Vadinamma : మరింత ముదిరిన ముసలం.. రిషి ప్రమాదంలో పడడంతో రెచ్చిపోయిన లక్ష్మణ్

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ 751 వ ఎపిసోడ్ కు చేరింది. జైలు నుంచి విడుదలై ఇంటికి వెళ్ళిన జనార్ధన్ దేవుడికి తాను ఇకమీదట చేసే ఏ పనిలో అడ్డు పడవద్దు అని కోరుతూ ఉంటాడు. అలాగే చేతితో హారతి ఇస్తూ దేవుడిని ప్రార్థిస్తూ ఉంటాడు. తన బావ మరిదిని పిలవడంతో ఓరినాయనో ఇప్పుడు నా చేతిలో పెట్టి వెలిగిస్తాడో ఏమిటో అని భయ పడతాడు కానీ మున్సిపల్ ఆఫీస్ కి ఫోన్ చేసి ఇవ్వమని అడుగుతాడు.

బహుశా రఘురామ్ షాప్ కూలుస్తాను అని ప్రమాణం చేసి వచ్చాడు కాబట్టి ఆ షాప్ మీద ఏమైనా చర్యలు తీసుకోమని మున్సిపల్ ఆఫీసర్ కి చెప్పి ఉండే అవకాశాలున్నాయి. మరో పక్క షాప్ లో ఉన్న రఘు రామ్ కి ఫోన్ చేసి సీత మాట్లాడుతూ ఉంటుంది సీత గొంతులో హుషారు తనం లేకపోవడంతో రఘురాం అసలు ఏం జరిగింది అని ప్రశ్నిస్తాడు. దీంతో ఆమె ఇలా పార్వతి మన ఇంటి మీదకు వచ్చి గొడవ చేసింది అనే విషయం చెబుతుంది.

అనుమానంతో చెప్పకుండా

అనుమానంతో చెప్పకుండా

భరత్, సిరి మీద చేయి ఎత్తడంతో ఆమె మన ఇంటి మీదకి దండెత్తి వచ్చిందని పెద్ద రాద్దాంతం చేసిందని చెబుతుంది. సిరి ఈ విషయం చెప్పి ఉంటుంది అని ప్రశ్నిస్తే అసలు సీరి అలా చేసే మనిషి కాదు అని సీత చెబుతుంది. ఎవరు ఇలా చేసి ఉంటారు అని ప్రశ్నిస్తే ఈ గొడవ జరుగుతున్న సమయంలో మన ఇంటికి దుర్గ వచ్చింది.

ఆమె ఈ విషయాన్ని పార్వతికి చేరవేసింది అనే విషయం చెబుతుంది. అంతేకాక ఇక్కడ జరిగింది ఏది ఎవరికీ చెప్పొద్దు అని ప్రత్యేకంగా చెప్పాను కూడా ఆ తర్వాత కూడా ఆమె ఈ విషయం అంతా పూసగుచ్చినట్లు పార్వతికి చెప్పింది అనే విషయం చెబుతుంది. నువ్వు ఆమెకు ఏమీ చెప్పకుండా ఉంటే బాగుండేది ఆమె ఈ విషయాన్ని చెప్పాలో వద్దు అని అనుమానంతో చెప్పకుండా ఉండేది. నువ్వు పూసగుచ్చినట్లు చెప్పవద్దు అని చెప్పావ్, చెప్పి చూపించింది అంటాడు.

భరత్ సీరియస్

భరత్ సీరియస్

ఇంతలో భరత్ వచ్చి ఏం జరిగింది అన్నయ్య అని అడిగితే నువ్వు చేసిన ఘనకార్యం ఇంటి మీద గొడవ తీసుకువచ్చింది. మీ అత్తగారు ఇంటి మీదకు వచ్చి రాద్ధాంతం చేసి వెళ్ళింది అనే విషయాన్ని చెబుతాడు. ఈ పార్వతి అంత చేసిందా, నేను ఆవిడ సంగతి చూస్తాను అని మళ్లీ భరత్ సీరియస్ అవుతాడు. దీంతో ఇప్పటిదాకా జరిగింది చాలు మళ్లీ నువ్వు ఏమీ చేయవద్దు నాయనా అని అంటాడు రఘురాం.

అలాగే అసలు దుర్గ మన ఇంటికి ఎందుకు వచ్చింది అని అడిగితే మా అమ్మకి బాగోలేదట ఆ విషయాన్ని నాకు చెప్పడానికి ఆమె మన ఇంటికి వచ్చింది అని సీత చెబుతోంది. అయితే ఈ విషయాన్ని ఇంత ఆలస్యంగా చెబుతారా ఏమిటి ఆమెకు అనారోగ్యంగా ఉంటే నువ్వు వెళ్లి చూడాలి కదా సరే నేను కూడా వస్తున్న ఇద్దరం కలిసి వెళ్లి ఆమెను చూద్దాము అని అంటాడు రఘురాం. రఘు రామ్ సీత కలిసి భాస్కర్ ఇంటికి వెళతారు.

వైరాగ్యం వచ్చిన

వైరాగ్యం వచ్చిన

సీత తల్లి అక్కడే మంచం మీద పడి ఉంటుంది. సీత వెళ్లి అసలు ఏం జరిగింది అమ్మ? అని అడుగుతుంది.. ఆమె అనారోగ్య కారణాలతో మంచం మీద ఉండడంతో పాటు సీత తనను చూడడానికి రావడం లేదు అనే విషయం మీద బాధపడుతూ ఉంటుంది. మాకు అసలు నీకు అనారోగ్యంగా ఉంది అనే విషయమే తెలియదు ఈ విషయం తెలిసి ఉంటే మేము రాకుండా ఉంటామా అని అడుగుతుంది.

సీత తన కుటుంబంలో అనేక సమస్యలతో ఇబ్బంది పడుతోంది ఈ సమస్యతో కూడా ఆమెను ఇబ్బంది పెట్టడం ఎందుకు అని భాస్కర్ ఈ విషయం చెప్పలేదు సీత తల్లి అంటుంది. దీంతో రఘురాం కల్పించుకుని అందరూ అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాము, అలా అని మన అనుకున్న వారిని వదులుకుంటామా అని అడుగుతాడు. అలాగే డాక్టర్ ని పిలిచి చికిత్స చేయిస్తాడు. అయితే ఆమె డాక్టర్ తో కూడా తనకు వైరాగ్యం వచ్చినట్లు మాట్లాడుతుంది.

వార్నింగ్

వార్నింగ్

ఈ లోపు శైలు ఇక్కడ జరిగిన విషయం అంతా తన తండ్రికి ఫోన్ చేసి చెబుతోంది. తన మీదకు తిరిగి తల్లి వచ్చి గొడవ చేసిందనే విషయాన్ని కూడా తండ్రి దృష్టికి తీసుకు వెళుతుంది. కోపంతో రగిలి పోతున్న జనార్ధన్ నేను వచ్చి వాళ్ళ సంగతి చూస్తాను అంటూ వార్నింగ్ ఇస్తాడు. మరోపక్క పార్వతి అన్న మాటనే తలుచుకుంటూ పక్కన బిడ్డ ఏడుస్తున్నా పట్టించుకోకుండా శైలు బాధపడుతూ ఉంటుంది.

అదే సమయంలో బాబు కింద పడి పోవడానికి కొంచెం లో మిస్ అవుతాడు. లక్ష్మణ్ ఆమెను మందలించడంతో అవును మీ ఇంట్లో అందరికీ నేనే చులకన. సిరి వాళ్ళ అమ్మ అలా చేసింది నువ్వు ఇలా అంటున్నావు అని ఈ జరిగిన విషయం అంతా భర్తకు పూసగుచ్చినట్లు చెపుతుంది. ఈ విషయం మీద శ్రీ-లక్ష్మణ్ మధ్య కాస్త వాగ్వాదం జరుగుతుంది. అక్కడికి చేరుకున్న రఘురాం వారిద్దరిని సముదాయించే ప్రయత్నం చేస్తాడు.

కమింగ్ అప్ లో

కమింగ్ అప్ లో

అక్కడితో ఈరోజు ఎపిసోడ్ పోసింది తరువాతి ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం జనార్ధన్ ఇంటికి వచ్చి సిరి మీద దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు చూపిస్తున్నారు. వెంటనే రంగంలోకి దిగిన లక్ష్మణ్ అతని చేతిని అడ్డుకుని మా ఇంట్లో ఆడవాళ్ళ మీద చెయ్యి వేసి స్థాయికి వచ్చావా అంటూ సీరియస్ అవుతాడు. చూడాలి మరి ఏం జరగబోతోంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X