Vadinamma : బాంబ్ పేల్చిన రాజేశ్వరి.. అసలే తన్నుకు చస్తుంటే కొత్త తల్లనొప్పి!

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ లో అన్నదమ్ములు భరత్, రఘురాం అరెస్టై జైలులో ఉన్న సంగతి తెలిసిందే. గత ఎపిసోడ్ లో రఘురాం నా కడుపున పుట్టిన కొడుకు కాదు మీరు ముగ్గురు నా కొడుకులు అని నాని, లక్ష్మణులకు రాజేశ్వరి చెబుతుంది. భరత్ మనసు మార్చి రఘురాం కావాలనే మీ మీద ఇలా చేస్తున్నాడు అంటూ వాళ్లకు చెప్పడంతో పాటు భరత్ ని జైలు నుంచి విడిపించాలిసిందిగా లక్ష్మణ్ ని కోరుతుంది. అక్కడితో నిన్నటి ఎపిసోడ్ ముగిసింది.

భరత్ ను విడిచి పెట్టమని

భరత్ ను విడిచి పెట్టమని

ఇక ఈరోజు ఎపిసోడ్ లో వెంటనే లక్ష్మణ్ ఫోన్ చేసి తన మామ జనార్ధన్ కు భరత్ ను జైలు నుంచి విడిపించాలిసిందిగా కోరతాడు. అంతేకాక రఘురాం తమ తల్లి కడుపున పుట్టిన వాడు కాదని భరత్ తన తల్లి కడుపున పుట్టిన వాడు అని చెప్పి అతనిని వదిలి పెట్టవలసిందిగా కోరుతాడు.

తన మీద చేయి చేసుకున్నా సరే భరత్ సంగతి తర్వాత చూద్దామని అప్పటికప్పుడు జనార్ధన్ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి భరత్ ను విడిచి పెట్టాల్సిందిగా కోరతాడు. ఎస్సైకి కూడా భర్తతో పాత గొడవలు ఉండడంతో ముందు విడిచిపెట్టడానికి కాసేపు తటపటాయించి, ఎమ్మెల్యే స్వయంగా ఫోన్ చేసి చెప్పడంతో చివరికి భరత్ ని విడిచి పెడతా అని అంటాడు.

భాస్కర్ ఇంటికి సీత

భాస్కర్ ఇంటికి సీత

అయితే రఘురాంను విడిచిపెట్టకుండా భరత్ ను మాత్రమే విడిచి పెడతాను అని చెప్పడంతో పోలీస్ స్టేషన్ లో ఉన్న భరత్ రఘురాం అలాగే సీత, సిరి కూడా అనుమానం వ్యక్తం చేస్తారు.. నేను లోపలే ఉంటాను నువ్వు వెళ్ళు అని రఘురాంతో భరత్ చెబుతుంటే ఇష్టం వచ్చినప్పుడు వెళ్లి రావడానికి ఇదే మీ షాప్ కాదు, ఇది నా అడ్డ అంటూ ఎస్సై సీరియస్ అవుతాడు.

దీంతో చేసేదేమీ లేక భరత్ బయటకు రావడంతో భరత్, సిరి ఇంటికి చేరుతారు. మరో పక్క సీత ఎవరి దగ్గరికి వెళ్లాలో అర్థం కాక తన అన్న భాస్కర్ ఇంటికి వెళ్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత తల్లి తనను వినిపించడానికి కారణం లక్ష్మణ్ ఫోన్ చేసి చెప్పడంతోనే జనార్ధన్ విడిచిపెట్టమని పోలీసులకు చెప్పాడు అనే విషయాన్ని తెలుసుకుంటాడు భరత్. ఎందుకు అలా చెప్పావు అంటే లక్ష్మణ్ ఏమీ మాట్లాడాడు కానీ పక్కనే ఉన్న నాని కల్పించుకుని లక్ష్మణ్ అన్నయ్యకు వీలైన విధంగా నిన్ను విడిపించాడు.

ఏదో తేడా ఉందని

ఏదో తేడా ఉందని

దానికి సంతోషించాల్సిన కి పోయి రఘురాం అన్నయ్య ని ఎందుకు విడిపించ లేదు అని ప్రశ్నిస్తే అతను మాత్రం ఏం సమాధానం చెబుతాడు. అయినా నన్ను పోలీస్ స్టేషన్ లో నుంచి విడిపించమని అంటే ఏ మాత్రం పట్టించుకోని రఘురామ్ అన్నయ్యకు ఇప్పుడు అసలు పోలీస్ స్టేషన్ లో ఉంటే ఎలా ఉంటుందో అర్థం అవుతుంది అని నాని అంటాడు.

నాని అలా మాట్లాడడంతో భరత్ సిరి ఇద్దరు ఒకరి మీద కోప్పడతారు. అయితే రాజేశ్వరి మాత్రం నాని మీద కోప్పడుతుంటే సిరిని మందలిస్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత భరత్ కి లక్ష్మణ్ వ్యవహారం మీద అనుమానం వస్తుంది. తన తల్లి మాట తీరులో కూడా ఏదో తేడా ఉందని భరత్ అనుకుంటాడు. నేనంటే కోపం చూపిస్తున్న లక్ష్మణ్ విడిపించాడు అలాగే ప్రేమ ఎక్కువ అని అనుకుంటున్న రఘురాం అన్నయ్యని విడిపించలేదు.

శైలు మీద విరుచుకు పడి

శైలు మీద విరుచుకు పడి

ఇదంతా చూస్తుంటే ఏదో గందరగోళం గా కనిపిస్తోంది ఏదో జరిగింది అని భరత్ అనుమానం వ్యక్తం చేస్తాడు. ఇదిలా జరుగుతుండగా సీత తన అన్న భాస్కర్ ఇంటికి వెళ్ళింది. అప్పుడే భాస్కర్ కి సపర్యలు చేస్తున్న దుర్గ ప్రతి చిన్న విషయానికి నువ్వు ఇలా పరిగెత్తుకొని రావడం కరెక్ట్ కాదు అంటూ సీతను నిందించే ప్రయత్నం చేస్తుంది. అయితే భాస్కర్ మందలించడంతో చేసేదేమీలేక తన గోడు వెళ్లబోసుకోవడం కోసం పార్వతి దగ్గరకు పరిగెడుతుంది. పార్వతి దగ్గరికి వెళ్లి నీ అల్లుడు మళ్లీ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు అనే విషయం చెప్పడంతో ఆమె మళ్లీ ఇంటికి వచ్చి శైలు మీద విరుచుకు పడుతుంది.

రఘురాం కి షాక్

రఘురాం కి షాక్

రాజేశ్వరి ని టార్గెట్ చేసి రఘురాం తో ఎక్కువగా కలిసి ఉంటున్నాడు అనే ఉద్దేశంతో నా అల్లుడు ని పోలీస్ స్టేషన్ కి పంపుతారా? అడిగే వాళ్ళు ఎవరూ లేరు అనుకున్నారా అంటూ పార్వతి ఒక రేంజ్ లో ఫైర్ అవుతుంది. అయితే ఆమెను ఇప్పుడు కల్పించుకోవడం కంటే సైలెంట్ గా ఉండడమే నయమని సిరి, భరత్ ఆగుతారు. అయితే రాజేశ్వరి తో పార్వతి మాత్రం గట్టిగానే గొడవ పడుతుంది.

అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగించారు తరువాత ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం పోలీస్ స్టేషన్ నుండి విడుదల అయ్యాడు. తల్లి రాజేశ్వరి దగ్గరకు వెళ్లి నాకు ఇదంతా ఏదో అనుమానం గా ఉంది తమ్ముళ్లకు నేను నీ కడుపున పుట్టలేదు అనే విషయాన్ని చెప్పావా అని ప్రశ్నిస్తాడు. అవును చెప్పాను అని చెప్పడంతో రఘురాం షాక్ అవుతాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X