Vadinamma : రఘురాం అండ్ కో చివరి ప్రయత్నం.. మిస్సయిన సీత ఏమయింది?

స్టార్ మా వదినమ్మ సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది. ఎలా అయినా డబ్బు సంపాదించి గుడికి రెండు లక్షల రూపాయల విరాళం ఇచ్చి గెలవాలని రఘురాం అండ్ కో లక్ష్మణ్ అండ్ కో ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా రఘురాం సీత, భరత్- సిరి కలిసి పిండివంటలు చేసి వాటిని జాతరలో అమ్ముతుండగా ఒక వ్యక్తి అందులో బొద్దింక వచ్చింది దాని వలన అనారోగ్యం పాలయ్యాను అని చెబుతూ వాళ్ళ వ్యాపారం మొత్తానికి నష్టం చేకూర్చే విధంగా ప్రవర్తిస్తాడు. అంతేకాక అప్పటివరకు అమ్మిన లక్ష రూపాయల డబ్బులు కూడా వేరే వ్యక్తి సాయంతో లాక్కుని జనార్ధన్ ప్లాన్ ప్రకారమే అక్కడి నుంచి ఉడాయిస్తాడు. మరో పక్క స్లో సైకిలింగ్ పోటీలలో కూడా పాల్గొంటారు. అక్కడితో గత ఎపిసోడ్ ముగించారు. ఇక తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ముగ్గుల పోటీ కూడా

ముగ్గుల పోటీ కూడా

రఘు రామ్, భరత్, లక్ష్మణ్ ముగ్గురు కూడా స్లో సైక్లింగ్ పోటీలలో పాల్గొన్న సంగతి తెలిసిందే. అందులో భరత్ కి మొదటి స్థానం లక్ష్మణ్ కి రెండవ స్థానం రఘు రామ్ కి మూడవ స్థానం లభిస్తాయి. ఇక ఆ తర్వాత ముగ్గుల పోటీలు నిర్వహిస్తారు. ముగ్గుల పోటీల్లో కూడా సిరి, సీత, శైలు ముగ్గురు కూడా పాల్గొంటారు. ఎప్పటిలాగానే సీత అద్భుతంగా ముగ్గు వేస్తుంది. శైలు ఇబ్బంది పడుతున్నట్లు అనిపించడంతో సీత కొన్ని సలహాలు ఇవ్వబోతుంది. సీత ఇచ్చే సలహాలు నేను వినడం ఏమిటి అనే ఉద్దేశంతో శైలు మధ్యలో ముగ్గు వేయడం ఆపివేసి వెళ్ళిపోతుంది. అయితే సిరి కి మాత్రం సీత కొన్ని సూచనలు ఇస్తుంది. అలా ఎట్టకేలకు ముగ్గుల పోటీ కూడా ముగుస్తుంది. ఈ ముగ్గుల పోటీలో సీతకు మొదటి స్థానం లభించగా రెండో స్థానం సిరికి లభిస్తుంది మూడవ స్థానం మాత్రం శైలుకు లభిస్తుంది.

 బొద్దింక పేరుతో నాటకమాడి

బొద్దింక పేరుతో నాటకమాడి

ఎవరైనా మధ్యలో ఆపేసిన ముగ్గుకు ప్రైజ్ ఇస్తారా ఏమిటి ఎవరో వేరే శైలు అయ్యుంటుంది అని శైలు అనుకుంటూ ఉండగా పక్కనే ఉన్న సిరి కల్పించుకుని నువ్వే, నువ్వు మధ్యలో వెళ్ళిపోతే ఎలా అయినా నువ్వు కూడా గెలవాలి అనే ఉద్దేశంతో ఎవరూ చూడకుండా సీతక్క ఆ ముగ్గు పూర్తి చేసింది అని చెబుతోంది. ఆనంద పడాల్సిన శైలు నాకు ఏమీ చేతకాదు అని చూపించడం కోసమే ఇలా సీత ప్రవర్తించింది అని భావిస్తూ భర్తకు కూడా అలాగే చెబుతుంది. ఎంతకూ ప్రైజ్ తీసుకోవడానికి రాకపోవడంతో శైలు స్థానంలో లక్ష్మణ్ ఆ బహుమతి అందుకుంటాడు. తర్వాత రఘురాం కుటుంబ సభ్యులు అందరూ ఒకచోట కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు అదే సమయంలో జనార్దన్ అక్కడికి వచ్చి ఇంకా ఒక్క రోజే రేపు ఉదయానికల్లా లక్ష్మణ్ శైలు ఉన్న వైపు కి భరత్ ను పంపడానికి సిద్ధంగా ఉండమని రెచ్చగొడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయానికి హేమ దగ్గర బొద్దింక పేరుతో నాటకమాడి లక్ష రూపాయలు తీసుకువెళ్ళి పోయిన వారిలో ఒకడు లింగంతో మాట్లాడుతూ కనిపిస్తాడు.

నిన్ను ఎవరు పంపించారు ?

నిన్ను ఎవరు పంపించారు ?

వాటిని చూడగానే భరత్ ఆవేశంగా ఊగిపోతూ అన్నయ్య నేను వాడిని పట్టుకుని తీసుకు వస్తాను మీరు అంతా ఇక్కడే ఉండండి అని చెబుతూ అతని కోసం పరిగెడతాడు. భరత్ అలా ఆవేశంగా పరిగెట్టడం చూసిన రఘురాం అలాగే మిగతా కుటుంబ సభ్యులు కూడా ఏం జరుగుతుందో అనే భయంతో అతని వెనక పరిగెడతారు. అప్పటివరకు లింగంతో ముచ్చట్లు పెట్టిన సదరు వ్యక్తి భరత్ పరిగెత్తుకొని రావడం చూసి పరిగెత్తడానికి సిద్ధమవుతాడు. ఇంతలో లింగం మా పేరు కనుక బయటకు వస్తే నిన్ను చంపేస్తానని బెదిరిస్తాడు. దీంతో అతను భయపడుతూ పరిగెత్తు ఉండగా ఎట్టకేలకు భరత్ అతనిని పట్టుకుంటాడు పట్టుకుని చితకబాదిన తర్వాత నిన్ను ఎవరు పంపించారు ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయి అని అడుగుతాడు.

 ఏమీ చేయలేము

ఏమీ చేయలేము

తనకు లింగం తో ఎలాంటి సంబంధం లేదు అని ఒకే ఊరు వాడు కావడంతో కాస్త నిలబడి మాట్లాడాను తప్ప మా ఇద్దరికీ ఎలాంటి సంబంధం లేదని చెబుతాడు. చాలాసేపు కొట్టిన తర్వాత కూడా అతని నుంచి అదే సమాధానం రావడంతో భరత్ చేసేదేమీలేక వెనక్కి వెళ్తాడు. రఘు రామ్, సీత అలాగే మిగతా వాళ్ళు వచ్చి అసలేం జరిగింది అతనిని ఎందుకు వదిలేసావు అని అడిగితే అతను దగ్గర డబ్బులు లేవు, పట్టుకుని కూడా అతనిని ఏమీ చేయలేము అని అంటాడు.

 ఫంక్షన్ క్యాన్సిల్

ఫంక్షన్ క్యాన్సిల్

అలా ఎందుకు వదిలేసావు పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్లు డబ్బులు ఇస్తారు కదా అంటే ఇక్కడ ఎస్ఐ ఎవరో? మర్చిపోయారా మనం ఏమీ చేయకుండానే అరెస్టు చేసి జైలులో పెట్టాడు, ఇప్పుడు మనకు సహాయపడతాడు అని ఎలా నమ్మగలం అని ఎదురు ప్రశ్నిస్తాడు. ఇక అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగిసింది. మిస్సయిన సీత ఏమయింది? అనేది కూడా చర్చనీయాంశం అయింది. తరువాతి కమింగ్ ఎపిసోడ్ లో చూపిస్తున్న దాని ప్రకారం జాతరలో ఒకరు ఏదో ఒక ఈవెంట్ కోసం ఆర్డర్ ఇవ్వడంతో అప్పటివరకు పోటీలలో గెలుచుకున్న మొత్తం పెట్టి దాని కోసం సరుకులు సిద్ధం చేస్తారు కానీ ఉదయాన్నే వచ్చి తీసుకు వెళ్లాల్సిన అతను అవతలి పార్టీకి సంబంధించి ఎవరో బంధువులు చనిపోయారు అని అందుకే ఫంక్షన్ క్యాన్సిల్ అయింది అని వార్త చెబుతాడు. దీంతో అందరూ షాక్ అవుతారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X