Vadinamma Serial July 10th Episode: నాకు పెళ్లి చేసేయండన్న శిల్ప,. నానికి దయమంతి అనూహ్యమైన షాక్!

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది.. టెలివిజన్ స్టార్ ప్రభాకర్, సుజిత మెయిన్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ సీరియల్ ప్రతి ఎపిసోడ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక తాజా ఎపిసోడ్ లో ఏం జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Photos Courtesy: Star MAA and Disney+Hotstar

నిన్నటి ఎపిసోడ్ లో

నిన్నటి ఎపిసోడ్ లో

నిన్నటి ఎపిసోడ్ ప్రకారం శిల్ప నాని ఇంటికి వెళ్ళే దారిలో అడ్డుగా ఉండి మరీ తనను పెళ్లి చేసుకుంటావా లేదా అని ప్రశ్నిస్తుంది. అయితే తనకు ఆ ఉద్దేశం లేదని నువ్వు మీ వాళ్లందరినీ వదిలేసుకుని వస్తే అప్పుడు పెళ్లి చేసుకుంటానని నాని చెబుతాడు. అయితే ఇదంతా చూస్తున్న శిల్ప అన్నయ్య నానిని కొట్టించడానికి మనుషులు తీసుకువచ్చినట్లు నిన్నటి ఎపిసోడ్ లో చూపించారు.

నాని మీద ఎటాక్

నాని మీద ఎటాక్

ఇక నిన్నటి ఎపిసోడ్ లో చూపించినట్లుగా నాని దారి కాసిన శిల్ప అన్న తాను తీసుకువచ్చిన నలుగురితో బాగా కొట్టిస్తాడు.. దీంతో తీవ్ర గాయాలపాలైన నానీని అక్కడి స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాని దగ్గరకు వెళ్ళిన కుటుంబ సభ్యులు అసలు ఏమైంది అని అడుగుతారు.. అయితే శిల్ప అన్న తనను కొట్టించాడు అనే విషయం చెబితే మళ్లీ పెద్ద గొడవ జరుగుతుందని భావించి నాని తాను బండి మీద నుంచి పడి పోయాను అని అందుకే దెబ్బలు తగిలాయని చెబుతాడు.

శిల్ప అన్నకి షాక్

శిల్ప అన్నకి షాక్

ఇక నానిని కొట్టిన విషయం చాలా గర్వంగా శిల్ప అన్న తీసుకు వెళ్లి దమయంతికి చెబుతాడు.. అయితే అనూహ్యంగా ఆనందపడుతుందని భావించిన దమయంతి శిల్ప అన్న మీద కోప్పడి మొన్న కూడా అనవసరం గా వెళ్లి వాళ్ళ కాలర్ పట్టుకున్నావని ఇప్పుడు కూడా అతన్ని ఎందుకు కొట్టించావని అని ప్రశ్నిస్తుంది. వాళ్లు నిన్ను అవమానిస్తే తాను చూడలేకపోయానని అందుకే అలా చేశాను అని శిల్ప అన్న చెబుతాడు.. అయితే ఇదంతా విన్న శిల్ప, అన్నయ్య కూడా తల్లి బాటలోనే నడుస్తున్నాడు అని బాధపడుతుంది.

అందుకే చెప్పలేదు

అందుకే చెప్పలేదు


ఆసుపత్రికి వెళ్లి నానిని పరామర్శించబోతుంది.. అయితే నానిని పరామర్శిస్తున్న క్రమంలో నానితో గొడవ అవుతుంది. మీ వాళ్లు కొట్టిన సంగతి మా అన్నయ్యలకి చెప్పలేదని చెబితే అదో పెద్ద యుద్ధమే అవుతుందని నాని చెబుతాడు. అయితే ఇదంతా మాట్లాడుతున్న సమయంలో బయటే ఉన్న సీత అంతా వింటుంది. అయితే ఇక మన మధ్య ఏమీ లేదని అంతా అయిపోయిందని నాని చెబుతాడు. అదేం లేదు అని నా మనసు ఇంక నీ దగ్గరే ఉందని శిల్ప అంటుంది.

పెళ్లి చేసేయండి అమ్మా

పెళ్లి చేసేయండి అమ్మా

ఎంత బతిమిలాడినా నాని తనను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోడు ఒకవేళ చేసుకోవాలి అనుకుంటే మీ అమ్మానాన్న నన్ను వదిలేసి వచ్చేయమని కోరతాడు, అందుకు ఒప్పుకున్న శిల్ప నువ్వు కూడా మీ వాళ్ళని వదిలేసి వచ్చేస్తే తాను కూడా వచ్చేస్తాను అని అంటుంది. తనకు ఈ భూ ప్రపంచంలో దేవుడి కంటే వదినమ్మ ఎక్కువని, వదినమ్మ కుటుంబాన్ని వదిలి రాలేనని అని నాని తేల్చి చెబుతున్నారు. ఇక ఇంటికి వెళ్లి పోయిన శిల్పా నాని మాటలతో బాధ పడ్డానని ఇన్నిరోజులు ఇన్ని మిమ్మల్ని బాధ పెట్టాను అని అమ్మతో చెబుతుంది. మీకు ఇష్టం వచ్చిన వ్యక్తితో పెళ్లి చేసేయండి శిల్ప తేల్చి చెబుతోంది.

కార్డు కూడా

కార్డు కూడా

ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాత ఎపిసోడ్ లో ఇంటికి వచ్చిన నానితో వదిన శిల్ప ఇప్పటికిప్పుడు వచ్చి పెళ్లి చేసుకోవాలంటే చేసుకుంటావా అని అడుగుతుంది. ఇంతలో అక్కడికి వచ్చిన దమయంతి అనవసరమైన ఆశలు రేపిన ఈ చిన్నోడిని ఇబ్బంది పెట్టొద్దని శిల్ప పెళ్లి కుదిరింది అని చెబుతూ పెళ్లి కార్డు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. ఇక ఆ తర్వాత ఏం జరగబోతోంది అనేది తెలుసుకోవాలంటే సోమవారం వచ్చే ఎపిసోడ్ వరకు ఆగక తప్పదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X