Vadinamma : భరత్ మిస్సింగ్.. రాజేంద్ర కొత్త స్కెచ్.. టెన్షన్ లో కుటుంబసభ్యులు?
వదినమ్మ సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది. ప్రస్తుతానికి భరత్, రఘురాం ఉన్న వైపు ఉండాలా తన తల్లి వైపు వెళ్లాలా అనే ఆలోచనలో ఉంటాడు. రఘురాం నువ్వు కనుక వాళ్ళ వైపు వెళ్ళక పోతే నేను చచ్చి పోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి అన్నట్టు మాట్లాడడంతో భరత్ చనిపోయేందుకు బయటకు వెళ్లడం గత ఎపిసోడ్ లో చూశాం. ఇక తాజా ఎపిసోడ్ లో ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

బయటకు వెళ్లాడేమో?
తెల్లవారిన తర్వాత భరత్ భార్య సిరి లేచి పక్కన చూసుకోవడంతో అక్కడ భరత్ కనిపించడు. ఎక్కడికైనా బయటకు వెళ్లాడేమో అనే ఉద్దేశంతో లేచి తన పనులు తాను చూసుకుంటూ ఉంటుంది. కానీ ఎంతసేపటికి భరత్ కనిపించా. దీంతో అతని ఫోన్ నెంబర్ కి పలు సార్లు ఫోన్ చేస్తుంది కానీ భరత్ ఫోన్ లిఫ్ట్ చేయడు. దీంతో ఆమెకు భయం వేస్తుంది భరత్ ఎక్కడికి వెళ్ళాడో తెలియక ఆమె అటూ ఇటూ తిరుగుతూ ఇంట్లో పరిశీలిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన సీత భరత్ ఎక్కడికి వెళ్ళాడు అని ప్రశ్నిస్తుంది.. భరత్ ఉదయం నుంచి కనిపించడం లేదు ఆయన ఎక్కడికి వెళ్ళాడో అనే విషయం మీద నాకు భయం నెలకొంది అని సిరి చెబుతుంది. అయినా సరే సీత వినిపించుకోకుండా భరత్ ఎక్కడికి వెళ్ళడు ఏదో పని మీద బయటకు వెళ్లి ఉంటాడు కానీ అతను వచ్చే లోపు నువ్వైనా నీ బట్టలు సర్దుకుని అటువైపు వెళ్ళు అని అంటుంది.

రాజేశ్వరి ఆందోళన
నువ్వు కూడా వెళ్లకపోతే మీ బావ గారికి కోపం వస్తుంది మళ్ళీ ఏదైనా అంటే మనందరం బాధపడాల్సి వస్తుంది అని ఆమె అంటుంది. అదేమిటి సీతక్క నువ్వు బావ గారికి నచ్చ చెప్పాల్సింది పోయి మాకు నచ్చ చెబుతున్నారు ఏమిటి అని ప్రశ్నిస్తుంది. లేదు నువ్వే ఏదో ఒకటి చేసి భరత్ మనసు మార్చి అతనిని అవతలివైపుకు తీసుకు వెళ్లే ప్రయత్నం చేయమని సీత చెబుతుంది. లేదు నువ్వు బావ గారి మనసు ఎలా అయితే మార్చలేవో నేను కూడా భరత్ మనసు మార్చే ప్రయత్నం చేయలేము, అది నావల్ల కాదు అని తేల్చి చెబుతోంది. సరేనని చెప్పి సీత లోపలికి వెళ్లి తన భర్తకు టిఫిన్ సిద్ధం చేసే పనిలో ఉంటుంది కానీ సిరి మాత్రం తన భర్త కోసం ఎదురు చూస్తూ బాధపడుతూ ఉంటుంది. భరత్ కోసం బయటకు లోపలకు తిరుగుతూ ఉన్న సమయంలో ఏం జరిగింది అని రాజేశ్వరి ప్రశ్నిస్తుంది. భరత్ కనిపించడం లేదు అనే విషయం ఆమె చెబుతోంది. దీంతో రాజేశ్వరి ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఎలా టిఫిన్ చేయాలి?
ఈలోపు సిరి రాత్రి మీరు బావ గారి ని తిట్టిన తర్వాత ఆయన వెళ్తూ వెళ్తూ భరత్ ను తీవ్ర స్థాయిలో మందలించాడు. అప్పటి నుంచి భరత్ బావ చాలా బాధ పడుతున్నాడు రాత్రి కూడా సరిగ్గా నిద్ర పోలేదు రెండు మూడు సార్లు నేను లేచి చూస్తే ఆయన నిద్రపోకుండా ఆలోచిస్తూనే ఉన్నాడు అని అంటుంది. అంతేకాక రఘురాం బావ చస్తే నువ్వైనా చావాలి లేదా నేనేమైనా చావాలి అని అనడంతో ఏమైనా చేసుకున్నాడు ఏమో అని భయంగా ఉంది అని సిరి అంటుంది. ఆమె మాటలతో రాజేశ్వరికి కూడా భయం మొదలవుతుంది. భరత్ ఏమైనా చేసుకున్నాడు ఏమో అనే భయంతో మిగతా కొడుకులను కూడా పిలిచి ఆమె పంచాయతీ పెడుతుంది. సరిగ్గా అదే సమయానికి రఘురాం టిఫిన్ చేయడానికి వచ్చి టిఫిన్ చేయబోతుండగా రోజు నీ పక్కన కూర్చునే భరత్ ఇప్పుడు కనిపించడం లేదు నీకు ఎలా టిఫిన్ చేయాలి అనిపిస్తుంది అని అడుగుతుంది.

మనశ్శాంతి లేక
నేను వాడిని వాళ్ల అమ్మ వైపు వెళ్ళిపో అని చెప్పాను ఇక వాడు నా తమ్ముడు కాదు నేను వాడికి అన్నని కాను నేను వాడి కోసం ఎందుకు ఎదురు చూడాలి అని రఘురాం చెబుతాడు. అసలు భరత్ బతికి ఉన్నాడో లేదో తెలిస్తే కదా మీరు ఇలా మాట్లాడేది అని సిరి మాట్లాడుతుంది. అసలేం జరిగింది అని అడిగితే ఇలా కనపడడం లేదు అనే విషయాన్ని చెబుతుంది. మిగతా కుటుంబ సభ్యులు అందరూ భయపడుతూ ఉంటారు కానీ సీత మాత్రం భరత్ అలాంటివాడు కాదు ఈ ఇంట్లో మనశ్శాంతి లేక ఎక్కడికైనా బయటకు వెళ్లి ఉంటాడు కానీ అతను ఎలాంటి తప్పు చేయడు అని చెబుతోంది.

కల అయ్యే అవకాశం
అయితే మిగతా కుటుంబ సభ్యులు అందరూ కూడా సీతను టార్గెట్ చేసి మాట్లాడతారు. రాజేశ్వరి ఒక అడుగు ముందుకు వేసి రఘురాం నువ్వు నా కొడుకుని చంపడానికే చూస్తున్నావు అని మాట్లాడడంతో రఘురాం సీత ఇద్దరు కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భరత్ను వెతికేందుకు ఇంట్లో నుంచి తలా ఒకరు తలా ఒక దిక్కుకు వెళతారు. మరోపక్క శైలు ఫోన్ చేసి విషయాన్ని తన తండ్రికి చెప్పడంతో అతను ఇంకా ఏదో ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. పని పూర్తి చేసావా అని బావమరిదిని అడగడంతో పూర్తి చేశాను అని అతను చెప్పడం కూడా కనిపిస్తోంది అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగించారు. ఇక రాబోతున్న ఎపిసోడ్ లో చూపిస్తున్న దాని ప్రకారం షాప్ లో పనిచేస్తున్న కుర్రవాడు పరిగెత్తుకుంటూ వచ్చి భరత్ ఇక మనకు లేడు అని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారంతా షాక్కు గురైనట్లు చూపించారు. అయితే ఇదంతా కల అయ్యే అవకాశం కూడా లేకపోలేదు చూడాలి మరి రాబోయే ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది అనేది.


Click it and Unblock the Notifications











