Vadinamma : మళ్ళీ పుట్టిన ముసలం.. తల్లికి మాటిచ్చి తప్పిన లక్ష్మణ్.. ఫ్యామిలీలో టెన్షన్!
స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ 746 వ ఎపిసోడ్ కు చేరింది. ముందు నుంచి ఉమ్మడి కుటుంబం చాలా ఆనందంగా గడుపుతున్నా, వారి మధ్య ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బంది తలెత్తుతుంది. ఇప్పుడు భరత్, లక్ష్మణ్ మధ్య గొడవలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి అని లక్ష్మణ్ సహా అతని భార్య శైలు కూడా ఫిక్స్ అవగా లక్ష్మణ్ దుండగుల చేతిలో దాడికి గురి అవడం, హాస్పిటల్ కి వెళ్లి వచ్చిన తర్వాత లక్ష్మణ్ కారణంగా భరత్, జనార్దన్ మధ్య గొడవ జరుగుతుంది. లక్ష్మణ్ ఇల్లు వదిలి వెళ్లడానికి సిద్ధం కాగా అతని కాళ్ళ మీద భరత్ పడి తనను క్షమించమని అడగడంతో ఇంట్లోనే ఉండాలని లక్ష్మణ్ భావిస్తాడు. అయితే అప్పటికే జనార్దన్ మీద భరత్ కంప్లైంట్ ఇవ్వడంతో అతనిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఈ క్రమంలో వెళ్ళిపోతున్నామని లక్ష్మణ్, శైలు వెళ్తుంటే వారిని ఆపేందుకు వెళ్లి రాజేశ్వరి కిందపడి గాయాలపాలవుతుంది. ఇక ఆమెను హాస్పిటల్ లో జాయిన్ చేస్తే తాను చనిపోతానని ఆమె అంటూ ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తానని సీత మాట ఇస్తుంది. ఇక ఈ రోజు జరుగుతున్న ఎపిసోడ్ లో ఎలాంటి విశేషాలు జరిగాయి అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మాట ఇచ్చి తప్పితే
సీత మాట ఇవ్వడంతో రాజేశ్వరి చాలా ఆనందం వ్యక్తం చేస్తుంది. ఆమె కాస్త రిలాక్స్ అవుతూ ఉండడంతో నేను ఇప్పుడే ఇంటికి వెళ్లి వస్తాను అని సీత ఇంటికి వస్తుంది. సీత ఇంటికి వచ్చిన తర్వాత లక్ష్మణ్ భరత్ ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని షరతులు విధించి తల్లిని చూసేందుకు హాస్పిటల్ కి వెళ్తాడు. అయితే లక్ష్మణ్ మాటలతో బాధ పడిన సీత తాను అత్తగారికి మాట ఇచ్చిన సంగతి తన భర్త రఘు రామ్ కి చెబుతుంది.. ఒకపక్క భరత్ ను సపోర్ట్ చేస్తున్నాను అని లక్ష్మణ్, లక్ష్మణ్ ఏమంటున్నా మాట్లాడటం లేదు అని భరత్ ఇద్దరూ కూడా నన్ను ద్వేషిస్తున్నారు, ఇప్పుడు నువ్వు కూడా వాళ్ళిద్దరినీ కలుపుతాను అని అమ్మకి మాట ఇచ్చి దానిని తప్పితే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది కదా అని అంటాడు.

గెలవాలి కానీ పారిపోకూడదు
ఏమి చేసినా సరే వాళ్ళిద్దరినీ కలపాలి, యుద్ధంలో చనిపోవాలి లేదా గెలవాలి కానీ పారిపోకూడదు అని అంటుంది. మరోపక్క లక్ష్మణ్ హాస్పిటల్ కి వెళ్తాడు, అక్కడ నాని అతనిని లోపలికి తీసుకొని వెళ్ళాడు. లోపలికి తీసుకు వెళ్ళే ముందే అమ్మను బాధపెట్టే విషయాలు ఏవి మాట్లాడవద్దు అని డాక్టర్లు చెప్పారు అని నాని చెబుతాడు. దీంతో లక్ష్మణ్ ఆమె నాకు కూడా తల్లి నాకు ఆ మాత్రం తెలియదా అన్నట్లు గా లక్ష్మణ్ అంటాడు. లోపలికి వెళ్ళిన లక్ష్మణ్ నేను ఎక్కడికి వెళ్లడం లేదు ఇక్కడే ఉంటాను అని తల్లికి మాట ఇస్తాడు. అయితే ఇప్పటి వరకు మిగతావాళ్లు అందరూ చెప్పినా వినకుండా స్వయంగా లక్ష్మణ్ ఇప్పుడు వచ్చి నేను ఎక్కడికి వెళ్లడం లేదు అని విషయం చెప్పడంతో రాజేశ్వరి చాలా ఆనందం వ్యక్తం చేస్తోంది.

ఇలా చేయకుండా ఉంటే
నన్ను డిశ్చార్జ్ చేసేయండి నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు ఇక మందులు కూడా నేను తినాల్సిన అవసరం లేదు అని డాక్టర్లతో ఆమె చెబుతుంది. మరో పక్క భరత్ తో సిరి మాట్లాడుతూ ఉంటుంది. భరత్ ఇదంతా ఎవరి వల్ల జరిగింది అని ఆలోచిస్తూ ఉంటాడు. సిరి వచ్చి ఇదంతా నీ వల్లే జరిగింది బావ, నువ్వు గనక జనార్ధన్ మీద కంప్లైంట్ ఇవ్వకుండా ఉంటే అంతా బాగుండేది అంటుంది. భరత్ ఆవిషయంలో బాధపడకుండా అనే ఇదంతా శైలు వదిన చేస్తున్న పని, నాన్న డైరెక్షన్ లో శైలు వదిన ఇలా చేయకుండా ఉంటే ఇంత రాద్దాంతం జరిగి ఉండేది కాదు అనే విషయాన్ని చెబుతాడు. ఇది ఇలా జరుగుతూ ఉండగా సీత కు ఫోన్ చేసిన రాజేశ్వరి తనను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకు వెళ్లాల్సిందిగా కోరుతుంది.

ఇలా చేయకుండా ఉంటే
అలా ఆమె వెళ్లడానికి సిద్ధమవుతున్న క్రమంలో లక్ష్మణ్ హాస్పిటల్ నుంచి తిరిగి వస్తాడు. రావడం రావడమే భరత్ ఇంటి నుంచి వెళ్లాడా లేదా అని ప్రశ్నిస్తూ వస్తాడు. నువ్వు చెప్పినంత మాత్రాన నేను వెళ్లిపోవాలా అని భరత్ ఎదురు తిరగడంతో వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంది. పరిస్థితి చేయి దాటి పోవడంతో సీత వారిద్దరి మీద అసహనం వ్యక్తం చేస్తుంది. మీరు ఇలా తయారయ్యారు ఏమిటి అన్నట్లు మాట్లాడుతుంది. రఘురాం సీత ఇద్దరూ కలిసి శైలు ని టార్గెట్ చేయడం తో శైలు తన భర్తను వాళ్ళు అలా మాట్లాడుతుంటే నువ్వు ఏమీ మాట్లాడటం లేదు అన్నట్లు మాట్లాడుతుంది. దీంతో లక్ష్మణ్ అన్న, వదిన మీద అసహనం వ్యక్తం చేస్తాడు అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగించారు.

కమింగ్ అప్ లో
తర్వాత ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం రాజేశ్వరి హాస్పిటల్ నుంచి కోలుకుని తిరిగి ఇంటికి వస్తుంది. కానీ అనూహ్యంగా ముందే కనిపిస్తాడు అనుకున్న లక్ష్మణ్ ఎక్కడ కనపడక పోవటంతో లక్ష్మణ్, లక్ష్మణ్ ఎక్కడ ? అని ఆమె ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి అడుగుతూ ఉంటుంది. ఆమె అడుగుతున్నా సీత సహా ఎవరూ మాట్లాడలేకపోవడం చూస్తే మొత్తం మీద తర్వాత ఎపిసోడ్ కూడా ఆసక్తికరంగా సాగేలా కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది.


Click it and Unblock the Notifications











