Vadinamma July 13 Episode: దమయంతికి ఊహించని షాక్ ఇచ్చిన సీత.. అలిగిన రఘురామ్!

తెలుగులో స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ దుమ్ము దులుపుతోంది. రోజుకు ఒక ట్విస్ట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ సీరియల్లో తాజాగా ఏం జరిగింది అనేది ఈ రోజు ప్రివ్యూలో చూద్దాం.

Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

 నిన్న ఏమైందంటే

నిన్న ఏమైందంటే

ఇక నిన్న జరిగిన ఎపిసోడ్ ప్రకారం శిల్ప తన తప్పు ఒప్పుకుని తల్లితో వేరే పెళ్లి చేసుకుంటానని చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో తల్లి హ్యాపీగా ఫీల్ అవడమే కాక అప్పటికప్పుడు ఆమెకు పెళ్లి సంబంధం కుదురుస్తుంది. వెంటనే శుభలేఖ తీసుకుని ముందు రఘురాం ఇంటికి బయలు దేరుతుంది. ఇక్కడితో నిన్నటి ఎపిసోడ్ ముగియగా ఈరోజు ఎపిసోడ్ లో రఘురాం ఇంటికి చేరుకుంటుంది.

 దమయంతి ఎంట్రీ

దమయంతి ఎంట్రీ

ఇక ఈ రోజుల్లో జరిగిన ఎపిసోడ్ ప్రకారం సీత నానికి ఎలాగైనా శిల్పతోనే పెళ్లి జరుగుతుందని ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉండగా దమయంతి ఎంట్రీ ఇస్తుంది. మీ చిన్నోడిని ఊరించి మోసం చేయవద్దు అని ఎందుకంటే శిల్ప పెళ్లి కుదిరింది అని చెబుతూ శుభలేఖ చూపిస్తుంది. దీంతో నాని సహా ఇంట్లో అందరూ షాక్ అవుతారు. అయితే తానేమి బలవంతం చేయలేదని శిల్ప ఇష్ట ప్రకారమే ఈ పెళ్లి జరుగుతుందని చెబుతూ దమయంతి అందరినీ టెన్షన్ పెట్టే ప్రయత్నం చేస్తుంది

దిష్టి తీసి మరీ

దిష్టి తీసి మరీ

అంతేగాక మొదటి శుభలేఖ దేవుడి దగ్గర పెట్టిన తర్వాత రెండో శుభలేఖను తన కూతురికి దిష్టి తీసి మీకు ఇవ్వాలని వచ్చాను అని చెబుతూ సీతకు శుభలేఖ అందిస్తుంది.. అందరూ షాక్ అవుతున్న సమయంలో సీత కూడా వెనక్కి తగ్గకుండా తాము ఖచ్చితంగా ఈ పెళ్లికి వస్తాము అని చెప్పి షాక్ ఇస్తుంది. మీలాగా సంస్కారం లేని వాళ్ళము కాదని చెబుతూ ఆమెకు బొట్టు పెట్టి పెళ్లికి వస్తామని చెప్పి పంపిస్తుంది.

 అందరికీ షాక్ ఇచ్చిన సీత

అందరికీ షాక్ ఇచ్చిన సీత

అంతేకాక సీత దమయంతి బాధపడేలా కొన్ని కామెంట్స్ చేస్తుంది. అయితే సీత పెళ్ళికి వస్తామని చెప్పడం మాత్రం రఘురాం సహా కుటుంబ సభ్యులు ఎవరికీ నచ్చదు. నాని శిల్పని అంత ప్రేమిస్తుంటే సీత వదిన ఇలా చేసింది ఏమిటా అని మరుదులు, చెల్లెళ్ళు బాధపడుతూ ఉంటారు. రఘురామ్ అయితే కోపం తట్టుకోలేక అక్కడి నుంచి షాప్ కి వెళ్ళి పోతాడు. ఇక ఇదే సమయంలో అందరూ సీతను ఈ విషయం మీద నిలువరించే ప్రయత్నం చేస్తారు.

 దుర్గ సంబరం

దుర్గ సంబరం

ఎలా అయినా నానితో శిల్ప పెళ్లి చేయించాలని భావిస్తున్న తరుణంలో శిల్పకి ఇష్టం లేకపోతే పెళ్లికి ఒప్పుకోదు కదా ఇప్పుడు మనం ఏమి చేయలేము అని ఒక నిర్ణయానికి వస్తారు.. అయితే చివరికి ఏమీ తేల్చుకోలేని పొజిషన్లో నాని కూడా బాధ పడుతూ ఉంటాడు. మరోపక్క నాని ఇంట్లో జరిగిన విషయం అంతా పార్వతికి చెప్పి ఆనందపడుతుంది దుర్గ. దమయంతి కూడా మన బ్యాచే అని కాకపోతే మనలా సైలెంట్ గా ఉండే మనిషి కాదని పాము పగ పట్టినట్టు పగ పట్టిందని చెప్పి ఆనందపడుతూ ఉంటారు.

Recommended Video

MAA 2021 elections: RGV backs PrakashRaj in local non local controversy | Filmibeat Telugu
 శిల్ప ఊహించని షాక్

శిల్ప ఊహించని షాక్

ఇక తదుపరి ఎపిసోడ్ లో జరిగేది ఇదే అంటూ చూపించిన దాని ప్రకారం శిల్ప నాని కి ఫోన్ చేస్తుంది, అయితే పెళ్లి చేసుకుంటున్నాను వచ్చి చూడు అంటూ తనను ఇంకా ఏడిపించడానికి చేసిందని భావించిన నాని పెద్దపెద్దగా అరుస్తూ ఫోన్ పడేసి వెళ్ళిపోతాడు. అయితే సీత సహా మిగతా ఇద్దరు ఆడంగులు వెళ్లి ఫోన్ లో శిల్ప ఏం చెబుతుందని వినే ప్రయత్నం చేస్తారు. పెళ్లి చేసుకుని అతనితో కాపురం చేయడానికి కాదనీ పెళ్లి అయిన రెండు నిమిషాల్లోనే విషం తాగి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నానని శిల్ప చెప్పడంతో వారంతా షాక్ అవుతారు.. మరి చూడాలి తరువాతి ఎపిసోడ్ ఇంకెంత ఆసక్తికరంగా సాగనుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X