Vadinamma : లక్ష్మణ్ కు మళ్ళీ ఎదురుతిరిగిన భరత్.. శైలు ప్లాన్ విఫలం.. ఏమైందంటే?

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ 745 వ ఎపిసోడ్ కు చేరింది. ముందు నుంచి ఉమ్మడి కుటుంబం చాలా ఆనందంగా గడుపుతున్నా, వారి మధ్య ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బంది తలెత్తుతుంది. ఇప్పుడు భరత్, లక్ష్మణ్ మధ్య గొడవలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి అని లక్ష్మణ్ సహా అతని భార్య శైలు కూడా ఫిక్స్ అవగా లక్ష్మణ్ దుండగుల చేతిలో దాడికి గురి అవడం, హాస్పిటల్ కి వెళ్లి వచ్చిన తర్వాత లక్ష్మణ్ కారణంగా భరత్, జనార్దన్ మధ్య గొడవ జరుగుతుంది. లక్ష్మణ్ వెళ్ళడానికి సిద్ధం కాగా అతని కాళ్ళ మీద భరత్ పడి తనను క్షమించమని అడగడంతో ఇంట్లో ఉండాలని అనుకుంటాడు.

అయితే అప్పటికే జనార్దన్ మీద భరత్ కంప్లైంట్ ఇవ్వడంతో అతనిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అతనిని విడిపించమని భార్య వచ్చి ఆడగడంతో జనార్దన్ కంప్లైంట్ ఇచ్చింది నేనని అంటాడు. ఇక్కడ ఉండడం కుదరదు వెళ్ళిపోతున్నామని లక్ష్మణ్, శైలు వెళ్తుంటే ఆపేందుకు వెళ్లిన రాజేశ్వరి కిందపడి గాయాలపాలవుతుంది. ఇక ఆమెను హాస్పిటల్ లో జాయిన్ చేస్తారు. అక్కడితో చివరి ఎపిసోడ్ ముగిసింది. ఇక ఈ రోజు జరుగుతున్న ఎపిసోడ్ లో ఎలాంటి విశేషాలు జరిగాయి అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

 ఆత్రుతగా ఎదురు చూస్తూ

ఆత్రుతగా ఎదురు చూస్తూ

తన తల్లి తన గురించి ఆలోచిస్తూ ఉందనే విషయం తెలుసుకున్న లక్ష్మణ్ భరత్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనే నేను ఇంట్లో ఉంటాను అని చెబుతాడు. దీంతో మిగతా కుటుంబ సభ్యులు అందరూ షాక్ అవుతారు. అయితే నాని, సీత హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న రాజేశ్వరి ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. డాక్టర్ వచ్చి ఆమె స్పృహ వచ్చింది కానీ ఆమె ఆరోగ్య పరిస్థితి ఏ మాత్రం బాగలేదని మానసికంగా చాలా బాధ పడుతున్నారు అని చెబుతోంది.

 నేను చచ్చిపోతా

నేను చచ్చిపోతా

చాలా జాగ్రత్తగా ఆమెతో డీల్ చేయాలని డాక్టర్ సూచించడంతో వెంటనే సీత, నానిని తీసుకుని లోపలికి వెళుతుంది. సీతను చూసిన వెంటనే రాజేశ్వరి ఎమోషనల్ అవుతూ నేను బతకడం అనవసరం నేను చచ్చిపోతా అన్నట్లు మాట్లాడుతుంది. దీంతో సీత మీరే అలా అంటే మేమందరం ఏమైపోతాం మీరే మా పెద్దదిక్కుగా భావించి బతుకుతున్నాం అని అంటుంది. ఇంకా నీ నాటకాలు ఆపు నా కుటుంబ సభ్యులు అందరూ విడి పోతూ ఉంటే ఇంక నేను బతికి ఉపయోగం ఉంటుంది అని ఆమె అంటుంది.

 మాట ఇవ్వమని

మాట ఇవ్వమని

అయితే సీత అదేమీ లేదని లక్ష్మణ్ ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో ఉండటానికి సిద్ధమయ్యాడు అని చెబుతోంది. నేను కింద పడిపోయాను కాబట్టి మర్యాద కోసం ఉంటున్నాడు ఏమో కానీ వాడు బయటకి వెళ్లి పోవాలి అని ఫిక్స్ అయ్యాడు కదా అని ప్రశ్నిస్తోంది. దానికి సీత లేదని అంటుంది అయితే మీరు మాత్రమే నన్ను చూడడానికి ఎందుకు వచ్చారు మిగతావాళ్లు అందరూ ఎందుకు రాలేదు అని రాజేశ్వరి ప్రశ్నిస్తుంది. అయితే సీత ఏదో సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉండగా వాళ్ళు ఎవరు విడిపోకుండా చూసుకుంటాను అని నాకు మాట ఇవ్వు అని రాజేశ్వరి అడుగుతుంది.

 బాగానే ఉంది కానీ

బాగానే ఉంది కానీ

సీతకు తాను ఆ పని చేయలేను అని తెలిసినా సరే ఆమె ఆనందం కోసం అప్పటికప్పుడు మాట ఇస్తుంది. అయితే సీత బయటికి వచ్చిన తర్వాత నాని బాధపడుతూ వదినమ్మ నువ్వు మాట ఇచ్చావ్, మాట తప్పితే నీ విలువ పోతుంది కదా అంటుంది. అంటే అదేమీ లేదులే అన్నట్లుగా సీత మాట్లాడుతుంది. వెంటనే సీత ఇంటికి బయలుదేరి వెడుతుంది. సీత ఇంటికి వచ్చే సమయానికి లక్ష్మణ్ తన భార్య ఎదురు చూస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత అమ్మకు ఎలా ఉంది అంటే బాగానే ఉంది కానీ నీ కోసమే ఆమె కలవరిస్తుంది అంటుంది. అయితే నేను ఇంట్లో నుంచి వెళ్లకుండా ఉంటాను కానీ భరత్ ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి అని లక్ష్మణ్ షరతు పెడతాడు.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
 ఎదురు తిరిగి

ఎదురు తిరిగి

ముందు నుంచి ఈ విషయంలో కాస్త సమయం పాటిస్తూ వచ్చిన భరత్ కూడా ఇప్పుడు ఎదురు తిరుగుతాడు. ఇంట్లో నీకెంత హక్కు ఉందో నాకు అదే హక్కు ఉంది నువ్వు నన్ను బయటికి వెళ్లిపోమంటే నేను ఎలా వెళ్తాను అన్నట్లు మాట్లాడుతాడు. ఈలోపే శైలు తండ్రికి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెబుతుంది. అంతా అయిపోయింది ఇక నువ్వు బయటకు రావడానికి అవకాశం లేకుండా పోయిందని అంటుండగా కంగారు పడకు లక్ష్మణుని బయటకు తీసుకొచ్చే బాధ్యత నాది అని శైలు చెబుతుంది. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగించిన తర్వాత ఎపిసోడ్ లో చూపిస్తున్న దాని ప్రకారం రాజేశ్వరి హాస్పిటల్ నుంచి తిరిగి ఇంటికి వస్తుంది కానీ లక్ష్మణ్ ఎక్కడ కనపడక పోవటంతో లక్ష్మణ్ లక్ష్మణ్ ఎక్కడ అని ఆలోచిస్తూ ఉంటుంది.. మొత్తం మీద తర్వాత ఇప్పుడు కూడా ఆసక్తికరంగా సాగే లభిస్తోంది చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X