For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vadinamma Serial July 16 Episode: శిల్ప పెళ్ళికి సీత స్కెచ్.. 'జబర్దస్త్'గా పెళ్లి కొడుకు ఎంట్రీ!

  |

  తెలుగు సీరియల్స్ లో వదినమ్మ సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకుపోతోంది.. రఘురాం కుటుంబం అనేక కష్టాలు పడుతూ ఉండడం ఆ కష్టాల నుంచి మళ్ళీ ఎలా బయటకు వస్తున్నారు అనే విషయం చాలా ఆసక్తికరంగా చూపిస్తున్నారు దర్శకుడు. ఇక తాజా ఎపిసోడ్ లో ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

  Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

   నిన్నటి ఎపిసోడ్ లో

  నిన్నటి ఎపిసోడ్ లో

  ఇక నిన్నటి ఎపిసోడ్ ప్రకారం నాని అలాగే శిల్పలను వేరువేరుగా మంగళ స్నానాలతో ఇరు కుటుంబాల వారు సిద్ధం చేస్తారు. ఎలా అయినా నానీ - శిల్ప పెళ్లి చేయాలని భావిస్తున్న సీతా అండ్ కో ఆ విషయాన్ని మాత్రం నానికి చెప్పరు. దీంతో నాని ఒకరకంగా నిరాశలో మునిగిపోయి ఉంటాడు. శిల్ప కూడా తల్లి చెప్పినట్లు పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అవుతుంది గాని తాను వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవాల్సి వస్తే రెండు నిమిషాల ముందే చనిపోవడానికి విషం కూడా సిద్ధం చేసి పెట్టుకుంది.

  ఈరోజు ఏమైందంటే

  ఈరోజు ఏమైందంటే

  ఇక నేటి ఎపిసోడ్ విషయానికి వస్తే శిల్ప పెళ్లికి నానిని తీసుకు వెళ్ళడానికి సీతా అండ్ కో చాలా కష్టాలు పడుతుంటారు. నాని ఎట్టి పరిస్థితుల్లో రాను అని భీష్మించుకుని కూర్చోగా రఘురామ్ రమ్మని కోరడంతో రెడీ అవడానికి సిద్ధమవుతాడు. అయితే సంప్రదాయబద్ధమైన షేర్వాణీలో రెడీ కమ్మని చెబితే అలా కాకుండా పాంట్ షార్ట్ వేసుకుని కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. సీత వెళ్లి షేర్వానీ వేసుకోమని మనం వెళ్ళేది శిల్ప పెళ్ళికని దమయంతి నువ్వు ఏడుస్తావు అని అందని, అలా నువ్వు ఏడవకుండా ఉంటే మనం వాళ్ళని జయించినట్లే అని ధైర్యం చెబుతూ ఉంటుంది.

  పెళ్ళికి సిద్దం

  పెళ్ళికి సిద్దం

  మరోపక్క శిల్పతో శిల్ప తండ్రి మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని తనకు తెలుసని అయినా ఎందుకు ఇలా చేస్తున్నావ్ అని అడుగుతాడు. అయితే తనకు ఏం చేయాలో తెలుసని మీరు దయచేసి ఇలాంటి సలహాలు ఇచ్చి అమ్మతో తిట్లు తినొద్దు అని తేల్చి చెబుతుంది శిల్ప. సరిగ్గా అదే సమయానికి దమయంతి రావడంతో మీ నాన్న ఏం చేబుతున్నాడు అని అడుగుతుంది. అయితే ఏం చెప్పినా వినను అని చెప్పానని శిల్ప చెబుతుంది. ఇక శిల్పను చూసి మురిసిపోతున్న దమయంతి సిద్ధం కావాలని పెళ్లి మండపానికి వెళ్లాలని కోరుతుంది.

  అందరూ పెళ్లి మండపానికి

  అందరూ పెళ్లి మండపానికి

  శిల్ప తల్లిదండ్రులతో పాటు పెళ్లి మండపానికి చేరుతుంది. శిల్ప తల్లి అన్ని ఏర్పాట్లు పరిశీలిస్తూ ముందు వరుస మాత్రం నాని కుటుంబం కోసం రిజర్వ్ చేసి ఉంచాలని అంటుంది. అయితే నీ పిచ్చి గాని వాళ్ళు ఎందుకు వస్తారు అని భర్త ప్రశ్నించగా వాళ్లు కచ్చితంగా వస్తారని సీత మాట ఇచ్చింది కాబట్టి కచ్చితంగా వస్తారు అని చెబుతుంది దమయంతి. ఇలా జరుగుతున్న క్రమంలో మరో పక్క నాని కుటుంబం కూడా పెళ్లి మండపానికి బయలుదేరుతుంది. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగించారు

  Actor Gopichand Inspiring Life Story | Filmibeat Telugu
   జబర్దస్త్ ఎంట్రీ

  జబర్దస్త్ ఎంట్రీ

  ఇక తర్వాతి ఎపిసోడ్లో పెళ్లికి అంతా సిద్ధంగా ఉన్నట్లు చూపించారు. పెళ్ళికొడుకు ఎంట్రీ మాత్రం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే పెళ్లి కొడుకు ఎవరో కాదు జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయి తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన జబర్దస్త్ ముక్కు అవినాష్. అవినాష్ ఎంట్రీతో సీరియల్ మరింత ఆసక్తికరంగా సాగేలా కనిపిస్తోంది. అయితే కేవలం పెళ్లి ఎపిసోడ్స్ వరకే అవినాష్ ని కంటిన్యూ చేస్తారా లేక ముందు కూడా అవినాష్ పాత్రను పొడిగిస్తారా అనేది తెలియాల్సి ఉంది.

  English summary
  Vadinamma Episode 596: Vadinamma is a Telugu soap which airs on Star Maa and streams on Disney+Hotstar. The series premiered on 6 May 2019. It stars Prabhakar, Sujitha, Rajesh Dutta, Maheshwari, Raj and Priyanka. In the latest episode Dhamayanthi speeds up Shilpa's wedding arrangements. On the other hand, Siri, Sita and Shailu make plans to get Shilpa and Nani married.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X