Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Vadinamma Serial July 26 Episode: శిల్పకి సీత మీద కొత్త అనుమానం.. నానికి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వబోతున్న దమయంతి!
స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది. ఈ సీరియల్ లో ప్రభాకర్, సుజిత లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ప్రతీ ఎపిసోడ్ లో ఏదో ఒక ఆసక్తికరమైన ఎలిమెంట్ ఉండేలాగా చూస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇక తాజా ఎపిసోడ్ లో ఏం జరిగింది అనే విషయం పరిశీలిద్దాం.
Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్
శనివారం ఏమైదంటే
శనివారం నాటి ఎపిసోడ్ లో ఎలా అయినా నాని శిల్పా ఇద్దరు కలవకుండా ఉండడానికి భరత్ - లక్ష్మణ్. శైలు - సిరి ఇద్దరు కష్టపడుతుంటారు. అయితే వారిద్దరినీ నిద్రపుచ్చి వీరిద్దరూ కలవాలనుకున్న సమయంలో రఘురాం సీత ఎంట్రీ ఇవ్వడం తో బ్రేక్ పడుతుంది. ఇక వీరిద్దరినీ ఎక్కువ కాలం దూరంగా ఉంచడం కష్టం అని భావిస్తున్న తరుణంలో వెంటనే ముహూర్తాలు పెట్టిస్తామని తొందర పడొద్దు అని చెబుతారు. అక్కడితో మొన్నటి ఎపిసోడ్ ముగియగా ఈరోజు ఎపిసోడ్ కూడా ఆసక్తికరంగా సాగింది.
నిద్ర కూడా పట్టడం లేదు
ఇక ఈ రోజు ఎపిసోడ్ విషయానికి వస్తే తమ కళ్లుగప్పి వెళ్లిపోయిన శిల్పను సిరి - శైలు ఇద్దరు గట్టిగా పట్టుకుని ఎక్కడికి వెళ్ళనీయకుండా పడుకోబెట్టు కుంటారు. ఇదంతా ఇలా జరుగుతూ ఉంటే పార్వతి, దుర్గ ఇద్దరికీ అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో విషయం అర్థం కావడం లేదు. దుర్గ మొగుడు భాస్కర్ క్యాంపుకి వెళ్లడంతో తనకు ఆ ఇంటి విషయాలు ఏమీ తెలియడం లేదని దుర్గ చెబుతుంది. పార్వతి అయితే అసలు ఈ విషయాలేవీ తెలియక తనకు నిద్ర కూడా పట్టడం లేదు అని చెబుతుంది.
శిల్పాకు కొత్త అనుమానాలు
అయితే ఈ సమస్య క్లియర్ కావాలి అంటే వెళ్లి సీత ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసు కోవడం ఒక్కటే దారి అని భావించి ఇద్దరూ అక్కడికి వెళ్తారు, అసలు రద్దయిన పెళ్లి ఎలా జరిగింది ? రద్దయిన పెళ్లి మళ్లీ ఇలా జరగటం ఎలా సాధ్యమైంది అనే విషయాలు తెలుసుకోవడానికి ఈ ఇద్దరు ఆసక్తి చూపిస్తుంటారు.. అలా సీత ఇంటికి వెళ్ళగానే సీత ఇంటి వసారాలో కూర్చొని శిల్ప గేమ్ ఆడుకుంటూ ఉంటుంది. ఈ ఇద్దరు శిల్పాకు కొత్త అనుమానాలు రేకెత్తించే ప్రయత్నం చేస్తూ ఉంటారు.
అది తెలియదా
ఇదంతా జరుగుతున్న క్రమంలో మరో పక్కన సీత పంతులు పిలిపించి శిల్ప-నానిల శోభనానికి ముహూర్తం పెట్టమని అడుగుతుంది. అయితే మరో నెల రోజుల వరకు శోభనానికి ముహూర్తాలు లేవని తేల్చి చెబుతాడు. వాళ్ళిద్దరూ బాధపడుతున్న సమయంలో మరోసారి ముహూర్తం చూసి చెప్పమని అడుగుతుంది. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా దమయంతి ఎంట్రీ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. శోభనానికి ముహూర్తం పెట్టిన పంతులుకి శోభనం అమ్మ ఇంట్లో జరగాల్సిన విషయం తెలియదా అని అడుగుతుంది.
నాని జ్యూస్ లో మందు
అది నిజమేనని చెబుతూ పంతులు తటపటాయిస్తూ ఉంటాడు. ఇంతలో ఆమెను ఇంట్లో కూర్చోమని చోటు చూపిస్తారు సీత అండ్ కో. ఇది జరుగుతున్న క్రమంలో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక అ శిల్ప ఇంటికి సీత అండ్ ఫ్యామిలీ మొత్తం వెళ్ళినట్లుగా తర్వాత ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపించారు. మా వాడికి మర్యాదలు గట్టిగా చేయాలని భరత్ కోరడం ఆ వెంటనే దమయంతి సరేనని చెప్పి లోపలికి వెళ్లి నాని తాగే జ్యూస్ లో ఏవో బిళ్ళలు చేయడం కూడా చూపించారు. ఏంటి అసలు ఏం జరగబోతుంది ? అనేది రేపటి ఎపిసోడ్ లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.