Vadinamma Serial July 1st Episode: నానికి అనుకోని షాక్.. సిరి కుమార్తెకు ఇన్ఫెక్షన్!

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ఆల్ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతోంది. తెలుగులో టాప్ ఫైవ్ సీరియల్స్ లో ఒకటిగా కొనసాగుతున్న ఈ సీరియల్ లో ప్రభాకర్, సుజిత లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.. రఘురాం కుటుంబానికి ఒక ఇబ్బంది తప్పింది అనుకుంటున్న తరుణంలో మరో ఇబ్బంది తెరమీదకు వస్తోంది.. తాజా ఎపిసోడ్ లో ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

 తేల్చేసిన శైలు

తేల్చేసిన శైలు

లక్ష్మణ్ మిల్లు లో పని చేస్తున్న సంగతి శైలు తెలుసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఇంటికి వచ్చాక పెద్ద రచ్చ చేస్తుంది. ఉద్యోగం మానేస్తాను అంటే తప్ప తాను క్షమించు అని తేల్చి చెబుతోంది. అయితే కుటుంబ పరిస్థితి కొంత కుదుటపడ్డాక తన ఉద్యోగం మానేస్తానని లక్ష్మణ్ చెబుతాడు. ఇక ఈ విషయాన్ని తలుచుకుని సీతా రఘురాం ఇద్దరూ బాధపడతారు. వాడు చేసింది తనకు కూడా నచ్చలేదని రఘురాం చెబుతాడు. అయితే సీత లక్ష్మణ్ చేసింది కరెక్ట్ అని, నువ్వే తప్పుగా ఆలోచిస్తున్నావని రఘు రామ్ కి నచ్చ చెప్తుంది.

 ఏడుస్తూనే ఉన్న సిరి కుమార్తె

ఏడుస్తూనే ఉన్న సిరి కుమార్తె

అయితే సిరి కుమార్తె ఏడవడం మొదలు పెడుతుంది, ఎంతకూ ఏడుపు ఆపక పోవడంతో కుటుంబం అంతా అక్కడికి చేరతారు. ఆమెకు ఏమైంది అని అడగగా రెండు రోజుల నుంచి జ్వరం గా ఉందని డాక్టర్లు గతంలో ఇచ్చిన మందులు వాడుతున్నామని భరత్ చెబుతాడు. రెండు రోజుల నుంచి జ్వరంగా ఉంటే పాత మందులు ఎలా వాడుతున్నావు, ఆ మాత్రం జ్ఞానం లేదా అంటూ రఘురాం ఫైర్ అవుతాడు. అయితే ఇప్పుడు హాస్పిటల్ కి తీసుకు వెళ్లాలంటే డబ్బు కావాలి కదా ఆ డబ్బు లేదని చెప్పి చెప్పలేదని భరత్ అంటాడు.

 అందరూ ఆసుపత్రికి

అందరూ ఆసుపత్రికి

బాధ పడిన రఘురామ్ ఇప్పుడైతే హాస్పిటల్ కి వెళ్లాలి కదా అని అనుకుంటున్న తరుణంలో ఎవరి దగ్గర డబ్బులు కనపడవు. నా దగ్గర 500 ఉన్నాయని చెబుతూ లక్ష్మణ్ ఇవ్వబోతాడు, ఆ 500 సరిపోవు అని రఘురామ్ చెబుతాడు. ఇందులో సీత తన దగ్గర డబ్బులు ఉన్నాయి అని చెబుతుంది. నీ దగ్గర డబ్బులు ఎక్కడివి అంటే మొన్న మా అన్నయ్య ఇచ్చిన డబ్బులు ఉన్నాయి కదా అని గుర్తు చేస్తుంది. దీంతో ఆ పది వేలు తీసుకుని అప్పటికప్పుడు హాస్పిటల్ కి బయలుదేరి వెళ్తారు.

 పాపకు ఇన్ఫెక్షన్'

పాపకు ఇన్ఫెక్షన్'

హాస్పిటల్ కి వెళ్ళిన తర్వాత పాపను డాక్టర్ కి చూపించగా పాప శరీరంలో ఇన్ఫెక్షన్ పెరుగుతోందని ట్రీట్మెంట్ మొదలు పెట్టాలంటే పాతిక వేలు డబ్బులు కట్టాలి అని చెబుతారు. 10,000 కడితే ట్రీట్మెంట్ మొదలు పెడతామని చెప్పి తర్వాత మీద డబ్బులు కూడా కట్టక పోతే వెంటనే డిశ్చార్జి చేస్తామని బెదిరిస్తారు. దీంతో రఘురాం వీలైనన్ని చోట్ల డబ్బు కోసం ప్రయత్నిస్తాడు కానీ ఎక్కడా డబ్బు పుట్టలేదు.

 సిరి తల్లి డబ్బు సాయం

సిరి తల్లి డబ్బు సాయం

ఇంతలో సిరి తన తల్లికి ఫోన్ చేసి విషయం చెప్పగా తాను డబ్బు తీసుకు వస్తానని, ఎక్కడో చోట అప్పు చేసి అయినా డబ్బు తెస్తానని చెబుతుంది భర్తకు ఆయన ఇచ్చిన పాతిక వేలు కూతురికి ఇవ్వలేదని ఆ డబ్బులు ఇప్పుడు ఉపయోగపడుతున్నాయని చెబుతూ డబ్బు తీసుకువెళుతుంది. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. కానీ డాక్టర్ రఘురాంని పిలిచి ఏదో సమస్య ఉందని చెప్పినట్టు గత ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపించినట్లుగా ఈ ఎపిసోడ్ లో ఏమి చూపించలేదు.

 నానికి అనుకోని షాక్

నానికి అనుకోని షాక్

ఇక ఈ రోజు కమింగ్ అప్ లో చూపించిన దాని ప్రకారం నాని ప్రేయసి శిల్ప తల్లిదండ్రులు సంబంధం అడగడానికి రఘురామ్ ఇంటికి వస్తారు.. అయితే రఘురాం కుటుంబం పరిస్థితి తెలుసుకుని వాళ్లంతా అదోరకంగా మాట్లాడుతుంటారు. అసలు వాళ్ళు ఎవరో అర్ధం కాక ఎవరు మీరు అంతా అని ప్రశ్నిస్తే అప్పుడు తన కూతురు నానిని ప్రేమించిందని చెప్పుకొస్తుంది శిల్ప తల్లి. దీంతో తర్వాత ఎపిసోడ్ కూడా ఆసక్తికరంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X