Vadinamma Serial July 20 Episode: శిల్పకి సిద్ధూ షాక్.. పగిలిన కిషోర్ చెంప.. ఊహించని ట్విస్టులు!

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది. ఈ సీరియల్ లో ప్రభాకర్, సుజిత లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ప్రతీ ఎపిసోడ్ లో ఏదో ఒక ఆసక్తికరమైన ఎలిమెంట్ ఉండేలాగా చూస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇక తాజా ఎపిసోడ్ లో ఏం జరిగింది అనే విషయం పరిశీలిద్దాం.

Photos Courtesy: Star MAA and Disney+Hotstar

 నిన్నటి ఎపిసోడ్ లో

నిన్నటి ఎపిసోడ్ లో

నిన్నటి ఎపిసోడ్ లో నాని, శిల్ప ఇద్దరూ పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉన్నట్టు చూపించారు. ఎవరికి వారు కలవకుండా ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. మరోపక్క పెళ్లి మంటపంలో సిద్ధూ కామెడీ, అంతా హైలైట్ గా నిలుస్తుంది. ఇక నిన్న ఎవరో బురఖా వేసుకున్న అమ్మాయి ముఖాన్ని చూసేందుకు కిషోర్ తెగిస్తాడు, అక్కడితో ఎపిసోడ్ కి బ్రేకులు పడ్డాయి. ఇక ఈరోజు ఎపిసోడ్ ప్రకారం ఏం అయింది అంటే.

టెన్షన్ లో కిషోర్

టెన్షన్ లో కిషోర్


పెళ్లి మంటపంలో కిషోర్ అణువణువూ గాలిస్తూ ఉంటాడు. ఇంతలో సీత అండ్ కో శిల్ప గది నుంచి ఒక బురఖా వేసుకున్న అమ్మాయిని తీసుకు వెళ్ళడం చూసి అది శిల్ప అని ఫిక్స్ అవుతాడు. సీత తాము వెళ్లాలి తప్పుకోమంటే తప్పుకోడు. ఇంతలో దమయంతి కూడా ఎంట్రీ ఇస్తుంది. వీళ్ళు శిల్పని తీసుకు పోతున్నారు అంటూ హడావుడి చేసి ఎంత చెబుతున్నా వినకుండా ఆమె బురఖా తీస్తాడు. దీంతో అందులో ఉన్న ముస్లిం మహిళ కిషోర్ చంప పగలగొడుతుంది.

కిషోర్ కి ఎదురు దెబ్బ

కిషోర్ కి ఎదురు దెబ్బ


ఒక రకంగా కిషోర్ అనుమానం తీరినా సరే ఇంకా తన చెల్లిని రఘురాం అండ్ కో తీసుకు వెళ్ళిపోతారు ఏమో అని భయం వెంటాడుతూ ఉంటుంది. అందుకే తల్లిని, బావని తీసుకుని శిల్పను పెళ్లికూతురిని చేస్తున్న గదిలోకి వెళ్తాడు. వెళ్లి అక్కడ శిల్పా అక్క తో ఉండగా దమయంతి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని నువ్వు చేస్తున్న పనులు చూసుకుంటే చిరాకు వేస్తోందని హెచ్చరిస్తుంది. ఇలా అందరూ తిట్టడంతో కిషోర్ కూడా కాస్త సైలెంట్ అయినట్లే కనిపిస్తాడు..

శిల్పకి సిద్ధూ ఊహించని షాక్

శిల్పకి సిద్ధూ ఊహించని షాక్


ఇక మరో పక్కన సిద్ధూ తాను పెళ్లి కూతురుతో మాట్లాడతానని పెళ్లి కుదిరాక ఫోటోలు చూడడమే తప్ప నేరుగా కలిసి మాట్లాడలేదు అని చెబుతూ తోటి పెళ్లి కొడుకుగా తోడు తీసుకుని వెళతాడు. ముందు రానని మొండికేసిన నాని చివరికి సిద్దు తల్లిదండ్రుల బలవంతంతో వెళ్లాల్సి వస్తుంది.

అక్కడికి వెళ్లాక పెళ్లి మనిద్దరికీ కాదని నానికి నీకు అంటూ షాక్ ఇస్తాడు. అయితే నాని శిల్ప ఇద్దరూ షాక్ అయిపోతున్న క్రమంలో ఇదంతా ప్రాంక్ అని చెప్పి మరో షాక్ ఇస్తాడు. ఇక మరోపక్క పెళ్లికి సమయం అవుతోంది పెళ్ళికొడుకుని తీసుకురమ్మని పూజారి చెబితే పెళ్లి కొడుకు ఎక్కడ ఉన్నాడో తెలియదు అని తల్లిదండ్రులు అంటారు.

పెళ్లి కొడుకు మిస్సింగ్

పెళ్లి కొడుకు మిస్సింగ్


రఘురామ్ తన ఇద్దరు తమ్ముళ్ళను పంపి ఎక్కడ ఉన్నా తీసుకురమ్మని పురమాయిస్తాడు. వాళ్ళిద్దరూ వచ్చేటప్పటికి శిల్పా సిద్దు ఒకే చోట ఉండటం గమనిస్తారు. ఇక పెళ్లి కొడుకు కోసం చూస్తున్నారు అనే విషయం చెప్పి సిద్ధుని నానిని తీసుకుని వెళ్లి పోతారు. కాసేపటికి శిల్ప కూడా తీసుకువచ్చి మండపంలో కూర్చోబెట్టినట్లుగా చూపిస్తారు. ఒక పక్క రఘురాం కుటుంబ సభ్యులు మరోపక్క దమయంతి కుటుంబ సభ్యులతో పాటు మగపెళ్లి వారు కూడా నుంచుని చూస్తూ ఉంటారు ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగించారు.

నట్టింట చిచ్చు

నట్టింట చిచ్చు


ఇక తర్వాతి ఎపిసోడ్లో జరగబోయేది కూడా చూపించారు. శిల్ప తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని ఆన్లైన్ లో కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు సడన్ ఎంట్రీ ఇస్తారు. తర్వాత శిల్పా నాని పెళ్లి జరిగినట్లుగా కూడా చూపించారు. సీత కుటుంబ సభ్యులందరూ ఆనందంలో మునిగితేలుతున్న క్రమంలో శిల్ప అనుకోని షాక్ ఇస్తుంది తనకు నానిని పెళ్లి చేసుకోవడం ఇష్టమే కానీ నాని వదినమ్మ విషయంలో తనకు చాలా కోపం ఉందని వాళ్ళ నట్టింట్లో అడుగుపెట్టి చిచ్చు పెడతాను అని తల్లికి మాట ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X