Vadinamma : కొంప ముంచిన భరత్.. అంతా బాగుందనుకుంటే మరో రచ్చ.. మళ్ళీ కొట్లాట?

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ 741 వ ఐపిసోడ్ కు చేరింది. ఈ సీరియల్ ముందు నుంచి ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ముందు నుంచి ఉమ్మడి కుటుంబం చాలా ఆనందంగా గడుపుతున్నారు. అయినా ఎప్పుడూ ఏవో ఒక ఇబ్బందులు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు భరత్, లక్ష్మణ్ మధ్య గొడవలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి అని లక్ష్మణ్ సహా అతని భార్య శైలు కూడా ఫిక్స్ అవుతుంది. ఒక్క రోజులో ఇంటి నుంచి వెళ్లిపోవాలి అని అనుకున్న నేపథ్యంలో అనుకోని విధంగా లక్ష్మణ్ దుండగుల చేతిలో దాడికి గురి అవుతాడు.

హాస్పిటల్ కి వెళ్లి వచ్చిన తర్వాత లక్ష్మణ్ కారణంగా భరత్, జనార్దన్ మధ్య గొడవ జరుగుతుంది. ఎలా అయినా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం, ఈ ఒక్కరోజే ఇంట్లో ఉండేది అని శైలు వెళ్లి రఘురాం, సీతాలకు చెప్పి వస్తుంది. అయితే తెల్లవారు జామునే వెళుతున్న లక్ష్మణ్ కాళ్ళ మీద భరత్ పడి తనను క్షమించమని అడుగుతాడు. ఇక అక్కడితో చివరి ఎపిసోడ్ ముగిసింది. ఇక ఈ రోజు జరుగుతున్న ఎపిసోడ్ లో ఎలాంటి విశేషాలు జరిగాయి అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

లక్ష్మణ్ కాళ్ళమీద పడి

లక్ష్మణ్ కాళ్ళమీద పడి

కుటుంబ సభ్యులు ఎవరూ ఊహించని విధంగా భరత్ వెళ్లి లక్ష్మణ్ కాళ్ళమీద పడి తాను చేసింది తప్పే అని అనుకోకుండా కోపంలో నీ మీద చేయి చేసుకున్నాను అని నిన్ను వదిలి ఉండలేను అని తనను క్షమించవలసిందిగా కోరుతాడు. ఇలా భరత్ తన కాళ్ళ మీద పడతాడు అని ఏ మాత్రం ఊహించని లక్ష్మణ్ కూడా తన తమ్ముడు కాళ్ల మీద పడటంతో కరిగిపోతాడు తన తమ్ముడు ఇలా తన కాళ్ళ మీద పడడం ఏమిటి అని బాధ పడతాడు. వెంటనే భరత్ ను హత్తుకొని నాకు కూడా నీ మీద కోపం లేదు ఏదో ఆ సమయంలో మాటా మాటా పెరిగి విషయం అంత వరకూ వెళ్ళింది నన్ను క్షమించు తమ్ముడు అని ఇద్దరూ ఆలింగనం చేసుకుంటారు.

చేయి చేసుకుంది కూడా

చేయి చేసుకుంది కూడా

ఇక వీళ్లు ఇద్దరూ ఇలా కలిసి పోవడం చూసి కుటుంబ సభ్యులు కూడా ఆనందం వ్యక్తం చేస్తారు. రఘురాం ఈ ఆనంద సమయంలో ఒక స్వీట్ చేసుకుని రమ్మని కూడా సీతను అడుగుతాడు. భరత్ కల్పించుకొని స్వీట్ అంటే అలాంటి ఇలాంటి స్వీట్ కాదు లక్ష్మణ అన్నయ్యకు గులాబ్ జామ్ ఇష్టం కాబట్టి గులాబ్ జామ్ చేయి వదిన అని అడుగుతాడు. వెంటనే రఘురాం అందుకుని మీ ఇద్దరూ కలిసి పోవడం చాలా ఆనందంగా ఉంది అలాగే భరత్ అతని మీద చేయి చేసుకుంది కూడా వేరే విషయం మీద కాదు అతను నీ గురించి తప్పుగా మాట్లాడితే అది విని తట్టుకోలేక అతని మీద దాడి చేశాడు అనే విషయాన్ని లక్ష్మణ్ కు వెల్లడిస్తాడు రఘురాం.

అరెస్టు చేయించి

అరెస్టు చేయించి

ఇక లక్ష్మణ్ శైలు పుట్టింటికి వెళ్లే కార్యక్రమం వాయిదా పడటంతో ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళతారు. లక్ష్మణ్ గదిలోకి వెళ్లి భరత్ గురించి తన భార్యకు గొప్పగా చెబుతాడు. ఇక భరత్ చేసిన పని బాగా నచ్చడంతో రఘురాం, భరత్ ను తన గదికి పిలిపించుకొని నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు ఒక్కోసారి మన బంధాలను నిలబెట్టుకోవడం కోసం తగ్గటంలో ఏ మాత్రం తప్పులేదు అని అంటాడు. దానికి భరత్ నా ఏర్పాట్లలో నేను ఉండి అన్నయ్య కాళ్ళ మీద పడ్డాను అని చెబుతాడు. ఏమిటి ఆ ఏర్పాట్లు అని అడిగితే తాను జనార్ధన్ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి బాబు ని కిడ్నాప్ చేయించిన అందుకుగాను అరెస్టు చేయించిన విషయం చెబుతాడు.

కేసు వెనక్కి తీసుకోవాలి

కేసు వెనక్కి తీసుకోవాలి

ఇది విన్న రఘు రామ సీత ఇద్దరు షాక్ అవుతారు ఇది మేము చేయలేక వదిలేసాము, అనుకుంటున్నావా అంతా సవ్యంగా ఉంది అనుకుంటున్న తరుణంలో మళ్లీ ఇలా చేసావు అని భరత్ మీద ఫైర్ అవుతారు. ఇదిలా జరుగుతుండగా ఈ విషయం ఇంకెవరికి వద్ద ప్రస్తావించగా వద్దు అని రఘు మాట తీసుకుంటాడు. మరోపక్క జనార్ధన్ భార్య పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది. పోలీస్ స్టేషన్కు వెళ్లి విడిపించాలి అంటే కేసు వెనక్కి తీసుకోవాలి అనే విషయం తెలుసుకుని రఘురామ్ ఇంటికి బయలుదేరి వెళుతుంది.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
కుటుంబ సభ్యులు అందరూ షాక్

కుటుంబ సభ్యులు అందరూ షాక్

తరువాతి ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం శైలు తల్లి రఘురామ్ ఇంటికి చేరుకుంటుంది. మా ఆయన మా మనవడిని కిడ్నాప్ చేయడం తప్పే అని మాట్లాడుతుంది. ఇది ఎక్కడ గోల రా నాయనా అనుకుని శైలు ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు ? అయిపోయింది కదా? అన్నట్టు మాట్లాడుతుంది, వదిలేయడం ఏమిటి ఇప్పుడు ఆ విషయం వల్లే కదా మీ నాన్నని అరెస్టు చేసి జైలులో పెట్టారు అని తల్లి అనడంతో కుటుంబ సభ్యులు అందరూ షాక్ అవుతారు.

అయితే భరత్ ను లక్ష్మణ్ కాలర్ పట్టుకుని నువ్వేనా ఇది చేసింది, అని అడుగుతుంటే లేదు నేను అని రఘురాం ముందుకు వెళ్ళాడు. చూడాలి తర్వాత ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది అని.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X