Don't Miss!
- News Sujana Chowdary: ఎన్నికల వేళ సుజనా చౌదరికి షాక్..! రూ.500 కోట్ల రుణంపై...
- Finance Blood Bath: వారాంతంలో కుప్పకూలిన మార్కెట్లు.. బేర్స్ చేతిలో Sensex-Nifty..
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్‌క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
Vadinamma Serial July 22 Episode:ట్విస్టుల మధ్య నాని-శిల్ప పెళ్లి.. రఘురామ్ ఫ్యామిలీకి పెను ఉపద్రవం!
స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది. ఈ సీరియల్ లో ప్రభాకర్, సుజిత లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. రఘురామ్ కుటుంబానికి ఏదో ఒక అవాంతరం రావడం దానిని వారు ఎలా ఎదుర్కొంటున్నారు అనే దానిని ఆసక్తికరంగా చూపిస్తున్నారు. తాజా ఎపిసోడ్ లో ఏం జరిగింది అనే విషయం పరిశీలిస్తే..
Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్
నిన్నటి ఎపిసోడ్ లో
నిన్నటి ఎపిసోడ్ లో నాని,శిల్పల పెళ్లి తంతు నడుస్తూ ఉంటుంది. గెస్ట్ ఎంట్రీ ఇచ్చిన జబర్దస్త్ అవినాష్ పెళ్లి కొడుకు అవతారం ఎత్తగా పెళ్లి మంటపంలో సిద్ధూగా తింగరి చేష్టలు హైలైట్ గా నిలిచాడు. ఇక పెళ్లిలో తాళి కట్టడమే ఆలస్యం అనుకుంటూ ఉండగా పోలీసుల ఎంట్రీతో పెళ్లి నిలుస్తుంది. దీంతో అసలు ఈ రోజు ఎపిసోడ్ ప్రకారం ఏం అయింది అనేది చూద్దాం. శిల్ప పెళ్లి ఆపేందుకు శిల్ప కంప్లైంట్ అందుకున్న పోలీసులు మండపానికి చేరుకుంటారు. అయితే ఎవరి పెళ్లి ఆపడానికి వచ్చారో తెలుసా అంటూ పోలీసుల మీద విరుచుకు పడుతుంది దమయంతి. అయితే మీరు ఎంత పెద్దవారైనా సరే తమకు వచ్చిన కంప్లైంట్ ప్రకారం తమ డ్యూటీ తమని చేయనివ్వండి అంటూ పోలీసులు తేల్చి చెబుతారు. కంప్లైంట్ ఇచ్చినది శిల్పనా కాదా అని పోలీసులు అడుగుతారు.
నాని ఇచ్చాడా?
అయితే శిల్ప స్వయంగా కంప్లైంట్ ఇవ్వలేదు కాబట్టి నాని ఇచ్చాడు అని భావిస్తూ ఉంటుంది. నాని ఏమో శిల్ప తనను వదులుకోలేక ఇలా కంప్లైంట్ ఇచ్చిందేమోనని భావిస్తూ ఉంటాడు. ఇదంతా ఎలా జరుగుతున్న క్రమంలో ఎట్టకేలకు శిల్పా కంప్లైంట్ ఇచ్చాను అని ఒప్పుకుంటుంది. దీంతో తల్లి నువ్వు కంప్లైంట్ ఇవ్వలేదు కదా నీకు ఇది ఇష్టంగానే జరుగుతోంది కదా నిన్ను ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేశారు ? ఎవరు నీ చేత ఇలాంటి మాటలు మాట్లాడించారు ? అంటూ గట్టిగా ప్రశ్నించే సరికి పోలీసులు అడ్డుపడతారు మీరు ఎందుకు మా ముందే ఆమెను దబాయిస్తున్నారు అని ప్రశ్నిస్తారు.
Vadinamma Serial July 20 Episode: శిల్పకి సిద్ధూ షాక్.. పగిలిన కిషోర్ చెంప.. ఊహించని ట్విస్టులు!
తల్లీ కూతుళ్ల సమస్య
అయితే ఇది తల్లీ కూతుళ్ల మధ్య సమస్య అని మీరు దయచేసి ఇన్వాల్వ్ కావద్దు అని వార్నింగ్ ఇస్తుంది. ఇంతలో సిద్ధూ కూడా నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా అని శిల్పను అడిగితే ఇష్టం లేదని చెబుతోంది. దీంతో శిల్ప కు ఈ పెళ్లి ఇష్టం లేదని తేలిపోయిందని తెలుస్తుంది. ఇంతలో రఘు దేహం కల్పించుకుని పెళ్లి ఇష్టం లేదని తెలిసిపోయింది. ఇక్కడితో సమస్య తీరిపోదని ఆమెకు ఎవరు ఇష్టమో వారితో పెళ్లి చేస్తే ఈ సమస్యకు సరైన పరిష్కారం దొరుకుతుంది అని అంటాడు.
ముగిసిన పెళ్లి
దీంతో చివరికి తనకు నాని అంటే ఇష్టమని శిల్ప చెప్పేస్తుంది. దీంతో పోలీసులు నానిని శిల్ప తో పెళ్లి నీకు ఇష్టమేనా అని అడిగితే అందుకు నాని ఎగిరి గంతేస్తారు. సిద్దు తీసుకురాగా నాని పేటల మీద కూర్చుంటాడు అలా అందరి ఆశీర్వాదాలు మధ్య పెళ్లి జరిగి పోతుంది. ఇక గెస్ట్ ఎంట్రీ వచ్చిన జబర్దస్త్ అవినాష్ సిద్ధార్థ పాత్ర కూడా ఇక్కడితో ముగిసిందని చెప్పుకోవాలి. సిద్ధార్థ శిల్ప పెళ్లి జరగాల్సిన మండపంలో చేయుటకు శిల్పా నానిల పెళ్లి ముగుస్తుంది.
కంప్లైంట్ ఎవరు ఇచ్చారు
ఇక శిల్ప -నాని ఏకాంతంగా కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా అసలు ప్రేమే లేదన్నావు ఇప్పుడు కంప్లైంట్ ఎలా ఇచ్చావు అని అడుగుతుంది కూడా. ఇది నా పని కాదని నువ్వు ఇచ్చావు కదా అని అంటాడు.. అదేం కాదని తాను కంప్లైంట్ ఇవ్వలేదని శిల్ప చెబుతుంది. ఇంతలో ఎంట్రీ ఇచ్చిన సీత మీరిద్దరూ ఇవ్వలేదని మీ ఇద్దరి మీద ప్రేమతో నేనే ఇచ్చాను అని అంటుంది దీంతో కాసేపు నీ కోసం ఏమైనా చేస్తాను అని అంటూ పొగిడే పనిలో ఉంటాడు. దీంతో ఆమె సరదాగా శిల్పను వదిలేస్తావా అంటే వదిలేస్తాను అంటాడు.
Vadinamma 600 Episode: పెళ్ళిలో మరో టెన్షన్..పోలీసుల ఎంట్రీ, ఆ కంప్లైంట్ తెరమీదకు!
శిల్ప ఈగో హర్ట్
దీంతో ఇక్కడ శిల్ప ఈగో హర్ట్ అవుతుంది అదే రఘురాం కుటుంబానికి రాబోయే కాలంలో పెను ఉపద్రవం అని చెప్పవచ్చు. ఈ దెబ్బతో దమయంతి దగ్గరకు వెళ్ళిన శిల్ప తాను క్షమించాలని అడగాలని రాలేదని తనకు నాని అంటే ఇష్టమే కానీ వాళ్ళ ఇంటిలో వాళ్ళ వదినమ్మ అందరిని ఆడిస్తోందని దాన్ని మారుస్తానని అంటుంది. నీ వల్ల కాదు అని దమయంతి రెచ్చగొట్టినా నేను నీ కూతుర్ని నీ రక్తాన్ని నాకు నాని అంటే ఇష్టమే కానీ వాళ్ల వదినమ్మ చేసే వ్యవహారం నచ్చలేదని వాళ్ళ నట్టింట్లో మంట పెడతానని శిల్ప చెబుతుంది. దీంతో ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగించారు.
కమింగ్ అప్
ఇక తర్వాతి ఎపిసోడ్లో శిల్పా నాని ఇద్దరు ఇంటికి రావడం చూపించారు. పెళ్లి బట్టలలో వచ్చిన తర్వాత సీత వీరిద్దరికీ దిష్టి తీసి లోపలికి పిలుస్తూ ఉంటే నీ శత్రువుకి నువ్వే దిష్టి తీస్తున్నావా అంటూ మనసులో అనుకుంటూ ఉంటుంది, మరోపక్క బెంగ పెట్టుకున్న దమయంతి ఏమీ తినకుండా ఉంటుంది. తనను ఇలా చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలనని ఆమె వార్నింగ్ ఇస్తుంది. చూడాలి తర్వాత ఎపిసోడ్ కూడా ఆసక్తి కరంగానే ఉండబోతోంది కాబట్టి.