Vadinamma : రాజేశ్వరి ముసలం.. ఏకాకిగా మారిన రఘు.. 'రిషి' బాంబు పేల్చడానికి సీత సిద్దం?

ఆసక్తికరంగా సాగుతున్న వదినమ్మ సీరియల్ గత ఎపిసోడ్ లో రాజేశ్వరి రఘురాం తన కుమారుడు కాదనే విషయాన్ని లక్ష్మణులకు చెబుతుంది. భరత్ నీ సొంత తమ్ముడు కాబట్టి అతనిని వదిలిపెట్టమని మీ మామయ్య ని అడగమని కోరడంతో భరత్ ని వదిలి పెట్టమని లక్ష్మణ్ అడుగుతాడు. అలా గత ఎపిసోడ్ లో భారత్ జైలు నుంచి విడుదల అవుతాడు అయితే ఈ విషయాన్ని దుర్గ ద్వారా తెలుసుకున్న పార్వతి రాజేశ్వరి మీదకు వెళ్లి గొడవ పడుతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

పార్వతి ఒక రేంజ్ లో

పార్వతి ఒక రేంజ్ లో

అసలు ఆ షాప్ నా అల్లుడుది మీరు దాన్ని ఎలా కబ్జా చేస్తారు అంటూ పార్వతి ఒక రేంజ్ లో ఫైర్ అవుతూ ఉంటుంది. శైలు కి విషయం తెలియకపోవడంతో ముందు పార్వతి మీద ఫైర్ అవడానికి ప్రయత్నిస్తుంది కానీ రాజేశ్వరి ఎప్పటికైనా ఆ షాపు భరత్ అనే మాట ఇవ్వడంతో రాజేశ్వరి మాటమీద పార్వతి కూల్ అవుతుంది.

నన్ను బుజ్జగించడానికి చెబుతున్నావా? భయపడి చెబుతున్నావా ? అని ప్రశ్నించడంతో నీకు భయపడి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని ఆమె అంటుంది. షాప్ విషయంలో ఏదైనా తేడా వస్తే ఈసారి నేను మాత్రమే కాదు నా బలగం అంతా వస్తుంది అని ఆమె అంటుంది. ఆ తర్వాత ఇలా షాప్ కోసం మీ నాన్నకు ఫోన్ చేసి భరత్ ని వదిలి పెట్టమని నేనే చెప్పాను అనే విషయాన్ని రాజేశ్వరి చెబుతోంది. అదేంటి భారత్లాంటి బద్ధ శత్రువుని విడిపించడం కోసం మా నాన్న ఫోన్ చేసి చెప్పడం ఏమిటి అని శైలు ఆశ్చర్యపోతుంది.

కలల్లో తేలిపోతూ

కలల్లో తేలిపోతూ

వెంటనే తన తండ్రికి ఫోన్ చేసి అసలు ఏం జరిగింది ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని ప్రశ్నిస్తుంది. ఏమైంది అని అడిగితే భారత్ ని వదిలి పెట్టమని నువ్వే చెప్పావు అంట కదా అసలు ఏం జరిగింది? అని అడుగుతుంది. అయితే తన అల్లుడు కూతురుకి ఏమీ చెప్పలేదు అనే విషయం అర్థం చేసుకున్న జనార్ధన్ అసలు రఘురాం ఆ ఇంటికి పెద్ద కొడుకు కాదు. లక్ష్మణ్ మా ఇంటి పెద్ద కొడుకు.

రఘు ఆ ఇంటికి పెద్ద కొడుకు కాదు కాబట్టి అతనిని మీ కుటుంబం తప్పించడానికి మీ అత్తగారు ప్రయత్నిస్తోంది అని చెబుతాడు. అంతేకాక ఇకమీదట నువ్వే అఫీషియల్గా ఆ ఇంటికి పెద్ద కోడలు అని చెప్పటంతో శైలు ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. ఇప్పటి దాకా సీత అనుభవించిన పెద్దకోడలు హోదా తాను అనుభవిస్తున్నాను అనే విషయం అర్థం చేసుకుని ఆమె కలల్లో తేలిపోతూ ఉంటుంది.

శైలు కుట్ర

శైలు కుట్ర

ఇంట్లో అందరూ తనని గౌరవంతో చూస్తున్నట్లు మిగతా తోడి కోడళ్లు తన కాళ్లు నొక్కుతున్నట్టు తనకు సేవలు చేస్తున్నట్టు రకరకాలుగా ఆమె కలలో తేలిపోతూ ఉంటుంది. మరోపక్క రఘురాముని పోలీస్ స్టేషన్ నుంచి విడిపించేందుకు గాను బావ భాస్కర్ బెయిల్ తీసుకుని వెళతాడు. బెయిల్ తీసుకుని వచ్చిన తర్వాత ఏం జరిగింది అని ప్రశ్నిస్తే తనకు ఏదో అనుమానంగా ఉందని, రఘురామ్ అంటాడు.

పరిస్థితులు బాగాలేని సమయంలో శైలు సర్టిఫికెట్లు తీసుకొని దాని మీద లోన్ తీసుకున్న మాట వాస్తవమే అలాగే వ్యాపారం ఒడిదుడుకులలో ఉన్న కారణంగా డబ్బు కూడా సరిగ్గా కట్టడం లేదు. కానీ బ్యాంకు నుంచి నోటీసులు వచ్చిన విషయాన్ని శైలు దాచిపెట్టి ఇంత కుట్రకు పాల్పడిందన్న విషయాన్ని రఘురాం చెబుతాడు.

 ఏదో జరిగి ఉంటుందా?

ఏదో జరిగి ఉంటుందా?

అయితే నన్ను వదిలి పెట్టకుండా కేవలం భరత్ ను మాత్రమే లక్ష్మణ్ విడిపించడం వెనుక కూడా ఏదో జరిగి ఉంటుందని అనుమానాన్ని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అయితే రఘురాం ఇంటికి రావడంతో సీత ఆనందం వ్యక్తం చేస్తోంది కానీ మిగతా కుటుంబ సభ్యులు ఎవరు కూడా వారిని పట్టించుకున్న పాపాన పోరు.

తన తల్లి కూడా ఆనంద పడడం లేదు అనే విషయం అర్థం చేసుకున్న రఘురాం దాని గురించి బుర్ర బద్దలు కొట్టుకుని మరి ఆలోచిస్తూ ఉంటాడు. సీత వచ్చి ఏం జరిగింది అని ప్రశ్నించగా ఏం చెప్పాలో అర్థం కాక చెప్పలేని పరిస్థితుల్లో పడతాడు. నేను కూడా పరాయి దాన్ని అయిపోయాను అన్నట్టు సీత మాట్లాడుతుంది లేదు అసలు విషయం తెలుసుకుని వస్తాను అని చెప్పి తన తల్లి దగ్గరికి వెళ్లి అసలు ఏం జరిగింది అని ప్రశ్నిస్తాడు.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
సీత షాక్

సీత షాక్

ముందు చెప్పడానికి తటపటాయించిన రాజేశ్వరి ఆ తర్వాత ఏమీ జరగలేదు అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. నువ్వు ఏదైనా చేయకూడని తప్పు చేశావా అంటే చేయకూడని తప్పు ఏమీ చేయలేదు అంటుంది.. అంటే ఏదో తప్పు చేశావు అంటే ఏంటి ఇలా మాట్లాడతావు నేనేం తప్పు చేస్తా అని రాజేశ్వరి ఎదురు తిరుగుతుంది.

రఘు తన తల్లి రాజేశ్వరి తో మాట్లాడుతున్న పరిస్థితులలో ఈ రోజు ఎపిసోడ్ ముగించారు. తర్వాత ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తుంది దాని ప్రకారం రఘురాంకి రాజేశ్వరి తన పిల్లలకి నిజం చెప్పిన విషయం చెప్పినట్లు కనిపిస్తోంది. సీత కూడా నేను కోడలిగా వచ్చిన తర్వాత అన్ని మీ నుంచే నేర్చుకున్నాను రిషి నా కొడుకు అనే విషయం నేను కూడా కుండబద్దలు కొట్టి చెప్పాలి అనుకుంటున్నాను అని షాక్ ఇస్తోంది. చూడాలి మరి ఏం జరగబోతోంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X