Vadinamma : రాజేశ్వరి పంతం.. రఘురాంకి మరింత అవమానం.. భరత్ సూసైడ్?

ఎలా అయినా భరత్ ని తన ఇద్దరు కుమారులతో కలపాలి అని రాజేశ్వరి రఘురాం ని కోరిన సంగతి తెలిసిందే. దీంతో రఘురాం చాలా అవమానకరంగా భరత్ తో మాట్లాడతాడు. నువ్వు ఎలా అయినా మా వైపు ఉండకుండా వేరే వైపు వెళ్ళిపో అంటూ రఘురామ్ భరత్ కు చెబుతాడు. అక్కడితో నిన్నటి ఎపిసోడ్ ముగించారు తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఆలోచనలో భరత్

ఆలోచనలో భరత్

తాను ఎంత చెప్పినా రఘురాం మాత్రం మా వైపు నువ్వు ఉండకూడదు మీ అమ్మ వైపు వెళ్ళిపో అని చెబుతూ ఉండడం తో భరత్ ఆలోచనలో పడతాడు. అలాగే రాజేశ్వరి బాధపడుతూ ఉంటుంది. వాడికి ఎన్ని చెప్పినా అర్థం చేసుకోవడం లేదు రఘురాం వెంట ఎందుకు పడుతున్నాడో ఇప్పటికీ అర్థం కావడం లేదు అంటూ లక్ష్మణ్ శైలు దగ్గర ఆమె బాధ పడుతుంది.

ఇంతలో శైలు కల్పించుకుని ఈ ఇంటి పెద్ద కోడలు గా నేను చెబుతున్నాను ఈ విషయం త్వరలోనే పరిష్కారం అవుతుంది నేను మీకు మోసం చేసి వెన్నుపోటు పొడిచే రకం కాదు మీరు ఎలా చెబితే అలా నడుచుకుంటా మన కుటుంబ సభ్యులు ఎవరూ ఇబ్బంది పడకుండా ఇకమీదట అన్ని సమస్యలు నేను తీరుస్తాను అంటూ రాజేశ్వరికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంది. రాజేశ్వరి కూడా శైలు మాటలతో కాస్త ఆనంద పడినట్లు అర్థమవుతోంది.

నమ్మకం పోయింది

నమ్మకం పోయింది

మరోపక్క రఘురాం కి రాత్రి నిద్ర పట్టక బయటకు వెళ్లి తిరుగుదామని నడుస్తూ ఉండగా అప్పటికే రాజేశ్వరి రఘురాం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. రఘురామ్ కనపడటం తో ఇలా రమ్మని పిలిచి నీకోసమే నేను ఈ చలిలో ఎదురుచూస్తున్నాను అని చెబుతుంది.. అలా చలిలో ఉండడం ఎందుకమ్మా నువ్వు రమ్మంటే నేను నీ దగ్గరికి రాకుండా ఉంటానా అని రఘురామ్ ప్రశ్నిస్తాడు.

లేదు నువ్వు నా మాట వింటావా వినవా అని భయంగా ఉంది అని ఆమె అంటుంది. అదేమిటి అలా అంటావు అని ప్రశ్నిస్తే నువ్వు నన్ను ఎప్పుడైతే మరోపక్క కి పంపి చేతులు దులుపుకున్నావో, అని చూడడం మొదలు పెట్టావో అప్పుడే నాకు నీ మీద నమ్మకం పోయింది అని రాజేశ్వరి అంటుంది.

ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి

ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి

అయితే ఎందుకు కలవాలి అనుకున్నావో చెప్పమని అడిగితే భరత్ను తన వైపుకు పంపాలి అనే విషయం చెప్పాను కదా ఆ విషయం లో నువ్వేమి చేసావు అని ప్రశ్నిస్తుంది. నేను ఎంత చెప్తున్నా భరత్ మాట వినే పరిస్థితి కనిపించడం లేదు నేను ఎంత చెప్తున్నా భరత్ మా వైపే ఉంటాను అని అంటున్నాడు అని అంటాడు.

వారికి రాజేశ్వరి మాట్లాడుతూ అవును నిజమే నేను కూడా చూశా, నువ్వు నీ భార్య వాడికి ఏమి మందు పెట్టారో తెలియదు కానీ వాడు మీ వెంటే తిరుగు అని పంతం పట్టుకుని కూర్చున్నాడు. మీరు ఇక్కడే ఉంటే వారు మీ వైపే ఉంటాడు వాడు నాకు దక్కాలంటే మీరు ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి అన్నట్లు రాజేశ్వరి మాట్లాడుతుంది.

మాటలు పడుతున్నా

మాటలు పడుతున్నా

ఏదో ఒకటి చేసి భరత్ నీ దగ్గరకు వచ్చేలా చేస్తానని చెప్పిన రఘురాం ఆ తర్వాత లోపలికి వెళ్ళాడు.. లోపలికి వెళ్ళిన తర్వాత భారత ఎదురు కావడంతో దయ చేసి అవతలివైపు కు వెళ్ళు ఇదే చివరి సారి నీకు చెప్పడం రేపు ఉదయం లోపు నువ్వు అవతలి వైపు వెళ్లకపోతే నేను చెప్పను నేను బతికి ఉంటానో లేదో కూడా నాకు తెలియదు అని అంటాడు. నీ వల్ల మీ వాళ్ళ అందరి చేత నేను మాటలు పడుతున్నాను అంటూ తాను వేరు నువ్వు వేరు అని భ్రమ కల్పించే విధంగా రఘురాం మాట్లాడుతాడు.. ఆ మాటలకు చాలా బాధ పడిన భరత్ తర్వాత తన గదిలోకి వెళ్ళాడు.

చావాలనే నిర్ణయం తీసుకుని

చావాలనే నిర్ణయం తీసుకుని

అక్కడ బాధపడుతున్న భరత్తో సిరి మాట్లాడుతూ అతనికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంది. నువ్వు ఏం చేసినా నేను నీకు అండగా ఉంటాను కానీ కొన్నిసార్లు అందరి దగ్గర మంచి అనేది ఉంచుకునే ప్రయత్నం కరెక్ట్ కాదు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే కొందరైనా సంతోషంగా ఉంటారు అందరినీ బాధ పెడుతూ ఇలా ఉండడం కరెక్ట్ కాదు అని ఆమె అంటుంది. అయితే భరత్ కు నిద్ర మాత్రం పట్టడం లేదు ఇంట్లో అందరూ పడుకున్నా సరే భరత్ ఈ విషయంలో మదనపడుతూ ఇబ్బంది పడుతుంటారు. చివరికి చావాలనే నిర్ణయం తీసుకుని తన అన్న దగ్గరకు వెళ్లి ఆశీస్సులు కూడా తీసుకుంటాడు భరత్.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
షాక్కు గురైనట్లు

షాక్కు గురైనట్లు

అలాగే రాత్రి నడుచుకుంటూ ఒక చెరువు దగ్గరకు వెళ్లి అందులో దూకి నట్లు గా చూపించారు. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగిసింది. ఇక రాబోతున్న ఎపిసోడ్ లో చూపిస్తున్న దాని ప్రకారం షాప్ లో పనిచేస్తున్న కుర్రవాడు పరిగెత్తుకుంటూ వచ్చి భరత్ ఇక మనకు లేడు అని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారంతా షాక్కు గురైనట్లు చూపించారు. అయితే ఇదంతా కల అయ్యే అవకాశం కూడా లేకపోలేదు చూడాలి మరి రాబోయే ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X