Vadinamma : ఎవరూ ఊహించని పరిస్థితుల్లో మిస్సైన సీత.. కానీ టెన్షన్ మాత్రం అలానే?
వదినమ్మ సీరియల్ ఆసక్తికరంగా సాగుతుంది. ఎలా అయినా డబ్బు సంపాదించి రెండు లక్షల 16 వేల రూపాయల విరాళం ఇవ్వాలని రఘురామ్ కుటుంబ సభ్యులు అలాగే విడిపోయిన లక్ష్మణ్, నాని కుటుంబ సభ్యులు విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఒకరు ప్రాజెక్ట్ వర్క్ చేయాలి చేస్తే డబ్బులు వస్తాయని భావించి చేస్తూ ఉండగా శైలు లాప్ టాప్ మీద నీళ్లు పడడంతో కుటుంబ సభ్యులు ముందు వచ్చిన డబ్బులతో స్వీట్లు, పిండి వంటలు తయారు చేసి డబ్బులు సంపాదించాలని భావిస్తారు. అయితే జాతరలో జనార్ధన్ ప్లాన్ ఫలించడంతో డబ్బు ఏమీ దక్కకుండా పోయాయి. అయితే పోటీలలో మాత్రం లక్ష రూపాయలకు పైగా డబ్బులు గెలుచుకుంటారు. అక్కడితో గత ఎపిసోడ్ ముగిసింది. తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

108 బిందెలతో అభిషేకం
దొంగ వెధవలలో ఒకడు భరత్ కంట పడడంతో వాడి పని పట్టాలి అనే ఉద్దేశంతో ఆవేశంగా పరిగెత్తుకుంటూ వెళతాడు. వెళ్లి వాడి పనిపట్టే ప్రయత్నం చేస్తూ ఉండగా అతని వద్ద రూపాయి కూడా లేదు అనే విషయాన్ని తెలుసుకుంటాడు. దీంతో ఏమీ చేయలేక వెనక్కి తిరిగి వస్తారు. అయితే పూజా కార్యక్రమాలు అన్నీ ముగిసిన తర్వాత వెనక్కి వెళ్ళడానికి అంతా సిద్ధం అవుతారు కానీ తనతో పాటు ఉండాల్సిన సీత కనపడటం లేదు అనే విషయాన్ని అర్థం చేసుకుంటాడు. సీత ఏమైంది అని అర్థం కాక అన్ని ప్రదేశాల్లో వెతుకుతూ ఉంటారు. చివరికి తాను అక్కడే ఉన్న శివాలయంలో శివునికి అభిషేకం చేస్తూ కనిపిస్తుంది. ఎందుకు ఇక్కడ ఇలా చేస్తున్నావు ఇంత రాత్రి సమయంలో చేయకూడదు అంటే నేను మన కష్టాలు గట్టెక్కించాలని 108 బిందెలతో అభిషేకం చేస్తా అని మొక్కుకున్నాను అని అది పూర్తయ్యే వరకు రాలేను అని సీత చెబుతుంది.

20 శాతం కమిషన్
కుటుంబ సభ్యులు ఎంత చెబుతున్నా వినకుండా సీత తాను పట్టిన పట్టు విడవకుండా పూర్తి చేస్తుంది. ఆమె బలమైన కోరిక విన్న భగవంతుడు పంపించాడా అన్న విధంగా స్వీట్ షాప్ దగ్గర ఉదయం స్వీట్లు తిని మిగతా అందరి చేత కొనిపించిన వ్యక్తి అక్కడికి వస్తాడు. మీరు ఉన్నారా వెళ్లిపోయారా అని టెన్షన్ పడుతూ వచ్చాను మీరు ఉన్నారు అదే పదివేలు అని చెబుతూ తన మేనల్లుడి పెళ్లి ఒకటి ఉంది అని దాని కోసం మీ సరుకు కావాలి అని అడుగుతాడు. అయితే అది తీసుకోవాలి అంటే తనకు 20 శాతం కమిషన్ ఇవ్వాలని చెబుతారు. ఇలా ఒక వ్యక్తి వస్తాడు అని ఏ మాత్రం ఊహించని కుటుంబ సభ్యులు అతను పెట్టిన అన్ని షరతులకు ఒప్పుకుని సరేనని చెప్పి వెళతారు.

ఎన్నోసార్లు ప్రయత్నం
అతను ఉదయాన్నే వచ్చి తీసుకు వెళ్తా అని చెబుతాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా పందెంలో గెలవలేదు కాబట్టి భరత్, సిరి ఇద్దరు కలిసి అవతలి వైపుకు వెళ్ళి పోవాలి అని సీత సూచిస్తుంది. కానీ అందుకు భరత్ ఒప్పుకోడు. దీంతో సిరి భరత్ కి అర్థం అయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది చివరికి ఎన్నోసార్లు ప్రయత్నం చేసిన తర్వాత అందుకు భరత్ ఒప్పుకుంటాడు. ఒప్పుకోవడమే కాక లక్ష్మణ్ లక్ష్మణ్ అడ్డు గట్టిగా పిలుస్తారు? అసలు ఏం జరిగిందో అర్థం కాని శైలు ఒకవేళ వాళ్ళు డబ్బులు సంపాదించేసి ఉంటారు అందుకే గోడ బద్దలు కొట్టడం కోసం పిలుస్తున్నారు అనుకుని భర్తకు అదే చెబుతుంది.

శైలు సైలెంట్ గా
నువ్వు ఏమి వెళ్లనవసరం లేదు అంటే మనం వెళ్లకపోతే వాళ్లంతట వాళ్లే గోడ బద్దలు కొడతారు అని లక్ష్మణ్ చెబుతూ తీసుకువెళతాడు. కిందకి వచ్చిన తర్వాత శైలు మాట్లాడుతూ మనం అనుకున్నది ఏది జరగలేదు కాబట్టి మీరు భరత్ ను పంపించాల్సిన అవసరం లేదు. మేము గోడ బద్దలు కొట్టాల్సిన అవసరం లేదు అని చెబుతోంది. అసలు ఏం జరుగుతుందో విషయం అర్థం కాక మీరు డబ్బు సంపాదించేసి ఉంటారు అనుకున్నాము కదా అని సీత అంటుంది. దానికి శైలు సైలెంట్ గా ఉండడంతో సిరి మాట్లాడుతూ నేను అదే చెబుతున్నాను కదా వాళ్ళు డబ్బు సంపాదించి ఉంటే ఈ పాటికి గోలగోల చేసేవారు సంపాదించలేదు కాబట్టి సైలెంట్ గా ఉన్నారు అని అంటుంది.
Recommended Video

ఫంక్షన్ క్యాన్సిల్
అయితే మీరు కూడా డబ్బు సంపాదించాలి లేదా అని లక్ష్మణ్ అడగడంతో లేదు అని రఘురాం చెబుతాడు. ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగించారు అయితే ఇద్దరూ గెలవలేదు కాబట్టి ఇప్పుడు ఎవరు ఎలా ఉన్నారో? అలాగే ఉంటారా లేక ఇంకా ఏదైనా మరో పందెం పెట్టుకుంటారా అనేది చూడాల్సి ఉంది. మరో పక్క రాబోతున్న ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం జాతరలో ఒకరు ఏదో ఒక ఈవెంట్ కోసం ఆర్డర్ ఇవ్వడంతో అప్పటివరకు పోటీలలో గెలుచుకున్న మొత్తం పెట్టి దాని కోసం సరుకులు సిద్ధం చేస్తారు కానీ ఉదయాన్నే వచ్చి తీసుకు వెళ్లాల్సిన అతను అవతలి పార్టీకి సంబంధించి ఎవరో బంధువులు చనిపోయారు అని అందుకే ఫంక్షన్ క్యాన్సిల్ అయింది అని వార్త చెబుతాడు. దీంతో అందరూ షాక్ అవుతారు.


Click it and Unblock the Notifications











