగింది అని అడుగుతుంది. భరత్ జరిగిన విషయం అంతా చెప్పి నేను ఎట్టిపరిస్థితుల్లోనూ అన్న వదిన లను వదిలి వెళ్లడానికి ఆసక్తి చూపించనని చెబుతాడు. నువ్వు కూడా నా మాట విని నాతో ఉండు అని భరత్ అడగడం తో ఎలాంటి పరిస్థితులు వచ్చినా నేను నీ బాటలో నడుస్తా అని సిరి ధైర్యం చెబుతుంది.
ఇక భారత్ వెళ్లి రఘురాం కాళ్ళ మీద పడి అటువైపు వెళ్ళాలా, ఇటు వైపు ఉండాలా నిర్ణయించుకోమని చెబితే నాకు చావే శరణ్యం అన్నట్లు మాట్లాడుతాడు. ఏంటి బెదిరిస్తున్నావా అంటే కాళ్ళ దగ్గర కూర్చుని కాళ్ల మీద పడి బెదిరించే పరిస్థితి ఉండదు నేను నిన్ను బతిమిలాడు కుంటున్నాను అన్న అని చెబుతాడు. అయితే మిగతా కుటుంబ సభ్యులందరూ భరత్ తమతో కలిసి పోతాడు అని ఆనందం వ్యక్తం చేస్తూ ఉండగా భరత్ ఈ విధంగా షాక్ ఇవ్వడంతో వాళ్ళందరూ బాధపడతారు.
ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగించారు తరువాత ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం మీరు ఉన్నంతకాలం భరత్ మీ వెంటే ఉంటాడు కాబట్టి వాడికి మీరు కనపడకుండా వెళ్ళిపోతే అప్పుడు మాకు దగ్గర అవుతాడు కాబట్టి మీరు వెళ్లిపోండని రఘురాంకి రాజేశ్వరి చెప్పడం చూపించారు. చూడాలి మరి ఏం జరగబోతోంది అనేది.


Click it and Unblock the Notifications











