Vadinamma Serial July 14 Episode: పీటల మీద నుంచి లేపుకెళ్ళి పెళ్లి.. లేదంటే అంతే, కొత్త స్కెచ్ రెడీ !

తెలుగు సీరియల్స్ బుల్లితెర ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే తో ఆసక్తికరమైన కథాకథనాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాయి.. అలాంటి వాటిలో వదినమ్మ సీరియల్ కూడా ఒకటి. స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ తాజా ఎపిసోడ్ లో ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Photo Courtesy: Star మా and Disney+Hotstar

నిన్న ఏం జరిగింది అంటే

నిన్న ఏం జరిగింది అంటే

నిన్నటి ఎపిసోడ్ ప్రకారం దమయంతి నాని ఇంటికి వచ్చి శిల్ప పెళ్ళికి రమ్మని సీత సహా కుటుంబం అందరినీ ఆహ్వానిస్తుంది. అయితే సీత తప్పకుండా పెళ్లికి వస్తాము అని చెబుతూ అందరికీ షాక్ ఇస్తుంది. అంతేకాక ఇంటికి వచ్చిన ఆడ పడచుని ఊరికే పంపకూడదు అని చెబుతూ బొట్టు పెట్టి మళ్ళీ వెనక్కి పంపిస్తుంది.. ఇక నిన్నటి ఎపిసోడ్ లో చూపించిన దాని ప్రకారం శిల్ప నానికి ఫోన్ చేస్తూ ఉంటుంది.. అది ఈరోజు ఎపిసోడ్ లో కంటిన్యూ అయింది.

 ఏడుస్తూ

ఏడుస్తూ

శిల్ప నాని ఫోన్ కి ఫోన్ చేసి మాట్లాడాలని ప్రయత్నం చేయగా ఎన్నిసార్లు చేసినా నానీ కట్ చేస్తూ ఉంటాడు. అయినా పట్టు వదలకుండా చేస్తూండటంతో చివరికి ఫోన్ ఎత్తిన నాని తీవ్రస్థాయిలో శిల్ప మీద విరుచుకు పడతాడు. గట్టి గట్టిగా అరుస్తూ నీ పెళ్ళికి రమ్మని పిలుస్తున్నావా, ఆ పెళ్లి చూసి వెళ్ళమని నీ తల్లి పక్కన కూర్చుని ఫోన్ చేయిస్తోంది కదూ అంటూ ఫైర్ అవుతాడు. ఇకమీదట తనకు ఫోన్ చేయవద్దు అని చెబుతూ ఫోన్ పక్కన పడేసి బయటికి వెళ్లి ఏడుస్తూ ఉంటాడు.

ఫోన్ వినడంతో

ఫోన్ వినడంతో

అయితే ఇదంతా అబ్జర్వ్ చేస్తున్న సీత, శైలు, సిరి ముగ్గురు కూడా నాని పడేసిన ఫోన్ దగ్గరకు పరిగెత్తుకొని వెళ్తారు. నాని ఫోన్ ఇంకా వింటున్నాడు అనే ఉద్దేశంతో శిల్ప అసలు పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నాను అనే విషయం చెబుతుంది. తన తల్లి బలవంతం చేయలేదని తానే పెళ్ళికి సిద్ధం అయ్యానని చెబుతుంది. నీకు అంత ప్రేముంటే తన పెళ్లి జరుగుతున్న సమయంలో పీటల మీద నుంచి తనను తీసుకెళ్లి పెళ్లి చేసుకోవాలని సవాల్ విసురుతుంది.

ఫోన్ లో షాక్

ఫోన్ లో షాక్

ఒకవేళ అలా పెళ్లి చేసుకోలేని పక్షంలో పెళ్లికి రెండు నిమిషాలు ముందు విషం తాగి చచ్చిపోతానని ఇది బెదిరింపు కాదని జరగబోయే విషయం ఇదే అని చెబుతూ షాక్ ఇస్తుంది. దీంతో ఫోన్ కాల్ వింటున్న ముగ్గురికి షాక్ తగిలినట్టు అవుతుంది.. వెంటనే ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తే ఫోన్ స్విచాఫ్ చేసేస్తుంది శిల్పా.. దీంతో ఏం చేయాలో అర్థం కాక కాసేపు ఆలోచిస్తూ ఉంటుంది సీత.. అయితే ఈ విషయం అంతా నానీకి విషయం చెబితే నాని ఏదో ఒకటి చేస్తాడు అని శైలు,సిరి అభిప్రాయపడతారు. అయితే నానికి అంత ఆలోచించే శక్తి ఉంటే అసలు విషయం ఇంత దాకా వచ్చేది కాదని సీత వారిస్తుంది

అందరూ కలిసి పెళ్ళికి

అందరూ కలిసి పెళ్ళికి

అంతేకాక నానికి తెలియకుండా నానికి శిల్ప కి పెళ్లి చేయాలని ప్లాన్ చేసి విషయం రఘురాంకి కూడా చెబుతుంది.. అత్తయ్యకి కూడా చెప్పానని సిరి, శైలుకి కూడా విషయం తెలుసని నానిని పెళ్లి సమయానికి పెళ్లి మండపానికి తీసుకువెళ్తే పెళ్లి చేయడం ఖాయమని రఘురామ్ కి అభయమిస్తుంది. అయితే పెళ్లికి వెళ్లడం ఇష్టం లేక పోయినా సరే నాని శిల్పంతో డీప్ గా ప్రేమలో ఉన్నాడని తెలుసుకున్న రఘురాం కూడా సీతను సమర్ధిస్తాడు. ఇక ఫ్యామిలీ అంతా కలిసి పెళ్లికి వెళ్లడంతో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది

మళ్ళీ కొట్టుకోబోయి

మళ్ళీ కొట్టుకోబోయి


తదుపరి ఎపిసోడ్ లో చూపించిన దాని ప్రకారం అందరూ కొత్త బట్టలలో పెళ్లికి వెళ్తారు.. దమయంతి కూడా వీళ్ళందర్నీ మొదటి వరుసలో కూర్చోబెట్టడానికి ఎదురుచూస్తూ ఉంటుంది. నాని ఫ్యామిలీతో సహా దిగిన సంగతి తెలుసుకున్న దమయంతి కొడుకు అడ్డం వెళ్లి ఏం చేయడానికి వచ్చావు అంటూ నిలువరించే ప్రయత్నం చేస్తాడు. ఇంతలో భరత్ కూడా వెళ్లి అడ్డుపడడంతో ఒకరిమీద ఒకరు కాలర్లు పట్టుకొని కొట్టుకోబోతారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X