Vadinamma : మరింత ముదిరిన ముసలం.. శైలు దెబ్బకు భరత్ కి వార్ణింగ్ ఇచ్చిన లక్ష్మణ్
స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ 744 వ ఎపిసోడ్ కు చేరింది. ఈ సీరియల్ ముందు నుంచి ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ముందు నుంచి ఉమ్మడి కుటుంబం చాలా ఆనందంగా గడుపుతున్నారు. అయినా ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బంది తలెత్తుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు భరత్, లక్ష్మణ్ మధ్య గొడవలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి అని లక్ష్మణ్ సహా అతని భార్య శైలు కూడా ఫిక్స్ అవుతుంది.
Photo Courtesy: Star మా and Disney+Hotstar

కంప్లైంట్ ఇచ్చింది నేను
ఒక్క రోజులో ఇంటి నుంచి వెళ్లిపోవాలి అని అనుకున్న నేపథ్యంలో అనుకోని విధంగా లక్ష్మణ్ దుండగుల చేతిలో దాడికి గురి అవడం, హాస్పిటల్ కి వెళ్లి వచ్చిన తర్వాత లక్ష్మణ్ కారణంగా భరత్, జనార్దన్ మధ్య గొడవ జరగడంతో లక్ష్మణ్ కాళ్ళ మీద భరత్ పడి తనను క్షమించమని అడుగడంతో ఇంట్లో ఉండాలని అనుకుంటాడు. అయితే అప్పటికే జనార్దన్ మీద భరత్ కంప్లైంట్ ఇవ్వడంతో అతనిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అతనిని విడిపించమని భార్య వచ్చి ఆడగడంతో జనార్దన్ కంప్లైంట్ ఇచ్చింది నేనని అంటాడు. ఇక ఇక్కడ ఉండడం కుదరదు వెళ్ళిపోతున్నామని లక్ష్మణ్, శైలు వెళ్తుంటే ఆపేందుకు వెళ్లిన రాజేశ్వరి కిందపడి గాయాలపాలవుతుంది. ఇక అక్కడితో చివరి ఎపిసోడ్ ముగిసింది. ఇక ఈ రోజు జరుగుతున్న ఎపిసోడ్ లో ఎలాంటి విశేషాలు జరిగాయి అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

గాయాలపాలై
లక్ష్మణ్ శైలు బయటికి వెళ్ళి పోతుంటే వారిని ఆపేందుకు వెళ్ళిన రాజేశ్వరి తన వీల్ చైర్ లో మంచి కిందపడిపోయి గాయాలపాలైన సంగతి తెలిసిందే. వెంటనే ఆమెను రఘురాం సహా ఇతర కుటుంబ సభ్యులు హుటాహుటిన హాస్పిటల్ కి తరలించారు. ఆమె తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్ లో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. భరత్- సిరి, సీత -రఘురాం హాస్పిటల్ కి వెళ్ళగా నాని- శిల్పా, శైలు- లక్ష్మణ్ మాత్రం ఇంట్లోనే అసలేం జరిగింది అని ఎదురు చూస్తూ ఉంటారు. ఈ సమయంలో లో ఆమెను హాస్పిటల్ లోపల చికిత్స అందిస్తుండగా సిరి రఘురామ్ ని ప్రశ్నించడానికి వెళుతుంది. నువ్వు ఇలా చేస్తావని అస్సలు ఊహించలేదు బావ భారత్ ఇప్పటి వరకు ఇలాంటి పనులు చేశాడు అని చాలా కోపంగా ఉన్నాను కానీ నలుగురికి మంచి చెప్పాల్సిన నువ్వు ఇలా చేయడం నాకు ఏమీ నచ్చలేదు అని చెబుతుంది.

అన్నయ్యని టార్గెట్ చేసి
రేపొద్దున మా పరిస్థితి కూడా ఇలాగే అవ్వదు అని గ్యారెంటీ ఏమిటి అంటూ దాన్ని బాధ పెట్టే విధంగా సిరి మాట్లాడుతూ ఉంటుంది. అయితే దూరం నుండి ఈ విషయాన్ని గమనించిన భారత్ కూడా హుటిన అక్కడికి పరిగెత్తుకుని వస్తాడు. అసలు ఎందుకు నువ్వు నువ్వు అన్నయ్యని టార్గెట్ చేసి మాట్లాడుతున్నావు? అసలు కంప్లైంట్ ఇచ్చింది ఎవరో తెలుసా అని భారత్ అంటాడు. అయితే ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చింది ఎవరు అనే విషయం సిరి కి తెలియాల్సిన అవసరం లేదు కదా అని రఘురామ్ అంటే కాదు అని చెప్పి భారత్ తానే కంప్లైంట్ ఇవ్వగా ఆ నింద రఘురాం తన మీద వేసుకున్నాడు అనే విషయాన్ని చెబుతాడు. అయితే రఘురాం సరే అయింది ఏదో అయింది, మీరు ఇక్కడ ఉండవద్దు మీరు ఇంటికి వెళ్లిపోండి. అని వాళ్ళకి చెబుతాడు. రఘురాం మాట ప్రకారమే సిరి తన భర్త భరతుని తీసుకుని ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు చేస్తున్న పనులు నాకు నచ్చడం లేదు అని భారత్ ను కడిగి పారేస్తుంది భరత్ కూడా ఏం జరిగిందనే విషయాన్ని వెల్లడించాడు.

కంప్లైంట్ ఇచ్చినట్లు
జనార్ధన్ ఎలాంటి దుర్మార్గుడో నీకు తెలుసు కదా, అన్నయ్యని జైలుకు పంపించడానికి ప్రయత్నించిన వాడిని నేను ఊరికి ఎలా వదిలేయ్ అని అంటావు అని ప్రశ్నిస్తాడు. అయితే సరిగ్గా ఈ విషయాన్ని సిరితో చెబుతున్న సమయంలోనే అనూహ్యంగా శైలు వింటుంది. వెంటనే తన తండ్రితో విషయాన్ని ఖరారు చేసుకునేందుకు తన తండ్రికి ఫోన్ చేస్తుంది తన తండ్రికి ఫోన్ చేసి అసలు నీ మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరు అని అడిగితే ఇంకెవరూ ఆ బండోడే కదా అని జనార్దన్ చెబుతాడు అవునా మరి అది ఏంటి మా బావగారు మీద వేసుకుని తాను కంప్లైంట్ ఇచ్చినట్లుగా లక్కీకి చెప్పాడు అంటుంది. దీంతో ఒక నిర్ణయానికి వచ్చిన శైలు ఏదైనా మన మంచికే జరిగింది లక్కీ ఇప్పుడు వాళ్ళు ఇద్దరు మీద అసహ్యం పెంచుకున్నాడు అని అంటుంది. అయితే ఈ విషయాన్ని మాత్రం లక్కీ కి తెలియని వద్దు అని జనార్ధన్ చెబుతాడు సరే నాన్న మీరు ఎలా అంటే అలా అని అతనికి అభయమిచ్చి బయటకు వస్తుంది.
Recommended Video

భరత్ కనపడకూడదు అని
తీరా బయటకు వచ్చిన తర్వాత రఘురాం ఇంటికి రావడంతో మా మామగారికి క్షమాపణలు చెబుదువు అని లక్ష్మణ్ అన్నయ్యని అడుగుతాడు. అయితే కంప్లైంట్ ఇచ్చింది. భరత్ కాబట్టి తాను ఇప్పుడు క్షమాపణలు చెప్పడం కుదరదు అని రఘురాం చెప్పలేక పోతాడు ఇంతలో శైలు ఎంట్రీ ఇచ్చి వీళ్ళందరూ నాటకాలాడుతున్నారని చెప్పి అసలు నిజం చెబుతుంది. ఇది ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగించారు. కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం సీట్లు హాస్పిటల్ నుంచి ఇంటికి రావడం లక్ష్మణ్ నిన్నే మీ అమ్మ కలవరిస్తోంది అని చెప్పిన వెంటనే లక్ష్మణ్ చూసావా అమ్మకి నేనే ముఖ్యం నేనే కావాలి నేను హాస్పిటల్ కి వెళ్లి తిరిగి వచ్చే లోపు భరత్ కనపడకూడదు అని ఆజ్ఞ జారీ చేసి బయటకు వెళ్తారు. మొత్తం మీద కుటుంబం మధ్య గొడవ ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. చూడాలి మరి ఏం జరుగుతోంది అనేది.


Click it and Unblock the Notifications











