twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Vadinamma : ఇంటి నుంచి వెళ్లేందుకు సిద్దమైన భరత్, సిరి.. సీత కొత్త ప్లాన్.. !

    |

    స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ 756వ ఎపిసోడ్ కు చేరింది. సీత తన తల్లి మరణంతో ఒక పక్క కూర్చొని బాధపడుతూ ఉంటే మరోపక్క లక్ష్మణ్ ఆమె దగ్గరికి వచ్చి ఏదో మాట్లాడటానికి ప్రయత్నిస్తుంటాడు.. అయితే లక్ష్మణ్ తన దగ్గర ఏదో దాస్తున్నాడు, మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నాడు అని భావించిన సీత నువ్వే మాట్లాడాలి అనుకుంటున్నావో నాకు తెలుసు ఉంటుంది. అదేంటి ఏది లక్ష్మణ అడిగితే నువ్వు నాకు క్షమాపణ చెప్పాలి అనుకుంటున్నావు కదా అని అంటుంది..

    అవును నిజమే కానీ నేను పూర్తిగా చెప్పాలి అనుకున్న విషయం అది ఒక్కటే కాదు. ఈ సమయంలో నీకు చెప్పవచ్చో చెప్పకూడదో తెలియదు కానీ వీలయినంత త్వరగా భరత్ ఇంటి నుంచి వెళ్లిపోయే విధంగా నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి అని లక్ష్మణ్ అంటాడు.

    మనసు మార్చుకోలేదా

    మనసు మార్చుకోలేదా

    అదేమిటి నువ్వు మనసు మార్చుకున్నావు అని నేను అనుకున్నాను కానీ నువ్వు మనసు మార్చుకోలేదా అని ప్రశ్నిస్తుంది. లేదు నేను నా మనసు మార్చుకోవాలి అని అనుకోవడం లేదు నేను అలా మార్చుకుంటారని మీరు భావిస్తారు కాబట్టే ఇప్పుడు ఈ విషయాన్ని మీ ముందు తేటతెల్లం చేయడానికి నేను వచ్చాను అని లక్ష్మణ అంటాడు.

    మీ అందరూ ఒకే తల్లి గర్భంలో జన్మించిన వారు, మీలో ఒకటే రక్తం ప్రవహిస్తుంది మీరు విడిపోవడం కోసం తాపత్రయ పడుతూ ఉండటం నాకు ఏమీ నచ్చడం లేదు అని అంటుంది. ఒక తల్లి కడుపున పుట్టి ఉండవచ్చు కానీ మా లో ప్రవహిస్తున్న రక్తం గ్రూపులు వేరు కదా. మాకు భరత్ తో కలిసి ఉండడం ససేమిరా ఇష్టం లేదు. అంటే సీత కాలికి దెబ్బ తగిలింది కదా అని దానిని తొలగించడం కదా, అలాగే కుటుంబంలో మనస్పర్థలు వచ్చాయి కదా అని కుటుంబ సభ్యులు విడిపోవడం కరెక్ట్ కాదు అని అంటుంది.

    ఉండడం కరెక్ట్ కాదు

    ఉండడం కరెక్ట్ కాదు

    అయితే కాలు చెడిపోతే దానిని తొలగించడం అవసరమే కదా అన్నట్లు భారత్ గురించి మాట్లాడుతారు. ఎంత చెప్పినా వినక పోవడంతో లక్ష్మణ్ అక్కడి నుంచి తన భార్య దగ్గరకు వెళతాడు. మరోపక్క భరత్ తన భార్య సిరితో సీత దగ్గరకు వచ్చి అక్కడ జరిగిన సంభాషణ మేము విన్నాము, నువ్వు మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పొద్దు మేమే వెళ్ళిపోతాం.

    ఆ సమాధానంతో సీత చాలా బాధపడుతుంది వాడికి చెప్పాను వాడు వినడం లేదు మీకు చెబుతున్నారు మీరైనా వినండి అంటుంది. లేదు వదినమ్మ లక్ష్మణ్ అన్నయ్య అంత బాధపడుతుంటే నేను అతని మాట దిక్కరించి ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు అన్నట్లు భరత్ మాట్లాడుతాడు. సీత చాలా సేపు ఆలోచించి సరే నేను ఒక నిర్ణయానికి వచ్చాను దానికి నేను కట్టుబడి ఉండండి అని చెప్పి అప్పటికప్పుడు రఘు రామ్, లక్ష్మణ్, నాని, శిల్ప, రాజేశ్వరి పిలుస్తుంది.

    వెళ్ళిపో నివ్వండి

    వెళ్ళిపో నివ్వండి

    వాళ్లంతా హాల్లోకి వచ్చిన తర్వాత భరత్ ఇల్లు వదిలి వెళ్లిపోతాను అంటున్నాడు అనే విషయాన్ని చెబుతుంది. వెళ్ళిపోతాను అంటే వెళ్ళిపో నివ్వండి ఇప్పుడు మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు అని లక్ష్మణ్ శైలు ప్రశ్నిస్తారు. అయితే నువ్వు నాకు ఇచ్చిన మాట ఏమిటి ఇక్కడ జరుగుతున్న విషయం ఏమిటి అని రాజేశ్వరి సీతను ప్రశ్నిస్తుంది.

    ఇప్పుడు నా పరిస్థితి విషమం తాగాలా కత్తితో పొడిచి చాలా అన్నట్లు ఉంది, ఖచ్చితంగా భరత్, సిరీ వెళ్లిపోవాలి అని లక్ష్మణ్ పట్టుబడుతున్నాడు. అలా కుటుంబాన్ని ముక్కలు చేయడం నాకు ఇష్టం లేదు అని అంటుంది.

    కలిపి ఉంచే మరో టెక్నిక్

    కలిపి ఉంచే మరో టెక్నిక్

    అయితే మీ అందరికీ ఆమోదయోగ్యమైన లాగా ఒక నిర్ణయం తీసుకున్నాను ఈ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉంటారా అని సీత ప్రశ్నిస్తుంది. ముందు ఆ నిర్ణయం ఏంటో చెప్పండి ఆ తర్వాత మేము కట్టుబడి ఉండాలో లేదో మేము నిర్ణయించుకుంటాం అని శైలు మాట్లాడుతుంది. అయితే ఇల్లు మొత్తాన్ని రెండు భాగాలుగా విభజిస్తా అని మిగతా వాళ్ళందరూ ఒక పక్క లక్ష్మణ్ శైలు ఒక పక్క ఉండాలి అని అంటుంది. దీనికి శైలు మాత్రం ఒప్పుకునే విధంగా కనబడడం లేదు ఇది మనల్ని కలిపి ఉంచే మరో టెక్నిక్ అని ఆమె అంటుంది. ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగించారు.

    నాని కొత్త షాక్

    నాని కొత్త షాక్

    ఇక తరువాతి ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం అనేక ట్విస్టులు అయితే చోటుచేసుకున్నట్లు కనిపిస్తోంది. నాని జైలుపాలు అయినట్లు శిల్ప రఘురాం కుటుంబ సభ్యులకు చెప్పడం కనిపిస్తోంది. అయితే నాని ని బయటకు తీసుకురావడం చాలా కష్టమని పోలీసులు మన మాట వినేటట్టు కనపడడం లేదు అని సీత చెబుతోంది.

    అయితే ఇది దమయంతి ప్లాన్ లాగా కనిపిస్తోంది, ఎందుకంటే ఆమె స్వయంగా నాని ని లోపలికి తీసుకు రావడం, అభిమానం అంటే అది నా మీద నిజంగా ప్రేమ ఉంటే ఆమె ఇంతగా కష్టపడి నన్ను బయటకు తీసుకు వచ్చే వాళ్ళు అని అంటాడు. ఇక్కడ నాకు సరైన గుర్తింపు లేదు కాబట్టి నేను మా అత్తగారింటికి వెళ్ళిపోతున్నాను, శిల్పా మన ఇద్దరం బాగ్ లు సర్దుకుని బయట తీసుకురా అని నాని అంటాడు దీంతో మరో కొత్త షాక్ తగిలినట్టైంది.

    English summary
    Vadinamma Episode 757: Sita comes up with a solution for Laxman's stubborn demand. However, the situation gets worse as Shailu refuses to agree.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X