For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vadinamma 600 Episode: పెళ్ళిలో మరో టెన్షన్..పోలీసుల ఎంట్రీ, ఆ కంప్లైంట్ తెరమీదకు!

  |

  స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది. ఈ సీరియల్ లో ప్రభాకర్, సుజిత లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ప్రతీ ఎపిసోడ్ లో ఏదో ఒక ఆసక్తికరమైన ఎలిమెంట్ ఉండేలా, జనాన్ని ఆకట్టుకునేలా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇక తాజా ఎపిసోడ్ లో ఏం జరిగింది అనే విషయం పరిశీలిస్తే

  Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

   నిన్నటి ఎపిసోడ్ లో

  నిన్నటి ఎపిసోడ్ లో

  నిన్నటి ఎపిసోడ్ లో నాని,శిల్పల పెళ్లి గురించి ఎక్కువగా ఫోకస్ చేశారు. ఎవరికి వారు ముందు నువ్వు మాట్లాడచ్చు కదా అంటే నువ్వు మాట్లాడచ్చు కదా అన్నట్టు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇక పెళ్లి మంటపంలో సిద్ధూ తింగరి చేష్టలు హైలైట్ గా నిలుస్తూ ఉంటాయి.నిన్నఎవరో బురఖా వేసుకున్న అమ్మాయి ముఖాన్ని చూసేందుకు కిషోర్ తెగించి చూడగా చెంప దెబ్బలు తింటాడు. ఇక ఈ రోజు ఎపిసోడ్ ప్రకారం ఏం అయింది అనేది చూద్దాం.

  ఇదేం గోలరా నాయనా

  ఇదేం గోలరా నాయనా

  ఇలా చేయడం సరికాదు తోటి పెళ్లి కొడుకుని పక్కన కూర్చో పెట్టుకోవడం శాస్త్రం కాదని చెబితే అవసరమైతే పెళ్లి మానేసి ఇద్దరం వెళ్ళిపోతామని మీ ఇష్టం వచ్చిన వారితో తాళి కట్టించుకోండి అని బెదిరిస్తాడు. ఇదంతా చూస్తున్న దమయంతి అలాగే కిషోర్ తదితరులకు మంట మండిపోతూ ఉంటుంది. ఇదేం పరిస్థితి రా నాయనా అంటూ బాధపడుతూ ఉంటారు. అయితే ఈ దీన్ని రఘురాం కుటుంబం అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇక ఈ తింగరి పనులను చూసి పెళ్లికి వచ్చిన వాళ్లు కూడా రకరకాలుగా గుసగుసలాడుకుంటున్నారు.

  Vadinamma Serial July 20 Episode: శిల్పకి సిద్ధూ షాక్.. పగిలిన కిషోర్ చెంప.. ఊహించని ట్విస్టులు!

   ఇదీ మన మంచికే

  ఇదీ మన మంచికే

  ఇక పెళ్లికూతురు తీసుకురమ్మని చెబితే ఇది కూడా మీ బాధ్యతే అని మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా అని దమయంతి సీత అండ్ కోను ప్రశ్నిస్తుంది. అయితే ఇది కూడా తమ మంచికే అని భావించిన సీతా అలాగే తోడికోడలు ఇద్దరూ దగ్గరికి వెళ్లి తీసుకురావడానికి వెళ్తారు. అక్కడికి వచ్చిన శిల్ప మీరు ఎందుకు నా పెళ్లి మీద ఎంతో శ్రద్ధ చూపిస్తున్నారు అని ప్రశ్నిస్తుంది. అయితే నువ్వు కూడా మా దానివి అని భావిస్తున్నామని అందుకే ఇంత శ్రద్ధ చూపిస్తున్నారని వాళ్ళు చెబుతారు. ఇంతలో శిల్ప సోదరి కూడా రావడంతో అందరూ కలిసి ఆమెను పెళ్ళి మండపానికి తీసుకువస్తారు.

   సిద్ధూ చెవిలో

  సిద్ధూ చెవిలో

  అయితే కిషోర్ టెన్షన్ పడుతూనే ఉంటాడు. ఇక శిల్ప వచ్చి మండపం మీద కూర్చున్న తర్వాత భరత్ వచ్చి సిద్ధూ చెవిలో ఏదో చెబుతాడు. వెరైటీగా చేస్తేనే మనకు గుర్తింపు ఉంటుందని ఇలా చేయమని చెప్పడంతో అలా ఖచ్చితంగా చేస్తానని మాట ఇస్తాడు సిద్దు. దీంతో దమయంతి వాళ్ళ కుటుంబం అంత టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మధ్య త్వరగా తెర ఎందుకు పెట్టారని సిద్దు ప్రశ్నిస్తాడు. ఇదే సంప్రదాయం అని చెప్పడంతో ఆ తర్వాత కూడా ఆటలాడుతూ ఉంటాడు.

  Vadinamma Serial July 19 Episode: పెళ్ళిలో సందడి మిస్సింగ్.. సీత స్కెచ్ మామూలుగా లేదుగా!

  నాని కాళ్ళు కడిగించి

  నాని కాళ్ళు కడిగించి

  అనూహ్యంగా తన కాళ్ళు పెట్టాల్సిన చోట నాని కాళ్ళు పెట్టించి కడిగించి వెరైటీగా చేశానని ఆనంద పడుతూ ఉంటాడు సిద్ధూ అలా తాము నాని కాళ్ళు కడిగామని అని తెలుసుకుని దమయంతి, ఆమె భర్త ఇద్దరూ షాక్ అవుతారు. ఇలా ఎందుకు చేసావు అని సిద్దుని నిందిస్తారు. ఇక మరో పక్క పెళ్ళి తంతు మళ్లీ మొదలవుతుంది. నానిని తీసుకువెళ్లి శిల్ప-సిద్ధూలకు ఎదురుగుండా కూర్చో పెడతారు. ఇక సిద్ధూ శిల్ప ఒకరి ముఖం ఒకరు చూసుకుని బాధపడుతూ ఉంటారు.

  పోలీసులు ఎంట్రీ

  పోలీసులు ఎంట్రీ

  అంతా అయిపోయింది పెళ్లి చేయడమే తరువాయి అని భావిస్తున్న క్రమంలో పోలీసులు ఎంట్రీ ఇస్తారు. ఇక్కడ శిల్ప అనే అమ్మాయి తమకు ఆన్లైన్ ద్వారా కంప్లైంట్ ఇచ్చిందని ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని కంప్లైంట్ ఇవ్వడంతో తాము వచ్చామని చెబుతారు. అలా ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. కమింగ్ అప్ లో నిన్న చూపించారు కానీ ఈ రోజు మాత్రం శిల్పా నాని పెళ్లి జరిగినట్లు చూపించలేదు కానీ నాని పెళ్లి చేసుకుని ఇంటికి వస్తున్నట్టుగా చూపించారు. అలా చూపించి సీత హారతి ఇస్తూ ఉండగానే నీ శత్రువుకి నువ్వే హారతి ఇచ్చి ఇంట్లోకి పిలుస్తున్నారు అంటూ మనసులో అనుకోవడం కనిపిస్తోంది. దీంతో రేపటి ఎపిసోడ్ ఆసక్తికరంగా ఉండేలానే అనిపిస్తుంది.

  English summary
  Vadinamma Episode 600: Vadinamma is a Telugu soap which airs on Star Maa and streams on Disney+Hotstar. The series premiered on 6 May 2019. It stars Prabhakar, Sujitha, Rajesh Dutta, Maheshwari, Raj and Priyanka. In the latest episode Kishore gets suspicious of Raghuram's family. Later, things take an ugly turn when the police arrive at Shilpa's wedding.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X