Vadinamma : భరత్ చావుకు రఘురామే కారణం.. పోలీసులకు పార్వతి ఫిర్యాదు?

ఎలా అయినా భరత్ ని తనవైపు పంపమని రఘురాం తల్లి రాజేశ్వరి ఆదేశించడంతో రఘురాం భరత్ మీద ప్రెజర్ పెడతాడు. రేపు ఉదయం లోపు నువ్వే అటు వెళ్ళాలి లేకుంటే నీకో నాకో ఎవరికో ఒకరికి చావు తప్పదు అన్నట్టు రఘురాం మాట్లాడుతాడు. దీంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన భరత్ చెరువులో పడినట్లు చూపించారు. ఈ విషయాన్ని షాప్ లో పనిచేసే కుర్రవాడు ఇంట్లో సభ్యులందరికీ చెబుతాడు. అక్కడితో గత ఎపిసోడ్ ముగించారు ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఏమీ మాట్లాడ లేక

ఏమీ మాట్లాడ లేక

తాజా ఎపిసోడ్ లో సిరి స్పృహ కోల్పోయి కింద పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను తీసుకు వెళ్లి సోఫాలో పడుకోబెట్టి సపర్యలు చేస్తూ ఉంటారు. అటు వైపు వెళ్లి సిరి తో కూర్చుని ఆమెకు ధైర్యం చెప్పాలి అని సీతకు ఉన్నా సరే అత్త సహా మిగతా కుటుంబ సభ్యులు అందరూ తనను ఏమంటారో అని భయంతో సీత సైలెంట్ గా ఉండిపోతుంది. భరత్ అలాంటివాడు కాదు భరత్ కు ఏమీ కాదు అని సీత చెప్పబోయే ప్రయత్నం చేస్తూ ఉండగానే రాజేశ్వరి సహా మిగతా కుటుంబ సభ్యులందరూ సీత మీద ఏకబిగిన ఎటాక్ చేస్తారు. దీంతో సీత ఏమీ మాట్లాడ లేక అలాగే నిలబడిపోయి ఉంటుంది.

ఎవరి గొడవలో వాళ్ళు

ఎవరి గొడవలో వాళ్ళు

మరో పక్క ఈ విషయం తెలుసుకున్న దుర్గ పార్వతి దగ్గరకు ఈ విషయం తీసుకువెళుతుంది. పార్వతి దగ్గరకు వెళ్ళింది కానీ ఈ విషయం చెప్పాలంటే దుర్గ నోట్లోనుంచి మాట పెగలని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో నేను ఏమీ చెప్పలేక పోతున్నాను అంటూ పార్వతి దగ్గర కాసేపు దుర్గ తల్లడిల్లిపోతుంది. నీ భర్త నిన్ను ఏమైనా అన్నాడా అంటే చచ్చిపోతాను అని బెదిరించి చూడు దెబ్బకి దారిలోకి వస్తాడు అంటూ పార్వతి ఆమెకు సలహాలు ఇస్తూ ఉంటుంది.

కానీ అసలు జరిగిన విషయం ఏమిటి అనేది పార్వతి కి అర్థం అయ్యేలా చెబుతుంది దుర్గ. నీ అల్లుడు చెరువులో దూకి చనిపోయాడు అంటున్నారు మీ ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ ఎవరి గొడవలో వాళ్ళు ఉన్నారు. అందుకే ఈ విషయం నీకు చేరవేయాలి అనే ఉద్దేశంతో నేను పరిగెత్తుకుంటూ వచ్చాను అని చెబుతోంది.

ఒక్కసారిగా కుప్పకూలి

ఒక్కసారిగా కుప్పకూలి

ఈ విషయం విన్న వెంటనే పార్వతి ఒక్కసారిగా కుప్పకూలి పోతుంది. నా అల్లుడు ఇలా చేశాడా? నా అల్లుడు అంత పిరికివాడు కాదు ఎక్కడో ఏదో జరిగింది అని ఆమె బాధపడుతూ ఉంటుంది. అసలు ఏం జరిగిందో నేను రఘురాం ఇంటికి వెళ్లి తీర్చుకుంటాను నువ్వు కూడా నాతో రా అని దుర్గను కూడా తీసుకుని పార్వతి రఘురాం ఇంటికి బయలుదేరి వెళుతుంది. అలా రఘురాం ఇంటికి వెళ్ళిన తర్వాత గుమ్మంలోనే రఘురాం సీతా కనపడటంతో నా అల్లుడు చనిపోయాడట, అసలు ఏం జరుగుతుంది అని ప్రశ్నిస్తుంది. నా అల్లుడు చావుకు కారణం రఘురాం అని రఘురాం మీద ఫైర్ అవుతుంది.

సిరిని అడగడంతో

సిరిని అడగడంతో

దానికి రఘురాం అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయండి అంటూ చెప్పే ప్రయత్నం చేయబోగా మాకు ఏమి తెలుసుకునే అవసరం లేదు అంటూ ఫైర్ అవుతుంది. అంతేకాక అసలేం జరిగింది అని కూతురు సిరిని అడగడంతో రేపు ఉదయం లోపు నువ్వైనా బ్రతికి ఉండాలి నేను అయినా బ్రతికి ఉండాలి అని రఘురాం బావ అన్నాడు.

ఆ రాత్రంతా నిద్రపోకుండా నే ఉండిపోయాడు. అని తన తల్లికి చెబుతుంది. దీంతో ఆమె తన అల్లుడు చావుకు కారణం అయ్యావ్ అంటూ రఘురాంని నిందిస్తుంది. ఇంతలో కల్పించుకున్న శైలు తెల్లవారితే భరత్ మావైపు వస్తాడు అందరూ ఇకమీదట చాలా అన్యోన్యంగా కలిసి ఉందాం అనుకున్నాం. ఇంతలో ఇలా జరుగుతుంది అనుకోలేదు అంటూ ఫైర్ అవుతుంది.

చనిపోయే వాడు కాదు

చనిపోయే వాడు కాదు

దానికి సీత అసలు అత్తగారు భరత్ ని తనవైపు పంపమని బలవంతం చేయకపోతే రఘురాం అలా చెప్పేవాడు కాదు అంటూ తన భర్తను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అయితే రాజేశ్వరి కల్పించుకుని అవును నిజమే నేను గనుక వాడిని ఇటువైపు పంపించమని బలవంతం చేయకపోతే వాడు అలా మాట్లాడి ఉండేవాడు కాదు వీడు ఇలా వెళ్లి చనిపోయే వాడు కాదు అని అంటుంది. దీనంతటికీ కారణం నేనే భరత్ చావు నా వల్లే సంభవించింది అని ఆమె బాధ పడుతుంది.. అదేంటి అలా మాట మారుస్తావు అంటూ పార్వతి ఆమె మీద ఫైర్ అవుతుంది.

నిజంగానే చనిపోయాడా

నిజంగానే చనిపోయాడా

ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగించారు. తరువాత ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం పోలీసులు జనార్ధన్ కలిసి రఘురాం ఇంటికి వస్తారు. సిరి తనకు పోలీసులకు ఫిర్యాదు చేసే ఉద్దేశం లేదని చెప్పినా సరే పార్వతి మాత్రం తన అల్లుడు చావుకు కారణం సీత వారి మీద చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే భరత్ ఏమైపోయాడు అనే విషయం మీద మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. భరత్ నిజంగానే చనిపోయాడా లేక ఏదైనా వేరే ప్రదేశానికి వెళ్లి ఉన్నాడా అనేది తెలియడం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X