For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vadinamma : జనార్ధన్ కి షాక్ ఇచ్చిన లక్ష్మణ్.. కుటుంబంలో ఊహించని చావు!

  |

  స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ 752 వ ఎపిసోడ్ కు చేరింది.రఘురాం తన భార్య సీతను తన అత్తగారి దగ్గర వదిలి ఇంటికి వచ్చిన సంగతి తెలిసిందే. రఘురాం ఇంటికి వచ్చే సమయానికి తన భార్య మీద తల్లితో ఎటాక్ చేయించ పోయింది అనే ఉద్దేశంతో లక్ష్మణ్ సిరి మీద ఆవేశపడి అరుస్తూ ఉంటారు. సిరి కూడా నేనేమైనా తక్కువ తిన్నానా అన్నట్లు లక్ష్మణ్ కి ఎక్కడికక్కడ ఎదురు సమాధానాలు చెబుతూ ఉంటుంది.. సిరి అలా ఎదురు సమాధానాలు చెప్పడం ఏ మాత్రం ఊహించని లక్ష్మణ్ ఆమె మీద తీవ్రస్థాయిలో ఫైర్ అవుతూ ఉంటాడు.. వీరి గొడవ చూసి రఘురాం తల పట్టుకుని దయచేసి మీరు ఇలా గొడవ పడడం ఆపండి.. మీ వదిన వాళ్ళ అమ్మ ఆరోగ్యం అసలు ఏమాత్రం బాలేదు అందుకే ఆమెను వాళ్ళ ఇంట్లో దించి రావాల్సి వచ్చింది. దయచేసి మీ వదిన వచ్చే వరకు అయినా మీ గొడవ ఆపండి అని రఘురాం కోరతాడు

  మర్యాద దక్కదు

  మర్యాద దక్కదు

  దీంతో ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళతారు. అలా వెళ్లిన వెంటనే జనార్ధన్ రఘురాం ఇంటికి చేరుకుంటాడు.. వచ్చీ రావడం తోటే సిరి, సిరి అని అరుస్తూ ఆమెను బయటకు పిలుస్తాడు.. ఆమె రావడంతోనే నీకు ఎంత ధైర్యం మీ అమ్మ చేత నా కూతురి మీద దాడి చేయించే ప్రయత్నం చేస్తావా? అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? జనార్ధన కూతురు అంటే లెక్క లేకుండా పోయింది.. అని అంటూ సిరి మీద చేయి ఎత్తి దాడి చేసేందుకు ప్రయత్నం చేస్తాడు. వెంటనే అక్కడికి చేరుకున్న లక్ష్మణ్ అతని దాడిని అడ్డుకోవడమే కాక తన ఇంట్లో ఆడవాళ్ళ మీద చేయి ఎత్తితే మర్యాద దక్కదు అని వార్నింగ్ ఇస్తాడు.

  వార్నింగ్

  వార్నింగ్

  జనార్ధన్ కూడా ఎక్కడా వెనక్కి తగ్గకుండా నా కూతురి మీద సిరి వాళ్ళ అమ్మ పార్వతి దాడి చేయడానికి వచ్చినప్పుడు ఏమైంది ఈ పొగరు. నా కూతురి మీద ఎవరు పడితే వాళ్ళు చేతులు వేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటారా అని ప్రశ్నిస్తారు. ఇంతలోకే అక్కడికి ఇంట్లో కుటుంబ సభ్యులందరూ చేరుకుంటారు. నువ్వు చేస్తున్న పని కరెక్ట్ కాదు అని లక్ష్మణ్ చెప్పడంతో పాటు జనార్ధన్ సహా శైలు కూడా షాక్ అవుతారు. వెంటనే అక్కడికి చేరుకున్న రఘురాం మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్లకపోతే నీకు మర్యాద దక్కదు అని చెబుతాడు. జనార్ధన్ ఇంకా ఏదో మాట్లాడ బోతుండగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్లకపోతే కనుక నిన్ను మోసుకు వెళ్లే పరిస్థితి వస్తుందని వార్నింగ్ ఇస్తాడు.

  మాటల దాడి

  మాటల దాడి

  శైలు కూడా నాటకాలు ఆడుతూ నేను ఎలా చచ్చి పోయిన పర్వాలేదు మీరు మాత్రం ఇక్కడ ఉండదు వెళ్లిపోండి అని తండ్రికి చెబుతుంది. తండ్రిని తీసుకు వెళ్ళమని మామయ్యకు చెబుతోంది. ఇదంతా జరుగుతూ ఉండగా భరత్ ఎంట్రీ ఇస్తాడు తన అన్న లక్ష్మణ్ కూడా తనకు సపోర్టుగా తన భార్యకు సపోర్టుగా మాట్లాడుతుండటంతో శభాష్ అంటూ ముందుకు వస్తాడు. అసలు నీ వల్ల ఇదంతా అన్నట్లుగా మిగతావాళ్లు మాట్లాడ బోయే అవకాశం కూడా ఇవ్వకుండా జనార్ధన్ భరత్ మీద మాటల దాడి చేస్తాడు. అయితే ఎట్టకేలకు జనార్ధన్ అక్కడి నుంచి వెళ్ళి పోతాడు. లక్ష్మణ్ తో భరత్ మాట్లాడడానికి ప్రయత్నించగా లేదు నేను మా మనసు మార్చుకోలేదు మనం మనం ఎన్ని కొట్టుకున్నా బయట వాళ్ళు వస్తే మాత్రం నేను మా ఇంట్లో వాళ్ళకి సపోర్ట్ చేస్తాను అని చెబుతాడు.

  తినలేదని

  తినలేదని

  భరత్ కూడా చేసింది అదే కదా ఎవరో నన్ను అంటే వాళ్ళని కొట్టడం అనేది ఇలాగే అవుతుంది కదా అన్నట్లు మాట్లాడుతారు. అలా మొత్తం మీద ఆ గొడవ అయితే సద్దుమణుగుతుంది మిగతావాళ్లు అందరూ పడుకుంటారు గాని రఘు రామ్ మాత్రం ఏం చేయాలో అర్థం కాక ఆరుబయట కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. తన తల్లి కి మందు ఇచ్చిన తర్వాత సీత భర్త తిన్నాడా లేదా అని కనుక్కోవడానికి అతనికి ఫోన్ చేస్తే ఫోన్ ఆన్సర్ చేయడు. దీంతో సిరి కి ఫోన్ చేసి అసలు మీ బావ తిన్నాడో లేదో చూద్దామని అడుగుతుంది బయటకు వెళ్ళి కూర్చున్న బావ దగ్గరికి వెళ్లి సిరి అడుగుతుంది.

  తల్లి మృతి

  తల్లి మృతి

  తినలేదు అని చెబుతాడు. మొత్తం మీద సీత ఎందుకు తినలేదు నేను లేకపోతే తినవా అన్నట్టు మాట్లాడుతుంది. మొత్తం మీద ఈ వీరిద్దరి మధ్య సంభాషణ సాగుతూ ఉండగా ఈరోజు ఎపిసోడ్ ముగించారు.. ఇక తర్వాత ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం భాస్కర్ తన తల్లిని లేపి బయటకు వెళదాము అంటాడు. కానీ అతను ఎంత లేపుతున్నా తల్లి లేవక పోయేసరికి కూర్చుని అసలేం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు.. అక్కడ అతని తల్లి చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ విషయం ఫోన్ చేసి రఘురాం కి చెప్పడంతో కుటుంబ సభ్యులు అందరికీ తెలుస్తుంది. కానీ సీతకు ఎలా చెప్పాలి అనేది మాత్రం వాళ్ళు చర్చించుకుంటూ ఉంటారు.

  English summary
  Vadinamma Episode 752: Laxman loses his cool when Janardhan tries to harm Siri. Elsewhere, Sita advises Radhuram not to lose hope.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X