Vadinamma Serial July 15th Episode: పెళ్ళికి అంతా సిద్దం.. సీత స్కెచ్ మీద ఆసక్తి.. కాఫీ ఒలకబోసి మరీ!

తెలుగులో సినిమాలతో పాటు సీరియల్స్ కి కూడా విపరీతమైన క్రేజ్ లభిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో అందరూ లాక్ డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితం కావడంతో సీరియల్ కంటెంట్ కి కూడా విపరీతమైన క్రేజ్ లభిస్తున్నది. స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ కూడా ఆసక్తికరంగా సాగుతుంది.

Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

 చస్తానంటూ

చస్తానంటూ

నిన్నటి ఎపిసోడ్ లో జరిగిన దాని ప్రకారం శిల్ప నాని కి ఫోన్ చేసి తన పెళ్లి వేరే వాళ్ళతో జరిగితే జరగడానికి రెండు నిమిషాల ముందే తాను విషం తాగి చచ్చిపోతానని ఇది బెదిరించడానికి కాదు జరగబోయేది ఇదే అని చెప్పుకు వస్తుంది. అయితే ఇదంతా నాని వినడు ఈ విషయాన్ని విన్న శైలు, సిరి, సీత ఎలాగైనా శిల్పతో నానీ పెళ్లి చేయించాలని ఫిక్స్ అవుతారు.

శిల్పా పెళ్లి

శిల్పా పెళ్లి


ఈరోజు ఎపిసోడ్ లో శిల్ప పెళ్లి రోజు రానే వస్తుంది.. అయితే నాని ఆ విషయం తెలియక పోవడంతో ఏం చేయాలో తెలియక కూర్చుని ఉంటాడు.. ఇందులో అక్కడకు వచ్చిన సీత, సిరి, శైలు ముగ్గురు స్నానం చేసి రావాలని మనమందరం పెళ్ళికి వెళ్దామని చెబుతారు. అయితే తనకు ఈ రోజు సెలవు రోజు అని తాను ఏ పెళ్లికి రావాలని అనుకోవడం లేదని నాని తెగేసి చెబుతారు.. అంతేగాక పెద్దన్నయ్య వద్దన్నాడు కదా అని ఆయన మీద నెపం నెట్టే ప్రయత్నం చేస్తాడు.

కాఫీ ఒలకబోసి

కాఫీ ఒలకబోసి

ఇంతలో అందరికంటే ముందు ఆయనే రెడీ అయ్యాడు అని చెబుతూ రఘురామ్ ని చూపిస్తుంది సీత. నేను అక్కడికి రాలేనని, తనకు ఇష్టం లేదు మీరు వెళ్ళండని చెబుతూ లోపలికి వెళ్ళాడు. ఇంతలో తనకు కాఫీ ఇవ్వమని అడిగితే తీసుకెళ్లిన సిరి కావాలనే ఒంటి మీద ఒలకపోస్తుంది..ఇక అతన్ని తీసుకువచ్చి బయట కూర్చోబెట్టి మంగళ స్నానం చేయించే ప్రయత్నం చేస్తూ ఉంటారు.ఇక మరో పక్క శిల్ప ఇంట్లో శిల్పకి కూడా మంగళ స్నానం చేయిస్తూ ఉంటారు.

ఇద్దరికీ మంగళస్నానాలు

ఇద్దరికీ మంగళస్నానాలు

ఇక శిల్ప తండ్రి శిల్ప వద్దకు వెళ్ళి ఈ పెళ్లి నీకు ఇష్టం లేదేమో అనిపిస్తోంది అని చెబుతాడు. అయితే అలాంటిదేమీ లేదని, తనకు ఇష్టమయ్యే ఈ పెళ్లి చేసుకుంటున్నా అని శిల్ప చెబుతుంది. అలా ఒక పక్క నాని మరోపక్క శిల్ప పెళ్ళికి సిద్ధమవుతున్నారు. అయితే సీత వేసిన స్కెచ్ ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. నానికి శిల్పకి పెళ్లి చేయించాలి చేయిస్తాను అని చెబుతోంది కానీ ఏం చేసి, పెళ్లి చేయిస్తుంది అనే దానిపై క్లారిటీ గారు.

 రుబాబు

రుబాబు

ఇక తర్వాత ఎపిసోడ్ లో ఏం జరిగింది అనేది చూపించారు.. తర్వాత ఎపిసోడ్ లొ నాని కుటుంబమంతా శిల్ప పెళ్ళికి వచ్చినట్లు చూపించారు.. అలా అందరూ పెళ్లికి వెళ్లిన సమయంలో శిల్ప అన్న వీరందరినీ అవమానించడానికి ముందుకు వస్తాడు. ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటూ రుబాబు చేస్తున్నట్లుగా చూపించారు. దీంతో తర్వాత ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X