Vadinamma : రఘురాం షాప్ మీద దాడి.. జనార్ధన్ ను కొట్టబోయిన రఘురాం.. వదలనంటూ వార్నింగ్!
స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ 749 వ ఎపిసోడ్ కు చేరింది. రాజేశ్వరి కిందపడి గాయం పాలవడం ఆ తర్వాత హాస్పిటల్ నుంచి రావడం చూపించారు. కానీ ఇంటికి వచ్చాక పరిస్థితులు మాత్రం ఇబ్బందికరంగా మారతాయి. దీంతో ఇద్దరు కుమారులను తన మాట మీద ఉండమని కోరుతుంది. అక్కడితో 749 వ ఎపిసోడ్ ముగిసింది. ఇక ఈ రోజు జరుగుతున్న ఎపిసోడ్ లో ఎలాంటి విశేషాలు జరిగాయి అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అదేమిటి అలా మాట్లాడుతావు?
భరత్ పాలు తాగుతున్న సమయంలో లక్ష్మణ్ తన భార్య శైలు వచ్చి బాబుకు పాలు లేకుండా తాగే చేస్తున్నాడు అని చెప్పడంతో కోపంతో ఊగిపోతూ వెళ్లి భరత్ చేతిలోని పాల గ్లాసు తీసుకుని నేలమీద కొడతాడు. మాటామాటా పెరగడంతో భరత్ భార్య సిరి, లక్ష్మణ్ భార్య శైలు కూడా అక్కడికి చేరుకుంటారు.. వాళ్ళ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటూ ఉండటంతో అసలు ఏం జరిగింది అని అడగడానికి సీత అక్కడికి చేరుకుంటుంది.. అక్కడికి వచ్చిన తర్వాత అమ్మ సిరి అసలు ఏం జరిగింది అని ఆమె అడుగుతుంది.. అయితే ఇక్కడ మేము మాట్లాడిన మాటలే వినిపిస్తున్నాయా శైలు లక్ష్మణ్ మాట్లాడిన మాటలు వినబడడం లేదా అని ఆమె అడుగుతుంది. అదేమిటి అలా మాట్లాడుతావు అసలు ఏం జరిగింది అని సీత అడిగే ప్రయత్నం చేస్తుంది. లేదు మెత్తగా కనపడుతున్నాడు కదా అని మీ అందరూ కూడా భరత్ ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు.

ఇంకా ఎక్కడ చెప్పొద్దు?
అందరం కలిసి ఉండాలి అనే ఉద్దేశంతో భరత్ కు ఏ మాత్రం ఇష్టం లేకపోయినా నేను భరత్ మనసు నొప్పించి లక్ష్మణ్ బావ కాళ్ళమీద పడి క్షమించమని అడిగే అలా చేశాను, నువ్వు అలా చేయకుండా ఉంటే బావుండేది బావ అని ఆమె అంటుంది. అంటే అసలు ఏం జరిగింది అని సీత అడుగుతుంటే మీకు మేం చేసిన తప్పులే కనపడుతున్నాయి, వాళ్ళు ఏం చేసినా ఒప్పు లాగానే కనపడుతుంది అన్నట్లుగా మాట్లాడుతుంది. అయితే తన తల్లికి ఇచ్చిన మాట ప్రకారం భరత్ మాత్రం ఏ మాత్రం తొట్రు పడకుండా లక్ష్మణ్ ఎన్ని మాటలు అంటున్నా సైలెంట్ గానే ఉంటాడు. అయితే సీతకు సిరి ఎందుకు అంత కోప్పడుతుంది అనే విషయం అర్థం కాదు. ఈలోపు భాస్కర్ భార్య దుర్గ అక్కడికి వచ్చి జరుగుతున్న విషయం అంతా గమనిస్తూ ఉంటుంది. వెంటనే సీత ఆమె దగ్గరికి వెళ్లి ఈ విషయం ఇంకా ఎక్కడ చెప్పొద్దు అని అంటుంది.

విషబీజాలు నాటే ప్రయత్నం
సరేనని ఆమె పేర్కొని బయట లోపల మాత్రం నేను ఎలా బయటపెట్టకుండా ఉండగలను అని అనుకుంటుంది. అయితే నువ్వు ఎందుకు వచ్చావు అని సీత అడిగితే మీ అమ్మ కోసం ఆరోగ్యం ఏమీ బాగా ఉండటం లేదు రెండు రోజుల నుంచి ఆమె ఇబ్బంది పడుతోంది అనే విషయాన్ని చెబుతుంది. ఇక ఈ ఇంట్లో ఎవరికీ ఏమీ చెప్పలేక పోతున్నాను అని సీత బాధపడుతూనే నేను వచ్చి అమ్మని చూస్తాను అని అంటుంది. ఇంతలో శైలు లక్ష్మణ్ నీ గదిలోకి తీసుకెళ్లి మరింత అతని మనసులో విషబీజాలు నాటే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయితే నేను భరత్ ఇల్లు వదిలి వెళ్ళి పోవాలి అని చెప్పాను కదా అని లక్ష్మణ్ అంటాడు. నువ్వు చెబితే మాత్రం వాళ్ల వెళ్ళిపోతారా. ఇప్పుడు ఒక కొత్త నాటకం మొదలు పెట్టాడు నువ్వు ఎంత బాగా చేసినా సైలెంట్ గానే ఉన్నాడు చూసావా తన భార్య చేత మాట్లాడిస్తున్నాడు అని అంటుంది. దానికి లక్ష్మణ్ కూడా అవును ఇప్పటివరకు మనం అందరూ ఏదో ఒక సమయంలో సీత వదిన మీద దుర్భాషలాడిన వాళ్ళమే కానీ ఇప్పటివరకు సిరి ఇప్పుడు కూడా వదిన మీద అంత కోపం చూపించలేదు. ఇది ఏదో ప్లాన్ లాగానే ఉంది అన్నట్టు లక్ష్మణ్ మాట్లాడతాడు.

సామాన్లు ధ్వంసం
మరోపక్క జనార్దన్ జైలు నుంచి విడుదల అవ్వడం తోనే రఘురాం షాప్ దగ్గరికి వెళ్లి కొన్ని సామాన్లు ధ్వంసం చేస్తాడు, నన్ను జైలులో పెట్టిన మీ అంతు చూస్తాను అంటూ షాప్ లో రణరంగం సృష్టిస్తాడు. రఘురాం మీద దాడి చేసేందుకు చేయడంతో రఘురాం కూడా దాడి చేసేందుకు ఒక కర్ర తీసుకుని వస్తాడు . అయితే వీరిద్దరి మధ్య వాగ్వాదం గట్టిగా జరుగుతుంది. ఎందుకు వాడిని వదిలేసావు అన్నా షాప్ లో పనిచేసే కుర్రవాడు అడిగితే భరత్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చినందుకు ఇక్కడిదాకా వచ్చింది నేను అతని మీద దాడి చేస్తే మరింత దూరం వెళుతుంది అతనికి భయపడి వెనక్కి తగ్గలేదు ఈ సమస్యలన్నీ వద్దు అని వెనక్కి తగ్గాను అని అంటారు.
Recommended Video

షాప్ నేలమట్టం చేస్తా
అయితే జనార్ధన్ షాప్ నుంచి వెళ్లేటప్పుడు కొద్ది రోజులలోనే ఈ షాప్ నేలమట్టం చేస్తా అని వార్నింగ్ ఇస్తాడు. ఇక అతను వెళ్లిన వెంటనే అన్ని సామాన్లు సర్దివేయి భరత్ వచ్చేటప్పటికీ ఇక్కడ జరిగిన గొడవ ఏమీ అతనికి తెలియకూడదు అని రఘురామ్ అంటాడు. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగించారు. తరువాతి ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం ఇంటికి వెళ్తున్న సమయంలో మైల స్నానం చేసినట్లు తలారా స్నానం చేసిన జనార్ధన్ వెళ్లి దేవుడు ముందు నిలబడి అరచేతులతో హారతి ఇస్తూ ఇప్పటివరకు ఒక లెక్క ఇకమీదట ఒక లెక్క దయచేసి నేను చేసే పనికి అడ్డు రావద్దు స్వామి అని దేవుడికి దణ్ణం పెట్టుకుంటూ మున్సిపల్ కమిషనర్ కు ఫోన్ చేసి ఇవ్వమని బావమరిదిని అడగడం కనిపిస్తుంది. మరోపక్క అదే సమయానికి సీత రఘురాం కి ఫోన్ చేస్తుంది ఎందుకు అలా డల్ గా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. మొత్తం మీద తర్వాత ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగేట్టే కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరగబోతోంది అనేది.


Click it and Unblock the Notifications