Vadinamma : బతికి వచ్చిన భరత్.. చనిపోయాడనుకున్నారు కానీ..అందరికీ షాక్!
భరత్ కనిపించకుండా పోవడంతో అతను చనిపోయాడు అని అందరూ భావిస్తారు. రఘురాం రేపు ఉదయానికల్లా నువ్వు వెళ్ళకపోతే నువ్వైనా చావాలి నేను చావాలి అంటూ మాట్లాడాడు అని చెప్పడంతో రఘురాం కారణంగా భర్త చనిపోయాడు అంటూ ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ అతనిని టార్గెట్ చేస్తారు. అక్కడితో గత ఎపిసోడ్ పూర్తిగా తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

తిరిగి వస్తాడు అని
భరత్ కనపడడం లేదు అని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి పార్వతి సిద్ధం అవుతుంది కానీ సిరి సహా పార్వతి భర్త కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు రారు. నా కూతురు చేతగాని తనం వల్లే పరిస్థితి ఎంతవరకు వచ్చింది నువ్వు అయినా ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి అది ఒప్పుకునే ఎలా చూడు అని పార్వతి భర్తతో అంటుంది.
ఇందులో రఘురాం సీత చెప్పినట్లు ఒక్కరోజు ఆగండి మరో ఒక్క రోజులో భరత్ కచ్చితంగా మన ఇంటికి తిరిగి వస్తాడు అని ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తాడు. భరత్ చనిపోయినట్టు అతని లుంగీ చెరువులో దొరకడమే సాక్ష్యం ఇంకా ఎక్కడి నుంచి తిరిగి వస్తాడు అని పార్వతి రెట్టించి అడుగుతుంది.

కుటుంబ సమస్య
సిరి ఏడుస్తూ నా బావని నేను చూడాలి, బతికి ఉంటే నా కళ్ళతో నా భావన చూడాలి లేదా చనిపోతే శవాన్ని అయినా నేను చూడాలి అని అంటుంది. దాని కోసం ఏమైనా చేయి అని తల్లి కి పర్మిషన్ ఇస్తుంది. ఇంతలో లింగం ద్వారా విషయం తెలుసుకున్న జనార్ధన్ పోలీసులను తీసుకుని ఇంటికి వస్తాడు. వాళ్లను చూసి గుమ్మంలో ఉండగానే రఘురాం సీరియస్ అవుతాడు.
జనార్ధన్ నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు ఇది మా ఫ్యామిలీ సమస్య అని అంటాడు. ఇంతలో శైలు కల్పించుకుని ఇది మీ ఫ్యామిలీ సమస్య కాదు మా ఫ్యామిలీ సమస్య ఏం అత్తయ్య చెప్పవేంటి అని రాజేశ్వరిని ప్రశ్నిస్తుంది. వారికి రాజేశ్వరి కూడా అవును ఇది మా కుటుంబ సమస్య, జనార్ధన్ మాకు అండగా నిలబడేందుకు వచ్చాడు అని అంటుంది.

పోలీసుల తేలుస్తారు
పార్వతి సిరి వంక చూస్తూ పోలీసులు వచ్చారు ఇప్పుడైనా కంప్లైంట్ ఇవ్వు వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు బతికే ఉన్నాడా లేదా అనేది పోలీసుల తేలుస్తారు అని అంటుంది. దానికి సిరి ఏడుస్తూ అవును నా భర్త కనిపించడం లేదు అని పోలీసులతో అంటుంది.. అవునా ఎలా కనిపించకుండా పోయాడు ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా అని పోలీసులు ప్రశ్నిస్తారు.
అవేమీ నాకు తెలియదు నా భర్త కనిపించడం లేదు వెతికి పెట్టండి అని సిరి ఏడుస్తూ చెబుతోంది. దానికి పార్వతి నాకు చెప్పిన విషయం వాళ్ళకి చెప్పడానికి నీకు ఉపయోగం ఏంటి అని గట్టిగా మందలిస్తుంది. అంతేకాక నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తే తీసుకుంటాం అని ఇన్స్పెక్టర్ ని అడగగా భరత్ నీ సొంత అల్లుడు కదా మీరు ఇచ్చినా ఫిర్యాదు చెల్లుతుంది అని అంటాడు.

భరత్ బతికి వచ్చిన ఆనందంలో
అయితే రాసుకోండి నా అల్లుడు కనిపించడం లేదు అని ఆమె అంటుంది. ఇది ఇలా జరుగుతూ ఉండగా భరత్ అనూహ్య రీతిలో ఎంట్రీ ఇస్తాడు. లోపలికి వచ్చి జనార్ధన్ నేను చనిపోయాను అనుకుని నా కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూసింది చాలు నేను చనిపోవాలని ఎదురుచూసిన నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు అని అంటాడు. ఇక తమ పాచికలు పారవు అనే విషయం అర్థం చేసుకున్న జనార్ధన్ అప్పటికప్పుడు ఆ ప్రదేశం నుంచి నిష్క్రమిస్తాడు. భరత్ బతికి వచ్చిన ఆనందంలో సిరి వెళ్లి అతనిని కౌగలించుకుని ఏడుస్తుంది.

నిశ్చేష్టులు అయి
దగ్గరకు వచ్చిన భరత్ అన్నయ్య నువ్వు వదిన మనం మరొక మాట అంటే ఊరుకునేది లేదు అంటారు. ఇంతలో సీత ఆవేదన వ్యక్తం చేస్తూ భరత్ రెండు చెంపలు వాయిస్తుంది. ఈ పరిణామంతో మిగతా కుటుంబ సభ్యులందరూ షాక్ కు గురై చూస్తూ ఉంటారు. రాజేశ్వరి, పార్వతి ఇద్దరూ కూడా ఆపేందుకు ప్రయత్నం చేస్తూ ఉండగా సీత వాళ్ళిద్దరికీ వార్నింగ్ ఇచ్చి భరత్ మీద కోపం ప్రదర్శిస్తుంది.
ఇలా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయి చెరువులో పడతాను అంటే ఏమిటి అర్థం ఇంట్లో వాళ్ళందరూ ఉండాలా చనిపోవాలా అని సీత ప్రశ్నిస్తుంది. నువ్వు చనిపోవడానికి మీ అన్నయ్య నేను కారణం అని మీ ఇంట్లో వాళ్ళు అందరూ ఉన్నారు అని అంటుంది. దానికి భరత్ తీవ్రస్థాయిలో కోపం వ్యక్తం చేస్తూ ఇప్పుడు వదినమ్మకి నువ్వు సారీ చెప్పాలి అని తల్లితో అంటాడు. ఈ ఊహించని పరిణామాలకి మిగతా అందరూ నిశ్చేష్టులు అయి చూస్తూ ఉంటారు.

కలిసి ఉండొచ్చు అని
అలా ఎలా చెప్పమంటావు? అని లక్ష్మణ్ శైలు మాట్లాడగా భరత్ మీకు తెలియదు మీరు ఊరుకోండి అని అంటాడు. క్షమాపణలు అడగకపోతే ఈరోజుతో నేను చచ్చినట్లే అని గుర్తుంచుకోమని తల్లికి చెబుతాడు. నిజానిజాలు తెలుసుకోకుండా మాటలు అన్నందుకు క్షమించమని చివరికి రాజేశ్వరి అడుగుతుంది. తిరిగి రఘురాం దగ్గరికి వెళ్లిన భరత్ ఇప్పుడైనా నేను మీతో ఉండటానికి అవకాశం ఇస్తారా అని ప్రశ్నిస్తాడు.
ఇప్పటివరకు నిస్వార్ధంగా బతికాను కానీ నా మీదకి ఈ నిందలు వచ్చిపడ్డాయి ఇక మీదట ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు నిర్ణయం తీసుకునే హక్కు ఇస్తున్నాను నీ ఇష్టం నీకు ఇప్పటికీ మాతో కలిసి ఉండాలి అనుకుంటే మాతో కలిసి ఉండొచ్చు అని చెబుతాడు. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగిసింది. తరువాతి ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం రఘురాం షాప్ కు సంబంధించిన కాగితాలు భరత్ కి ఇస్తాను అని మాట ఇచ్చినట్లుగానే జనార్ధన్ ఆ కాగితాలు లింగం తో భరత్ దగ్గరకి పంపిస్తాడు మీ వదినమ్మ శైలు ఈ కాగితాలు నీకు ఇచ్చి రమ్మంది అని భరత్ కి చెబుతారు. చూడాలి మరి తర్వాత ఎపిసోడ్ లో ఎలాంటి ట్విస్ట్ లు చోటుచేసుకో బోతున్నాయి అనేది.


Click it and Unblock the Notifications











