Vadinamma : ఇంటి నుంచి వెళ్ళడానికి సిద్దమైన లక్ష్మణ్.. రాజేశ్వరికి తీవ్రగాయాలు?

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ 743 వ ఐపిసోడ్ కు చేరింది. ఈ సీరియల్ ముందు నుంచి ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ముందు నుంచి ఉమ్మడి కుటుంబం చాలా ఆనందంగా గడుపుతున్నారు. అయినా ఎప్పుడూ ఏవో ఒక ఇబ్బందులు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు భరత్, లక్ష్మణ్ మధ్య గొడవలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి అని లక్ష్మణ్ సహా అతని భార్య శైలు కూడా ఫిక్స్ అవుతుంది. ఒక్క రోజులో ఇంటి నుంచి వెళ్లిపోవాలి అని అనుకున్న నేపథ్యంలో అనుకోని విధంగా లక్ష్మణ్ దుండగుల చేతిలో దాడికి గురి అవడం, హాస్పిటల్ కి వెళ్లి వచ్చిన తర్వాత లక్ష్మణ్ కారణంగా భరత్, జనార్దన్ మధ్య గొడవ జరగడంతో లక్ష్మణ్ కాళ్ళ మీద భరత్ పడి తనను క్షమించమని అడుగుతాడు.

అయితే అప్పటికే జనార్దన్ మీద కంప్లైంట్ ఇవ్వడంతో అతనిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అతనిని విడిపించమని భార్య వచ్చి ఆడగడంతో జనార్దన్ కంప్లైంట్ ఇచ్చింది నేనని అంటారు. ఇక అక్కడితో చివరి ఎపిసోడ్ ముగిసింది. ఇక ఈ రోజు జరుగుతున్న ఎపిసోడ్ లో ఎలాంటి విశేషాలు జరిగాయి అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

ఇలా ఎందుకు?

ఇలా ఎందుకు?

తన మామ గారి మీద తన కుటుంబ సభ్యులు పోలీస్ కంప్లైంట్ ఇస్తారు అని ఏ మాత్రం ఊహించని లక్ష్మణ్ సొంత అన్నయ్య పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం తో అసలు తట్టుకోలేక పోతాడు. అయితే అసలు రఘురాం ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు అన్నట్టు కుటుంబ సభ్యులందరూ ఆలోచిస్తూ ఉంటారు. అయితే రఘురాం కంప్లైంట్ ఇవ్వలేదు, భరత్ కంప్లైంట్ ఇచ్చాడు అని విషయం తెలుసుకున్న సీత ఇలా ఎందుకు సమాధానం చెప్పారు? అని తన భర్తను ప్రశ్నిస్తుంది దీంతో తన తల్లి తననూ తన తమ్ముళ్లను వేరు చేసి మాట్లాడిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

 ముద్ర పడినా పర్వాలేదు

ముద్ర పడినా పర్వాలేదు

ఈ విషయం తన మనసును తొలిచేస్తుంది అని నేను తప్పుగా ముద్ర పడినా పర్వాలేదు వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నాను అని చెబుతాడు. నన్ను మా అమ్మ వేరుగా చూసిన పరవాలేదు కానీ వాళ్లు నేను వేరు అన్నట్టు మాట్లాడటం కరెక్ట్ కాదు అని రఘు అభిప్రాయపడ్డాడు. మరో పక్క తనను తన సొంత అన్నయ్య మోసం చేయడం ఏ మాత్రం భరించలేని లక్ష్మణ్ ఇంకా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఈ ఇంటి నుంచి బయటపడాలని తన భార్యతో అంటాడు. ఆ ఆవేశం ఇంకా ఎంత సేపు ఉంటుందో వేచి చూద్దాం అన్నట్లుగా శైలు నిష్ఠూరం ఆడుతుంది.

ఉండే ప్రసక్తే లేదు

ఉండే ప్రసక్తే లేదు

లేదు నేను ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నా నేను ఇక్కడ ఉండే ప్రసక్తే లేదు అని లక్ష్మణ్ అంటాడు. దీంతో శైలు తండ్రికి ఫోన్ చేసి బండి పంపించమని అడుగుతుంది. శైలు తండ్రి కూడా నిష్ఠూరం ఆడటంతో మీరు పంపించండి, లేక పోతే మేము క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళతాను అన్నట్లు మాట్లాడుతుంది. దీంతో జనార్ధన్ కాసేపట్లో మీ ముందు ఉంటుంది అని చెబుతాడు. ఇలా వాళ్ళిద్దరూ బయటకు వెళ్లి పోతున్న క్రమంలో మిగతా కుటుంబ సభ్యులందరూ వారిని ఆపడానికి ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలోనే రఘు రామ్, లక్ష్మణ్ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంటుంది.

 వెళ్ళద్దు అని

వెళ్ళద్దు అని

రఘు రాంని ఏమీ అనలేక లక్ష్మణ్, భరత్ టార్గెట్ చేయడానికి ప్రయత్నిస్తుంటే రఘురాం భరత్ చాలా మంచివాడని తప్పు చేసి ఉంటే అది తన మీద వేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంతేకాక మీ ఇద్దరిదీ ఒకే రక్తం అనే రఘురాం పొరపాటున అనేస్తాడు. దీంతో వాళ్ళందరూ అనుమానాలు మొదలవుతాయి. వాడికి నేనంటే ఇష్టం అంటున్నావు కానీ నీకు నేనంటే ఇష్టం లేదా అన్నయ్య అని లక్ష్మణ్ అడుగుతుంటే రఘురాం ఏమీ చెప్పలేక సైలెంట్ గా ఉండి పోతాడు. మొత్తం మీద ఈ వ్యవహారం అంతా హాట్ టాపిక్ గా నడుస్తోంది. అయినా సరే లక్ష్మణ్ ఇంటి నుంచి బయలుదేరి వెళ్లిపోవడానికి సిద్ధమైన క్రమంలో వారి తల్లి రాజేశ్వరి గుమ్మం దాకా వెళ్లి వాళ్లను వెళ్ళద్దు అని చెప్పడానికి ప్రయత్నిస్తోంది.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
తీవ్ర గాయాలు

తీవ్ర గాయాలు

ఈ సమయంలోనే వీల్ చైర్ నుంచి ఆమె కింద పడిపోవడంతో ఆమె తీవ్ర గాయాలు అవుతాయి. దీంతో ఆమెను హుటాహుటిన హాస్పిటల్ కి తరలిస్తారు. హాస్పిటల్ లో ఉన్న సీత కు ఫోన్ చేసిన లక్ష్మణ్ తల్లి కి ఎలా ఉంది అని అడుగుతాడు. అయితే నేరుగా మీ అన్నయ్య కి ఫోన్ చేసి అడగొచ్చు కదా అంటే లేదు నేను ఇక మీదట అన్నయ్యతో మాట్లాడను అని లక్ష్మణ్ బాంబు పేలుస్తాడు. మరో పక్క రాజేశ్వరి తీవ్రగాయాలతో బాధపడుతున్నట్టు చూపించారు. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగించారు. రాబోతున్న ఎపిసోడ్ ప్రకారం భరత్ దగ్గరకు వెళ్ళిన లక్ష్మణ్ అమ్మకు నేనంటే ఇష్టం, నువ్వు ఈ ఇంట్లో నుంచి రేపటి లోపు వెళ్లిపోవాలి అని మెమోరాండం జారీ చేస్తాడు దీంతో తదుపరి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగేట్టు కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X