Vadinamma Today July 17 Episode: పెళ్ళిలో కలకలం.. బురఖాలో అమ్మాయి ఎవరు? అవినాష్ ఎంట్రీతో ఆసక్తి!
తెలుగు సీరియల్స్ లో టాప్ ఫైవ్ లో ఒకటిగా దూసుకువెళుతోంది స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్.. టెలివిజన్ స్టార్ ప్రభాకర్, సుజిత లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ సీరియల్ లో ప్రతి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగే లాగా చేస్తున్నాడు దర్శకుడు. రఘురాం కుటుంబం అనేక ఇబ్బందులు పడుతూ ఉంటుంది. ఆ ఇబ్బందులను ఎలా ఎదుర్కొంటున్నారు అనే అంశం మీద ఆసక్తికరంగా చూపిస్తాడు దర్శకుడు. నేటి ఎపిసోడ్ లో ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Photos Courtesy: Star MAA and Disney+Hotstar

విషం తాగాలని
ఇక నిన్నటి ఎపిసోడ్ లో చూపించిన దాని ప్రకారం ఒక పక్క నాని మరోపక్క శిల్ప ఇద్దరినీ పెళ్ళికి సిద్ధం చేస్తూ ఉంటారు ఇరు కుటుంబాల వారు.. నానికి గాని శిల్పకు గాని తామిద్దరం పెళ్లిచేసుకోబోతున్నాం అనే విషయం తెలియదు. శిల్ప వేరే ఎవరినో పెళ్లి చేసుకోబోతోంది అని నాని భావిస్తూ ఉంటాడు. శిల్ప కూడా తను వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నా అని పెళ్లికి సరిగ్గా రెండు నిమిషాలకు విషం తాగాలని ఫిక్స్ అవుతుంది.

దమయంతి కొడుకు అవమానం
ఇక నేటి ఎపిసోడ్ ప్రారంభంలో నాని కుటుంబమంతా పెళ్లి మండపానికి చేరుకుంటుంది.. అయితే అందరూ కారు దిగి లోపలికి వెళ్లడానికి ప్రయత్నించినా నాని మాత్రం కారు దిగి లోపలికి రానని చెబుతాడు. అయితే కాసేపు ఉడికించిన తర్వాత నానీని కూడా లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు కుటుంబ సభ్యులు.
నానిని దించి లోపలికి వెళ్లడానికి బయలుదేరుతుండగా అసలు రఘురామ్ కుటుంబాన్ని పిలిచారు అనే విషయం తెలియని దమయంతి కొడుకు వచ్చి మొత్తం కుటుంబాన్ని అవమానించే ప్రయత్నం చేస్తాడు. తిండి కోసం వచ్చారా అంటూ అవమానిస్తూ ఉండగా దమయంతి ఎంట్రీ ఇస్తుంది.

సీత అండ్ కో ఎంట్రీ
అయితే ఇలా అవమానిస్తే మేము లోపలికి రామని రఘురాం దమయంతి వాళ్ళు చెబుతుండగా వాళ్ళు పనికి రాకపోతే తాను అవమానించడం ఎలా అని భావించిన దమయంతి కొడుకు చేత క్షమాపణలు చెప్పిస్తుంది. అలా రఘురామ్ కుటుంబం అంతా పెళ్లి మండపానికి చేరుకుంటుంది. అయితే వీళ్ళందరూ దమయంతితో మాట్లాడుతున్న సమయంలో శిల్పని పెళ్లికూతురిని చేయడానికి వస్తున్న బ్యూటీషియన్ బృందం యాక్సిడెంట్ అయిందని వాళ్ళు ఇప్పుడు రాలేమని చెప్పారని దమయంతి పెద్ద కూతురు చెబుతుంది. దీంతో శిల్పని సీతా అండ్ కో రెడీ చేస్తారని దమయంతి చెబుతుంది. ఎలాగో శిల్పతో మాట్లాడే అవకాశం దొరికింది అని భావిస్తూ సీత తన ఇద్దరు తోడికోడళ్ళతో లోపలికి వెళ్ళింది.

అప్పుడే అనుమానం
లోపలికి వెళ్లి శిల్పతో మాట్లాడుతూ నాని కూడా ఇక్కడికి వచ్చాడని చెబుతరు. అంటే ఇక్కడ నుంచి తీసుకు వెళ్ళడం లేదా అని ఆలోచిస్తున్న క్రమంలో శిల్ప అక్క, దమయంతి కూడా ఎంట్రీ ఇచ్చి త్వరగా పని మొదలు పెట్టాలని తొందర పెడుతోంది. ఇదంతా జరుగుతున్న సమయంలో దమయంతి కొడుకు శిల్పని వాళ్ళకి అప్పగించడం కరెక్ట్ కాదని వాళ్ళు ఏదో ప్లాన్ తోనే వచ్చారు అని హెచ్చరిస్తాడు. తనకు అంతా తెలుసు అని దమయంతిని ఎవరు మోసం చేయలేరు అని చెబుతుంది.

బురఖాలో ఎవరు
అయితే ఇదంతా జరుగుతున్న క్రమంలో పెళ్లి కొడుకు గా ఎంట్రీ ఇస్తాడు జబర్దస్త్ అవినాష్. జబర్దస్త్ అవినాష్ క్రేజ్ వాడుకుంటూ కాసేపు కామెడీ పండించే ప్రయత్నం చేశారు.. ఇక తర్వాత ఎపిసోడ్ ప్రకారం సీత ఒక అమ్మాయిని బురఖా వేయించి బయటికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నట్టు చూపించారు. ఇదంతా జరుగుతున్న క్రమంలో దమయంతి కొడుకు ఆమె తన చెల్లెలు అని ఆ బురఖా తొలగించి చూసే ప్రయత్నం చేస్తాడు. అయితే ఆ అమ్మాయి శిల్పనా లేక ఇంకెవరైనా అనేది తర్వాతి ఎపిసోడ్ లో మాత్రమే తెలుస్తుంది.


Click it and Unblock the Notifications











