Vadinamma : భరత్ సూసైడ్.. శవం మిస్సింగ్.. అయినా కొట్టుకుంటూనే ఫ్యామిలీ!
భరత్ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఈ క్రమంలో తల ఒక దిక్కు వెళ్లి వెతికేందుకు కుటుంబ సభ్యులందరూ సిద్ధమవుతారు. భారత్ ని వెతికేందుకు లక్ష్మణ్ ఒకపక్క సిరి ఒకపక్క వెళ్లి వెతుకుతూ ఉంటారు. వారు వెతుకుతున్న ఈ క్రమంలో ఎంతకు భరత్ కనపడడు.. అయితే శైలు ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పేందుకు ఫోన్ చేసినట్లు గత ఎపిసోడ్ లో చూపించారు.. తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

వెతికి తీసుకువస్తాం
శైలు తన తండ్రికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండగా భరత్ గోడదూకి వచ్చాడా అని ప్రశ్నిస్తాడు. గోడ దూకటం సంగతి అలా ఉంచితే నూతిలోనో చెరువులోనో దూకి చచ్చాడు ఏమో అని అనుమానం వస్తోంది అని అంటుంది. అదేంటి అని ప్రశ్నిస్తే రఘురాం బావ గట్టిగా మందలించి మా వైపు వెళ్ళమని చెప్పడంతో భరత్ ఇంట్లో నుంచి వెళ్లి పోయాడు వాడు ఏమైనా చేసుకున్నాడు ఏమో అని మా అందరి అనుమానం అని శైలు అంటుంది..
దానికి శైలు తండ్రి జనార్ధన్ మాట్లాడుతూ భరత్ అలా చేసుకునే రకం కాదు వాడు చాలా మొండి వాడు వాడు ఎక్కడైనా ఉండి ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే ప్రయత్నిస్తున్నాడు ఏమో అని అంటారు. ఏది ఏమైనా మీరు వాడిని వెతికి తీసుకువస్తే కానీ నేను వదినమ్మ హోదా దక్కించుకో లేను అని శైలు అంటుంది. దానికి జనార్దన్ సరేనని వారిని వెతికి తీసుకువస్తాం అని అంటాడు.

ప్రథమ కర్తవ్యం
మీరు మాట ఇస్తే తప్పరు అని నాకు నమ్మకం ఉంది కాబట్టి త్వరగా వాడిని వెతికి తీసుకువచ్చే పని చూడండి అని శైలు జరుగుతుంది.. ఇంతలో తన బావమరిది లింగంతో భారత్ ని వెతికే పని చూడమని చెబుతాడు జనార్ధన్. భరత్ దొరికితే ఏం చేయాలో తెలుసు కదా అని ప్రశ్నిస్తే ఆ తెలుసు వెంటనే శైలు కి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నాడో చెప్పి తీసుకెళ్లి అప్పగించాలి అని లింగం అంటాడు.
నీ బొంద భరత్ కనపడగానే వేసేయండి అని జనార్దన్ ఆదేశాలు ఇస్తాడు.. అదేమిటి బావ భరత్ ను వేసేస్తే మనకు ఏం వస్తుంది అని లింగం ప్రశ్నిస్తాడు. ఇప్పుడు ఇంట్లో అందరూ భరత్ ఇంటి నుంచి బయటకు వెళ్లి పోవడానికి కారణం రఘురామ్ అని భావిస్తున్నారు భరత్ కి ఏదైనా జరగరానిది జరిగితే అది రఘురామ్ కారణంగానే అని అందరూ భావిస్తారు. రఘురాంని టార్గెట్ చేయడమే మన ప్రథమ కర్తవ్యం అని జనార్ధన్ అంటాడు.

ఏదైనా జరిగితే
విషయం అర్థం చేసుకున్న లింగం నలుగురు మనుషులను తీసుకుని వెళ్లి భరత్ కోసం గాలింపు చేపడతాడు. మొత్తంగా సిరి, లక్ష్మణ్, లింగం అండ్ బ్యాచ్ భరత్ కోసం వెతుకుతూ ఉంటారు కానీ భరత్ మాత్రం ఎక్కడా కనిపించడు. సాయంత్రం అవుతుంది ఇంకా భరత్ కనిపించడం లేదు అంటూ ఇంటికి వచ్చిన సిరి అంటుంది. భరత్ ఎక్కడికి వెళ్ళడు ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటాడు నువ్వు టిఫిన్ చేయొచ్చు కదా అని సీత అనడంతో ఆమె మీద తీవ్రస్థాయిలో మండి పడుతోంది సిరి.
తినక పోతే మహా అయితే చచ్చిపోతా అంతే కదా నా బావ లేని జీవితం నాకు వద్దు ఆయనకు ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను అని సిరి మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో మిగతా కుటుంబ సభ్యులు కూడా వచ్చి సిరి మాటలకు సపోర్ట్ చేస్తూ సీత మాట్లాడుతోంది తప్పు అన్నట్లు చెబుతారు.

భరత్ ఆత్మహత్య
ఇదంతా జరుగుతున్న సమయంలో షాప్ లో పనిచేసే కుర్రవాడు పరిగెత్తుకుంటూ వచ్చి ఇక మన భరత్ మనకు లేడు అంటూ షాకింగ్ విషయాన్ని కుటుంబ సభ్యుల ముందు ఉంచుతాడు. అదేంటి అసలు ఏం జరిగింది అని వారు ప్రశ్నించగా ఊరి చివర్లో ఒక పాడుబడిన చెరువు దగ్గరలో చెప్పులు కనిపించాయి అలాగే చెరువులో ఈ లుంగీ కనిపించింది భరత్ అందులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అని అతను కుటుంబ సభ్యులకు చెబుతాడు. ఇంట్లో అందరూ దెబ్బకు షాక్ అవుతారు అసలు వారికి ఏం జరుగుతుందో కూడా అర్థం చేసుకునే పరిస్థితి కనిపించదు. ఇదేంటి ఇలా జరిగింది అని కుటుంబ సభ్యులు అందరూ బాధపడుతూ ఉంటారు.

మా మీదకు వస్తారు ఏంటి?
సీత మాత్రం అలాంటిదేమీ జరిగి ఉండదేమో అని అంటూ ఉండటంతో మిగతా కుటుంబ సభ్యులందరూ మాటల దాడి చేస్తారు. ఎవరిని వెనకేసుకు రావడానికి నువ్వు ఇంకా ఇలా మాట్లాడుతున్నావు అంటూ రాజేశ్వరి నిందిస్తుంది. దీనంతటికీ కారణం రఘురాం రఘురాం, కారణంగానే వాడు బయటకి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు అంటూ మీద కుటుంబసభ్యులందరూ టార్గెట్ చేస్తారు.
శైలు అలాగే మాట్లాడుతూ ఉన్న సమయంలో రఘురాం ఎదురుతిరిగి అసలు వాడు ఉంటే నేను ఉండను వాడికి నాకు పడడం లేదు అని గొడవ మొదలు పెట్టింది లక్ష్మణ్ వాడిని పక్కనపెట్టి మా మీదకు వస్తారు ఏంటి అని ప్రశ్నిస్తాడు. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగిసింది.

పోలీసులకు ఫిర్యాదు
తరువాత ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం ఈ వ్యవహారంలో పోలీసులు ఎంట్రీ ఇస్తారు. అయితే సిరి మాత్రం పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి ఆసక్తి చూపించరు కానీ అప్పుడే ఇంటికి వచ్చిన పార్వతి మాత్రం నా కూతురు ఇవ్వకుంటే నేను కంప్లైంట్ ఇస్తాను నా అల్లుడు మృతికి కారణం రఘురాం, సీత అని చెప్పడం పోలీసులు యాక్షన్ తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు చూపించారు. ఇక ఈ వ్యవహారంలో జనార్ధన్ ఎంట్రీ కూడా ఇవ్వడంతో మరింత రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











