Vadinamma : జాతరలో షాప్ కి సూపర్ రెస్పాన్స్.. కానీ శైలు ప్లాన్ కి అంతా వృధా..కానీ మరో అవకాశం?

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది. గుడికి రెండు లక్షల రూపాయల విరాళం ఇచ్చే విషయం మీద రెండు గ్రూపులుగా విడిపోయిన రఘురాం కుటుంబం ఎలా అయినా తాము మాత్రమే ఆ రెండు లక్షలు సంపాదించి డబ్బు కట్టాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అందులో భాగంగా శైలు లాప్టాప్ మీద నీళ్లు ఒలికి పోవడంతో వారి కష్టమంతా వృధా అవుతుంది ఈ క్రమంలోనే రఘురాం కుటుంబం తయారుచేసిన స్వీట్లను పాడు చేయమని శైలు పంపిస్తుంది. అనుకోని పరిస్థితుల్లో నూతిలో పడిన లింగం రాత్రంతా బావిలోనే ఉండే సరికి గడ్డకట్టుకు పోతాడు.. తర్వాత లింగాన్ని పైకి తీసిన శైలు ఇంటికి పంపించేసింది. అక్కడితో గత ఎపిసోడ్ ముగిసింది. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

జాతర వద్దకు వెళ్లి

జాతర వద్దకు వెళ్లి


జనార్ధన్ ఇంటికి వెళ్ళిన తర్వాత లింగం చలితో బాధపడుతూ దుప్పటి కప్పుకుని మూలుగుతూ ఉంటాడు. ఎవరో దొంగ ఇంట్లోకి వచ్చాడు అనుకుని జనార్ధన్ ఒక్క తన్ను తన్నాడు. ఆ తర్వాత అక్కడ ఉన్నది లింగం అని అర్థం చేసుకుంటాడు. ఏమైంది ఎందుకు ఇలా అడుగుతున్నారు అంటే అసలు ఏం జరిగింది అనే విషయం పూర్తిగా అర్థం అయ్యే విధంగా చెప్పుకొస్తాడు లింగం. అయితే తాను నీళ్లు ఒలకబోసిన సంగతి చెప్పకుండా రఘురాం స్వీట్లు నాశనం చేయాలి అనే ఉద్దేశంతో వెళ్ళాను కానీ అక్కడ నుంచి అనుకోని పరిస్థితుల్లో వెనక్కి వచ్చి చేయాల్సి వచ్చిందని ఇలా నూతిలో పడ్డాను అని చెబుతాడు. శివరాత్రి జాతర వద్దకు వెళ్లి అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఏం చేయాలి ఎలా చేయాలి అనే విషయం ప్లాన్ చేయాలి అని ఇద్దరు అనుకుంటారు.

 అంతకు మించి ఏమీ లేదు

అంతకు మించి ఏమీ లేదు


మరోపక్క రఘురాం సీత షాపు వద్ద నుంచుని తినుబండారాలు అమ్ముతూ ఉంటారు. భరత్, సిరి మార్కెటింగ్ చేస్తూ కస్టమర్లను అక్కడికి పంపిస్తూ ఉంటారు. స్వీట్లు తిన్న ఒక వ్యక్తి తన జీవితంలో ఇలాంటి స్వీట్లు ఎప్పుడూ తినలేదని అంత అద్భుతంగా సీట్లు ఉన్నాయని చెబుతూ అందరూ వచ్చి స్వీట్లు కొనుక్కో అని చెబుతాడు. అతని నోటి చలవతో అక్కడ జాతరకు వచ్చిన అందరూ స్వీట్లు కొనుక్కుని వెళుతూ ఉంటారు. శైలుకి ఇదంతా చూసి మండుతూ ఉంటుంది. నువ్వు నేను చెప్పిన పని చేయడం లేదు ఈ పని అయినా సరిగ్గా చేయి అని లింగానికి పక్కకి పిలిచి మరీ వార్నింగ్ ఇస్తుంది. తర్వాత జనార్ధన ఏమిటి నా కూతురు నీకు చెబుతుంది అంటే నువ్వు గట్టిగా చేయమని చెప్పింది ఆమె మెల్లగా చేయమని చెప్పింది. అంతకు మించి ఏమీ లేదు అని లింగం చెబుతాడు.

పూజా హెగ్డే, రష్మిక మందన కలిసి

పూజా హెగ్డే, రష్మిక మందన కలిసి


ఇంతలో ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండగా శైలు, శిల్పా కలిసి నడుచుకుంటూ వెళుతూ ఉంటారు. అక్కడ ఉన్న ఇద్దరు ఆకతాయిలు పూజా హెగ్డే, రష్మిక మందన కలిసి ఎక్కడికి వెళుతున్నారు అంటూ కామెంట్ చేస్తారు. నేను ఎమ్మెల్యే కూతుర్ని నన్ను ఇలా కామెంట్ చేస్తావా అని శైలు వెళ్లడంతో ఆమె చేయి పట్టుకొని అసభ్యంగా ప్రవర్తిస్తారు. మీ నాన్న ఒక దగుల్బాజీ డబ్బు కోసం ఏమైనా చేస్తాడు అని అందరూ అనుకుంటున్నారు అంటూ తండ్రి గురించి కూడా తప్పుగా మాట్లాడుతారు. ఈ విషయాన్నిగురించి బాధపడుతూ వచ్చిన శైలు, శిల్ప ఇద్దరు వెళ్లి జనార్ధన్ నాని, లక్ష్మణులకు చెబుతారు.

ఇబ్బంది పెట్టొద్దు

ఇబ్బంది పెట్టొద్దు


మా కూతురు ని అలా అవమానిస్తారా అంటూ జనార్ధన్ తుపాకీ తీసుకుని వాళ్ల ను భయపెడదామని అక్కడికి వెళ్తే ఈలోపే వాళ్ళందరికీ దెబ్బలు తగిలి ఉంటాయి. ఏమైంది ఎందుకు ఇలా జరిగింది అని అడిగితే మీరు రఘురాం మరదలు అని ఎందుకు చెప్పలేదు మీరు అలా వెళ్లారో లేదో ఆయన తమ్ముడు భరత్ వచ్చి మమ్మల్ని విరగ్గొట్టాడు. ఇలాంటి ఏదైనా ఉంటే ముందే చెప్పాలి కదా మేము ఏదో సరదాకి అంటే మీరు ఇంత సీరియస్ గా తీసుకుంటారు అనుకోలేదు అని వాళ్ళు బాధ పడతారు. ఇకమీదట మీ ఆడవాళ్ళను ఏమీ అనను అంటూ ఉంటే లక్ష్మణ్ కి కోపం వచ్చి మా ఆడవాళ్ళని కాకుండా వేరే వాళ్ళను అంటరా అని వెళ్లి మళ్ళీ తగిలిస్తాడు. మీ ఆడవాళ్ళని, అసలు ఆడవాళ్ళని కూడా ఏమీ అనం. ఇప్పటికే మీ తమ్ముడు మా మక్కెలు విరగ్గొట్టాడు మీరు ఇంకా ఇబ్బంది పెట్టొద్దు అని వాళ్ళు కోరతారు.

పాతిక లక్షల రూపాయల ఆర్డర్

పాతిక లక్షల రూపాయల ఆర్డర్


అయితే భరత్ కి, శైలుకి పడకుండా ఉంది కదా అయినా శైలుని ఏడిపిస్తే భరత్ ఎందుకు వాళ్ళను కొట్టాడు అని జనార్దన్ అడిగితే మళ్లీ కుటుంబాలను కలిపేందుకు ప్రయత్నిస్తున్నాడు అని లింగం చెబుతాడు. మరోపక్క జనార్దన్ ఏర్పాటు చేసిన మనిషి స్టాల్ వద్దకు వెళ్లి స్వీట్లు కొన్ని అద్భుతమైనవని పొగుడుతూ ఉంటాడు. పాతిక లక్షల రూపాయల సరుకు కావాలని కూడా అడుగుతాడు. దీంతో అతనిని కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటారు రఘురాం అండ్ కో.

ఏమవుతుందో?

ఏమవుతుందో?


అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగిసింది. ఇక తరువాతి ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం సీతా రఘురాం దిగాలుగా కూర్చుని ఉంటారు. అయితే జాతరలో ఆటల పోటీలు నిర్వహిస్తున్నామని నజరానా భారీగా ఉంటుందని మైక్ లో అనౌన్స్మెంట్ వినిపిస్తుంది. మనం షాపు పెట్టి ప్రయత్నం చేశాము కానీ అది సఫలం కాలేదు కనీసం ఇలా అయినా ప్రయత్నించాలి అని అంటుంది సీత. కట్ చేస్తే భరత్ స్లో సైక్లింగ్ చేస్తూ ఉంటాడు వాడి పక్కన ఉన్న ఇద్దరు మనుషులు వాడిని ఓడించడానికి నేను పెట్టాను అని జనార్ధన్ అంటూ ఉంటాడు. చూడాలి మరి తర్వాత ఎపిసోడ్ ఎలా సాగిపోతోంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X