Vadinamma : రఘురాం కుటుంబానికి మరో షాక్.. ఎవరూ ఊహించని విధంగా జైలుపాలు!

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ 756వ ఎపిసోడ్ కు చేరింది. సీత తల్లి మరణంతో కుటుంబ సభ్యులు అందరూ విషాదంలో మునిగి పోతారు. ఆమె దహన సంస్కారాలు ముగిసిన తర్వాత కూడా ఆమె అన్నయ్య మిగతా కుటుంబ సభ్యులు అందరూ ఇంట్లోనే కూర్చుని బాధపడుతూ ఉంటారు. సీత బంధువులలో ఒకరు మీ అమ్మ నీకు డబ్బులు ఇవ్వకపోయినా విలువైన ఆస్తి ఇచ్చింది అని చెబుతూ మీ బావ రఘురాం ఆయన ఉమ్మడి కుటుంబాన్ని మీకు అండగా నిలబడేలా చేసింది అని భాస్కర్ కి చెబుతూ ఉంటారు. వారి ఉమ్మడి కుటుంబం ను చూస్తే భలే ముచ్చటగా ఉంది.

రఘురాం నోరు తెరిచి ఏ విషయం చెప్పకుండా కళ్ళ తోనే అన్న తమ్ముళ్లు దహన సంస్కారాల కార్యక్రమాలలో భాగమయ్యారు.. ఆగి సీత తోడికోడళ్ళు కూడా బయట వాళ్ళు అని ఎక్కడ అనిపించడంలేదు వారంతా సొంత అక్క చెల్లెలు లాగా కలిసిపోయారు. మానవ జన్మ ఎత్తిన అలా బతకడమే సార్థకత అన్నట్లు మాట్లాడుతూ ఉంటాడు.

అంతు చూస్తా అన్నట్లు

అంతు చూస్తా అన్నట్లు

అయితే కుటుంబం విడిపోవడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్న శైలు అతని మాటల మధ్యలో అడ్డగించి ఇప్పుడు చనిపోయిన వారి గురించి మాట్లాడుకుందాం మా గురించి ఎందుకు అన్నట్టు అంటుంది. ఇక ఆ తర్వాత రోజులు గడుస్తూ ఉంటాయి భాస్కర్ కోరిక మేరకు రఘురాం సహా మిగతా కుటుంబ సభ్యులు వారి వారి ఇళ్లకు వెళ్ళకుండా భాస్కర్ ఇంట్లో మకాం వేస్తారు.

స్వతహాగానే నోటి దురద తీర్చుకుంటూ ఉండే దుర్గ ఈ విషయంలో కూడా భర్తను నిలదీసి వాళ్ళు ఎప్పుడు పోతారు అన్నట్లు మాట్లాడుతుంది. వాళ్ళు నేను ఉండమంటే ఉన్నారు, వాళ్లకు వినపడేలాగా మాట్లాడితే నీ అంతు చూస్తా అన్నట్లు మాట్లాడతారు.

గుర్తు తెచ్చుకుని మరీ

గుర్తు తెచ్చుకుని మరీ

ఇప్పటికే ఈ విషయాలు అక్కడ నుంచి వింటున్న సీతా, రఘురాం చెవిన పడతాయి. వాళ్లు వెళ్లిపోవడానికి సిద్ధమవుతాడు. భాస్కర్ తన భార్య మాటలు వాళ్ళు విన్నారు అని అర్థం చేసుకుంటాడు. అలా సీత కుటుంబ సభ్యులందరూ తమ ఇంటికి చేరుకుంటారు. ఇంటికి అయితే చేరుకుంటారు కానీ, సీత మాత్రం తన బాధ లోనే ఉంటుంది. చనిపోవడానికి ముందు రోజు రాత్రి తన తల్లి తనతో మాట్లాడిన అన్ని విషయాలు, ప్రతి ఒక్క విషయాన్ని గుర్తు తెచ్చుకుని మరీ బాధపడుతూ ఉంటుంది. సీత బాధపడుతున్న విషయం చూసి కుటుంబ సభ్యులు కూడా తల్లడిల్లిపోతున్నారు.

ఆరోగ్యం బాగుందా?

ఆరోగ్యం బాగుందా?

కానీ సీతను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. శైలు మాత్రం మనం ఎప్పుడు వెళ్ళిపోతున్నాను అనే విషయాన్ని మళ్ళీ మొదలు పెడుతుంది. దానికి లక్ష్మణ్ మాట్లాడుతూ మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు కదా ఆమె ఆరోగ్యం బాగుందా? తర్వాత మనం వెళ్లడమో భరత్ సిరి దంపతులు వెళ్లడం ఏదో ఒకటి జరగాల్సిందే అంటారు.

మీ అమ్మ ఆరోగ్యం బాగోక మా ఆవిడకి ఇప్పటికే 70 ఏళ్లు వచ్చాయి ఆవిడ ఆరోగ్యం బాగుపడడం అనే సమస్య ఉండదు. కేవలం నిన్ను మాయ చేయడానికి మీ సీతక్క చేసిన ప్రయత్నమే ఇది అని అంటుంది. అయితే సీతతో నువ్వు మాట్లాడి వస్తావా అసలు వాళ్లు వెళుతున్నారో మనం వెళ్లాలో తేల్చుకుని వస్తావా లేక నన్ను ఒక్కదానిని వెళ్లిపో మంటావా అని అడుగుతుంది.

తాడోపేడో తేల్చుకుందాం అని

తాడోపేడో తేల్చుకుందాం అని

లేదు నేను ఏదో ఒకటి తేల్చుకుని వస్తాను అని లక్ష్మణ్ బయటికి వస్తాడు. బయట సీత కూర్చుని ఒత్తులు చుడుతూ ఉంటుంది.. అదేమిటి ఇప్పుడు ఒత్తులు చూడుతున్నావు అని ప్రశ్నిస్తే మామూలుగా ఈ ఒత్తులు మా అమ్మ చుట్టి పంపించేది. ఎప్పుడైనా నేను చుడితే ఆమెకు అస్సలు నచ్చేది కాదు ఆమె అలిగేది. కానీ ఇప్పుడు చుట్టడానికి గాని అలగడానికి గాని ఏమీ లేదు కదా. అందుకే భవిష్యత్తులో ఉపయోగపడతాయి అని అనే ఒత్తులు చుడుతున్నాను అని అంటుంది. అయితే తాడోపేడో తేల్చుకుందాం అని వచ్చిన లక్ష్మణ్ వదిన మాటలు విని ఏం మాట్లాడాలో అర్థం కాక అలా కూర్చుని పోతాడు.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
మరో కొత్త షాక్

మరో కొత్త షాక్

ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగించారు ఇక తరువాతి ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం అనేక ట్విస్టులు అయితే చోటుచేసుకున్నట్లు కనిపిస్తోంది. నాని జైలుపాలు అయినట్లు శిల్ప రఘురాం కుటుంబ సభ్యులకు చెప్పడం కనిపిస్తోంది. అయితే నాని ని బయటకు తీసుకురావడం చాలా కష్టమని పోలీసులు మన మాట వినేటట్టు కనపడడం లేదు అని సీత చెబుతోంది.

అయితే ఇది దమయంతి ప్లాన్ లాగా కనిపిస్తోంది, ఎందుకంటే ఆమె స్వయంగా నాని ని లోపలికి తీసుకు రావడం, అభిమానం అంటే అది నా మీద నిజంగా ప్రేమ ఉంటే ఆమె ఇంతగా కష్టపడి నన్ను బయటకు తీసుకు వచ్చే వాళ్ళు అని అంటాడు. ఇక్కడ నాకు సరైన గుర్తింపు లేదు కాబట్టి నేను మా అత్తగారింటికి వెళ్ళిపోతున్నాను, శిల్పా మన ఇద్దరం బాగ్ లు సర్దుకుని బయట తీసుకురా అని నాని అంటాడు దీంతో మరో కొత్త షాక్ తగిలినట్టైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X