Vadinamma : శైలుని కొట్టబోయిన పార్వతి.. సిరి మీద దాడికి జనార్దన్ యత్నం.. అసలు ఏం జరుగుతోంది?

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ 750 వ ఎపిసోడ్ కు చేరింది. రాజేశ్వరి కిందపడి గాయం పాలవడం ఆ తర్వాత హాస్పిటల్ నుంచి రావడం చూపించారు. కానీ ఇంటికి వచ్చాక పరిస్థితులు మాత్రం ఇబ్బందికరంగా మారతాయి. దీంతో ఇద్దరు కుమారులను తన మాట మీద ఉండమని కోరుతుంది. అయితే అనూహ్యంగా మళ్ళీ లక్ష్మణ్, భరత్ గొడవ పడతారు. వారి గొడవ సిరి vs సీత గొడవగా మారుతుంది. జనార్ధన్ షాప్ మీదకు వచ్చి గొడవ చేస్తాడు. అక్కడితో 749 వ ఎపిసోడ్ ముగిసింది. ఇక ఈ రోజు జరుగుతున్న ఎపిసోడ్ లో ఎలాంటి విశేషాలు జరిగాయి అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కొంప మునిగిపోయింది అంటూ

కొంప మునిగిపోయింది అంటూ

తన ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్న పార్వతి దగ్గరకు వెళ్ళిన దుర్గ కొంప మునిగిపోయింది అంటూ ఆమెను భయపెడుతుంది. అసలు ఏం జరిగింది అని ప్రశ్నిస్తే అక్కడ ఇంట్లో అందరూ ఒకవైపు నీ కూతురు ఒకవైపు అయిపోయింది. మీ అల్లుడిని కూతురిని అక్కడి ఇంట్లో వాళ్ళు రాచి రంపాన పెడుతున్నారు అనే విధంగా పార్వతికి దుర్గ విషయాన్ని పూసగుచ్చినట్లు విధంగా చెబుతోంది.

శైలు లక్ష్మణ్ కలిసి సిరి భారత్ మీద అభాండాలు వేస్తున్నారని దానికి సీత కూడా వంత పాడుతోంది అనే విషయాన్ని చెబుతుంది. నువ్వు గనక ఈ విషయం మీద సీరియస్గా లేకపోతే భవిష్యత్తులో నీ కూతురు ఆ ఇంటికి వెళ్లి అనేక ఇబ్బందులు పడుతున్నట్లు గ్రహించమని చెబుతుంది.

అత్తగారింట్లో అసలు విలువ లేకుండా

అత్తగారింట్లో అసలు విలువ లేకుండా

ఇప్పుడే వెళ్ళి విషయం ఏమిటో తెలుసుకో లేకపోతే తిరిగి అత్తగారింట్లో అసలు విలువ లేకుండా పోతుంది అని ఆమెను రెచ్చగొట్టి పంపిస్తుంది. మరో పక్క ఇంట్లో జరిగిన గొడవను గుర్తుతెచ్చుకుంటూ భరత్ షాప్ కి నెమ్మదిగా వస్తూ ఉంటాడు. షాపులో ఉన్న రఘు భరత్ వాలకం చూసి మళ్ళీ ఏం చేశావు, ఇలా ఉన్నావు ఏంటి? ఇంకా ఏమైనా తలనొప్పి తీసుకు వచ్చావా? అని అడుగుతాడు.

ఇంట్లో అన్నా వదినలకు తల నొప్పి తీసుకురావాలని కంకణం కట్టుకున్నావా ఏంటి? నువ్వు అలా సైలెంట్ గా ఉండడం చూస్తూ ఉంటే నాకు టెన్షన్ పెరిగిపోతుంది అసలు ఏం జరిగిందో చెప్పరా అని అడుగుతాడు. ఎందుకు అన్నయ్య అలా మాట్లాడతావ్ నాకు అందరి కంటే మీరే ఎక్కువ అని తెలుసు కదా.

ఎదిరించి మాట్లాడుతా

ఎదిరించి మాట్లాడుతా

మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటే నేను తట్టుకోలేను అది ఎవరైనా సరే నేను ఎదిరించి మాట్లాడుతాను అంటాడు. అది సరే ఇప్పుడు ఏం జరిగిందో చెప్పరా అని గట్టిగా అడగడంతో సీత వదిన మీద సిరి గట్టిగా మాట్లాడడంతో ఆమె మీద చేయి చేసుకోబోయాను అని ఇంతలో సీత వదిన సర్దుబాటు చేసింది అనే విషయాన్ని చెప్పుకొస్తాడు.

దీంతో రఘు రామ్ కి కోపం వస్తుంది. ఎంత భార్య అయినా ఆమె మీద చేయి చేసుకునే పరిస్థితి రాకూడదు నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు అన్నట్లు మాట్లాడుతారు. ఇంతలో ఇంటికి వచ్చిన పార్వతి శైలు, శైలు అంటూ గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది. శైలు రావడంతో, శైలు మీద బూతుల దండకం అందుకుంటుంది. నువ్వు నా కూతుర్ని టార్గెట్ చేసి ఎలా మాట్లాడుతున్నావా అంటూ ఆమె మీద రెచ్చిపోతుంది.

కరెక్ట్ కాదు అని

కరెక్ట్ కాదు అని

వెంటనే అక్కడికి వచ్చిన సీత ఆమెను ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది కానీ పార్వతి మాత్రం శైలు ని కొట్టకుండా ఇక్కడ నుంచి వెళ్లేది లేదు అని మాట్లాడుతుంది. సీత కూడా చాలా సేపు ఓపిక పట్టి ఇక ఇది కరెక్ట్ కాదు అని భావించి నీకు మర్యాద ఇచ్చి ఉన్నంతసేపు బాగానే ఉంటాం మర్యాద మించి ఏమైనా చేస్తే మేము కూడా ఎదురు తిరగాల్సి వస్తుంది అని అంటుంది. మా ఇంటికి వచ్చి మా పిల్లల మీద చేయి చేసుకుంటాను అంటే నేను ఎలా ఊరుకుంటాను అని సీత ప్రశ్నిస్తుంది. మరి నా కూతుర్ని ఎందుకు పక్షపాత ధోరణితో చూస్తున్నావు ఎందుకు నా కూతురిని ఇబ్బంది పెడుతున్నావు అని ఆమె మాట్లాడుతుంది.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
సిరి మీద దాడి

సిరి మీద దాడి

ఈ గొడవ జరుగుతున్నప్పుడు రాజేశ్వరి కి మందులు ఇస్తున్న సిరి గొడవ జరుగుతున్న శబ్దం విని బయటకు వస్తుంది.. ఆమె వచ్చే సమయానికి ఆమె తల్లి సీత మీద దాడి చేయబోతున్న క్రమంలో వెళ్లి సిరి అడ్డుకుంటుంది. నువ్వు కనుక సీత అక్క మీద ఒక్కసారి చేయి వేసిన ఇంట్లో అడుగుపెట్టే అర్హత కోల్పోతావు జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇస్తుంది.

నిన్ను ఇబ్బంది పెడుతున్నా నువ్వెందుకు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నావు నీకు బుద్ధి జ్ఞానం లేదా అని పార్వతి ప్రశ్నిస్తుంది.. మరో పక్క ఇంటికి వెళ్ళిన జనార్ధన్ దేవుడికి అరచేతితో హారతి ఇస్తూ ఇక మీదట నా దారికి అడ్డు రావద్దు నేను ఏం చేసినా చూస్తూ ఉండు అని కోరుతాడు. ఇదంతా జరుగుతూ ఉండగా ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగించారు ఇక తరువాతి ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం జనార్ధన్ ఇంటికి వచ్చి సిరి మీద దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు చూపిస్తున్నారు.

వెంటనే రంగంలోకి దిగిన లక్ష్మణ్ అతని చేతిని అడ్డుకుని మా ఇంట్లో ఆడవాళ్ళ మీద చెయ్యి వేసి స్థాయికి వచ్చావా అంటూ సీరియస్ అవుతాడు. చూడాలి మరి ఏం జరగబోతోంది అనేది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X