Vadinamma : పాపం రఘురాం.. బొద్దింక దెబ్బకు లక్ష రూపాయలు మాయం.. సీత మిస్సింగ్!
వదినమ్మ సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది. ఎలా అయినా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో రఘురాం, భరత్, సీత, సిరి కలిసి పిండి వంటలు సిద్ధం చేసి దానిని జాతరలో అమ్మాలని తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. అలా తీసుకురావడం జాతరలలో వీరి పిండివంటలకు మంచి పేరు రావడంతో భారీగా సేల్ అవుతూ ఉంటుంది. ఈ సమయంలో జనార్ధన్ లింగం కలిసి ఒక వ్యక్తిని పంపించగా సదరు వ్యక్తి పాతిక లక్షల రూపాయల కాంట్రాక్టు కావాలి అని చెబుతాడు. దీంతో వాళ్లు అతనికి కుర్చీ వేసి కూర్చోబెడతారు. అలా కూర్చో పెట్టడంతో కథ ఎపిసోడ్ ముగిసింది. తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

హాస్పిటల్ కి
తాజా ఎపిసోడ్ లో రఘురామ్ ఫ్యామిలీ ఒకపక్క సరుకు అమ్ముతూ బిజీబిజీగా ఉంటుంది. ఈ సమయంలో తాను వచ్చిన పని మొదలుపెట్టాలి అని భావించిన సదరు వ్యక్తి తన జేబులో ఉన్న బొద్దింక ను తీసి దానిని స్వీట్ పాకెట్ లో కలిపి దానితో అందరిని నమ్మించే ప్రయత్నం చేస్తాడు. అంతేకాక మీకు పాతిక లక్షల రూపాయల కాంట్రాక్టు ఇవ్వాలని అనుకున్నాను కానీ మీరు ఇలా అపరిశుభ్రంగా చేస్తారనే విషయం నాకు తెలియదు ఇప్పుడు నాకు ఏం జరుగుతుందో నాకే తెలియడం లేదు అని చెబుతూ పడిపోయినట్లు నాటకం ఆడుతాడు. ఇంతలో లింగం చేత నియమించబడిన మరో వ్యక్తి అక్కడికి వచ్చి అతని ఏమైందో అర్థం కావడం లేదు అతను చనిపోతే మీరు బాధ్యులు అవుతారు అని ప్రశ్నిస్తాడు. దీంతో రఘురామ్ కుటుంబ సభ్యులందరూ భయపడుతూ ఉంటారు. మీరు మంచి వాళ్ళ లాగా కనబడుతున్నారు అతనిని నేను హాస్పిటల్ కి తీసుకు వెళతాను. దానికి తగిన డబ్బు ఇవ్వమని అడుగుతాడు.

స్లో సైక్లింగ్
ఎంత ఇవ్వాలి అని అడుగుతుంటే హఠాత్తుగా మీ దగ్గర ఎంత ఉన్నాయి అని అడిగి చేతిలో ఉన్న లక్ష రూపాయలు తీసుకుని కింద పడిన వ్యక్తిని తీసుకొని వెళ్ళి పోతాడు. భరత్ ఆవేశంగా లక్ష రూపాయలు తీసుకుని వెళుతున్నాడు, హాస్పిటల్ కి అంత అవ్వదు కదా నేను వెళ్లి డబ్బులు లాక్కుని తీసుకురానా అని అడుగుతాడు అయితే వద్దు అని రఘురాం వారిస్తాడు. కష్టపడి సంపాదించిన ఒక లక్ష రూపాయల డబ్బు పోవడంతో ఏం చేయాలో అర్థం కాక రఘురాం కుటుంబ సభ్యులు అందరూ గుడి మెట్లమీద కూర్చుని బాధపడుతూ ఉంటారు. ఇంతలో జాతర మహోత్సవాలు నేపథ్యంలో ఆటల పోటీలు నిర్వహిస్తున్నామని అందులో స్లో సైక్లింగ్ ఉంటుందని ప్రకటన వస్తుంది, అలాగే ముగ్గుల పోటీ కూడా నిర్వహిస్తామని అందులో గెలిచిన వారికి కూడా మొదటి బహుమతి 50 వేలు రెండో బహుమతి 30 వేలు మూడవ బహుమతి పది వేలు చొప్పున ఇస్తామని ప్రకటిస్తారు.

మోసం చేసి
అయితే ఇలా జరుగుతూ ఉండగా అన్నయ్య వదినలు కష్టపడి సంపాదించిన డబ్బు ని ఇలా మోసం చేసి వాళ్ళకు కాకుండా చేయడం కరెక్ట్ కాదు అని లక్ష్మణ్ బాధపడుతూ ఉంటాడు. నువ్వు ఇలాంటి వాడిని కాబట్టి ఏమీ చేయలేక పోతున్నాము అని శైలు అంటుంది అంతే కాక ఇప్పుడు మరో అవకాశం వచ్చింది స్లో సైక్లింగ్ చేయాలి నువ్వు గెలవాలి అని అడుగుతుంది. కచ్చితంగా ప్రయత్నిస్తానని లక్ష్మణ్ అంటాడు. అయితే శైలు మరో రెండు మూడు రోజుల్లో ప్రాజెక్టు పూర్తి అవుతుంది కాబట్టి అప్పటి వరకు మా నాన్న దగ్గర డబ్బు అప్పుగా తీసుకుని ఆ తర్వాత తీర్చేద్దామని అంటుంది. కానీ అది కరెక్ట్ కాదు నేను చేయలేను పైన దేవుడు చూస్తూ ఉంటాడు అని లక్ష్మణ్ అంటాడు. దానికి శైలు బాధపడి సరే సైకిలింగ్ లో అయినా డబ్బు గెలువు, ఆ డబ్బుతో అయినా మనం విరాళం ఇద్దామని అంటుంది. ఇలా జరుగుతూ ఉన్న సమయంలో సైక్లింగ్ కోసం కూడా అందరూ సిద్ధం అవుతారు. కానీ ఈలోపు సైక్లింగ్ వ్యవహారంలో కూడా భరత్ను పడగొట్టాలని జనార్ధన్ మనుషులను ఫిక్స్ చేస్తాడు

ఓడి పోయిన లక్ష్మణ్
అయితే చివరికి రఘురాం భరత్ లక్ష్మణ్ మాత్రమే మిగులుతారు అందులో రఘురాం ముందు వెళ్ళి పోతాడు గాని భరత్, లక్ష్మణ్ మధ్య పోటీ ఉంటుంది. లక్ష్మణ్ ఇప్పటికే తన కారణంగా ఓడిపోతున్నారు అనే ఉద్దేశంతో తాను ఓడి పోతున్నట్లుగా కాళ్ళ కింద పెట్టేస్తాడు. దీంతో భరత్ 50 వేల రూపాయలు గెలుచుకుంటాడు.. నా తమ్ముడి చేతిలోనూ ఓడిపోవడం పెద్ద విషయమా అన్నట్లు లక్ష్మణ్ మాట్లాడుతాడు. అయితే మొదటి చివరి బహుమతులు మాత్రం రఘురాం, భరత్ లకు లభిస్తాయి. మరోపక్క ముగ్గురు పోటీలకు సిరీ, సీత సమాయత్తం అవుతున్నట్లు చూపిస్తారు అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగిసింది.
Recommended Video

సీత మిస్సింగ్
కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం జాతర మహోత్సవాలు ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా సీత మిస్ అవుతుంది. సీత ఎక్కడ ఉంది అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు కానీ ఎక్కడా కనిపించదు. కానీ జనార్ధన్ వికటాట్టహాసం చేసుకుంటూ బయటకు రావడం చూస్తుంటే అతను సీతను ఏదో చేయడానికి ప్రయత్నించినట్లు అర్థమవుతోంది. దీంతో రాబోయే ఎపిసోడ్లు మరింత ఆసక్తికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











