Vadinamma Serial July 19 Episode: పెళ్ళిలో సందడి మిస్సింగ్.. సీత స్కెచ్ మామూలుగా లేదుగా!

తెలుగులో టాప్ ఫైవ్ సీరియల్స్ లో ఒకటిగా కొనసాగుతోంది స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్. ప్రతి ఎపిసోడ్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉండేలాగా దర్శకుడు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సీరియల్ లో శిల్ప పెళ్లి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇక నేటి ఎపిసోడ్ లో ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

Photos Courtesy: Star MAA and Disney+Hotstar

నిన్న ఏమైందంటే

నిన్న ఏమైందంటే


శిల్ప పెళ్లి వేరే వ్యక్తితో నిర్ణయిస్తుంది దమయంతి. జబర్దస్త్ అవినాష్ సిద్ధూ అనే పేరుతో ఎంట్రీ ఇచ్చాడు. అతనితోనే శిల్ప పెళ్లి జరగాల్సి ఉంది. సిద్ధూ తన తల్లిదండ్రులతో కలిసి పెళ్లి మండపానికి చేరుకుంటాడు. అతని పాత్ర ఇంట్రడక్షన్ లోని కాస్త తేడా అని అందరూ ఏది చెబితే దానికి కాస్త వ్యతిరేకంగా చేసే వ్యక్తి అని చూపించారు దర్శకుడు. ఈ మేరకు నిన్నటి ఎపిసోడ్ లో చూపించారు. నేటి ఎపిసోడ్ లో ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

సిద్దూ ఎంట్రీ

సిద్దూ ఎంట్రీ


సిద్ధుని రిసీవ్ చేసుకోవడానికి ఆడపెళ్ళి వారి తరపున ఎవరూ లేకపోవడంతో రఘురాం, భరత్, లక్ష్మణ్ ముగ్గురు వెళ్లి సిద్ధుని రిసీవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అక్కడ కాసేపు కామెడీ నడుస్తూ ఉంటుంది. అసలు వీళ్లంతా ఎవరు ? తనని రిసీవ్ చేసుకోవడానికి ఎందుకు వచ్చారు ? అని సిద్దు అనుమాన పడతాడు. సిద్దు తండ్రి మాత్రం వీళ్ళందరూ చూస్తే చాలా పద్ధతిగా కనిపిస్తున్నారని బహుశా ఆడ పెళ్ళి వారు అయి ఉంటారు అని చెప్పడంతో చివరికి మండపంలోకి అడుగుపెడతాడు.

తోటి పెళ్లి కొడుకు మిస్సింగ్

తోటి పెళ్లి కొడుకు మిస్సింగ్


మండపంలోకి అడుగు పెట్టీ పెట్టగానే శిల్ప తండ్రి వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి రాలేకపోయాను క్షమించాలని మీ వాళ్ళు వచ్చి రిసీవ్ చేసుకున్నారు అని చెబుతూ చూపిస్తారు. అలా సిద్ధం తీసుకెళ్లి పెళ్ళికొడుకు గదిలో కూర్చోబెట్టి భరత్, లక్ష్మణ్, రఘురామ్ ముగ్గురు కాసేపు కంపెనీ ఇస్తారు. ఆ తర్వాత రెడీ అవమని చెబుతూ బయటకు వెళ్లారు.. అయితే సిద్దు తోడు పెళ్లి కొడుకుగా తీసుకువచ్చిన బుడ్డోడు మిస్ అవుతాడు. ఊరు చూడడానికి వెళ్తాను అంటే నేనే వెళ్ళమని చెప్పానని సిద్దు చెబుతాడు.

నాని తోటిపెళ్లి కొడుకుగా

నాని తోటిపెళ్లి కొడుకుగా


అయితే బయట కూర్చున్న నానిని తోడు పెళ్లి కొడుకుగా రమ్మని కోరతాడు సిద్ధూ. అయితే అసలుకే కోపం మీద ఉన్న నాని ఇదంతా తనకు వర్కవుట్ కాదని భావించి నేను చేయలేను అని చెబుతాడు. కానీ ఇతర కుటుంబ సభ్యులు బలవంతం మీద నాని తోడు పెళ్లి కొడుకుగా సిద్ధమవుతాడు. అయితే ఇదంతా చూస్తున్న దమయంతి పెద్ద అల్లుడికి నిజంగానే అనుమానం వస్తుంది. నిజంగా జరగబోతోంది సిద్దు శిల్పల పెళ్లి ఏనా ? అని అనుమానం వచ్చి రఘురామ్ కుటుంబాన్ని అడుగుతాడు. వాళ్లు కూడా కాసేపు ఆట పట్టించి అదేనని అభయం ఇస్తారు.

వెయిటర్ ఏమో

వెయిటర్ ఏమో


అయితే దమయంతి పెద్ద అల్లుడిని చూసి వెయిటర్ అని భావిస్తాడు సిద్ధు. కానీ తమ పెద్దల్లుడు అని శిల్ప తండ్రి చెప్పడంతో అతనిని మళ్ళీ మళ్ళీ లోపలికి రానివ్వద్దు అని అతనిని చూస్తే తన ఫ్యూచర్ తనకు కనిపిస్తోందని అంటాడు. అయితే సిద్దు తింగరి పనులను చూసిన సిద్దు తల్లిదండ్రులు దమయంతి కనపడకుండా ఉంటేనే నయం అని ఆమెకు సిద్ధు తింగరి పనులు కనపడితే ఏం చేస్తుందో తెలియదు అని భావిస్తూ ఉంటారు. అలా పెళ్లికి సిద్ధమవుతుండగా నేటి ఎపిసోడ్ ముగించారు.

బురఖాలో ఎవరు

బురఖాలో ఎవరు


తర్వాత ఎపిసోడ్ లో ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే తర్వాత ఎపిసోడ్ లో బురఖా వేసిన ఒక అమ్మాయిని శిల్పా తన తోడి కోడళ్ళతో కలిసి బయటకు తీసుకు వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. బురఖా వేసుకున్న అమ్మాయి తనకు చెల్లెలు అని దమయంతి కొడుకు కిషోర్ భావిస్తాడు. ఆమె బురఖా తొలగించి చూడబోతే సీత వారిస్తుంది. అయినా సరే బురఖా తొలగించి చూసినట్లుగా చూపించారు. కానీ బురఖాలో ఉన్న అమ్మాయి ఎవరు అనే దాని మీద మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇక తర్వాత ఎపిసోడ్ లొ దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X