For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vadinamma : భర్త దెబ్బకి బొక్క బోర్లా పడ్డ దమయంతి, కిషోర్ చెంప పగలకొట్టిన రఘురామ్ !

  |

  స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ప్రతి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  శోభనానికి సిద్దం

  శోభనానికి సిద్దం

  శోభనం కోసం శిల్ప ఇంటికి నాని కుటుంబం అంతా చేరుకుంటుంది. శోభనానికి చాలా సమయం ఉండడంతో పెళ్లిలో చేయలేని అనేక సరదా పనులు చేస్తూ కుటుంబం అంతా ఆనందంగా గడుపుతూ ఉంటారు. అయితే వీళ్లంతా ఆనందంగా నడుపుతూ ఉండడం అటు శిల్ప తల్లికిగాని, శిల్ప సోదరుడు గాని భరించలేక పోతుంటారు. ఇదంతా ఇలా జరుగుతున్న క్రమంలో నిన్నటి ఎపిసోడ్ ముగిసింది. ఇక ఈ రోజు ఏం జరగబోతోంది అనేది తెలుసుకుందాం

  రగిలిపోతున్న శిల్ప అన్న

  రగిలిపోతున్న శిల్ప అన్న

  నిన్న పూల బంతితో శిల్ప -నాని ఆడగా ఈ రోజు నాని కుటుంబంలోని అన్ని జంటలు అలాగే దమయంతి - రాజశేఖర్ కూడా ఆడతారు. మరీ ముఖ్యంగా శిల్ప అక్క కల్పన మొగుడు అయితే మొట్టమొదటిసారి గెలవడంతో ఆనందం పట్టలేక లేచి గంతులు వేస్తూ ఉంటాడు. అయితే ఇదంతా చూస్తున్న శిల్ప అన్న కిషోర్ కి మాత్రం కడుపు రగిలి పోతూ ఉంటుంది. ఎవరైనా వీళ్లందరినీ ఇంటి నుంచి బయటకు పంపితే బాగుండు అన్నట్టు ముఖం చిట్లించి చూస్తూ ఉంటాడు.. ఇదంతా చూస్తున్న నాని అతని దగ్గరకు వెళ్ళి అంతా అయిపోయిందని ఎన్నో అనుకుంటాం కానీ ఇప్పుడు తమ పెళ్లి అయిపోయింది కాబట్టి సైలెంట్ గా ఉండాలి అని అంటాడు.

  మత్తు మందు ప్లాన్

  మత్తు మందు ప్లాన్

  అయితే శిల్ప సోదరుడికి ఇవేవీ నచ్చవు మరోపక్క బంతి ఆట అవగానే అందరూ సినిమా పాటలు పెట్టుకుని ఒక్కో జంట డాన్స్ చేస్తూ ఉంటారు. ముందుగా రఘు రామ - సీత తర్వాత లక్ష్మణ్- శైలు, ఆ తర్వాత భరత్ - సిరి ఆ తర్వాత కొత్త జంట నాని - శిల్ప వీరందరూ పూర్తయ్యాక కల్పనా ఆమె భర్త ఇలా అందరూ సినిమా పాటలు కి డాన్స్ చేస్తారు. అయితే ఇలా జరుగుతున్న క్రమంలో అందరికీ జ్యూస్ సిద్ధం చేస్తూ ఉంటుంది పని మనిషి. అయితే పని మనిషి దగ్గరికి వెళ్లిన దమయంతి నానికి ఇచ్చే గ్లాసులో మత్తుమందు కలుపుతుంది.

  ప్లాన్ ఫెయిల్

  ప్లాన్ ఫెయిల్

  ఆ గ్లాసులు తీసుకెళ్లి అందరికీ ఇస్తూ నానికి స్వయంగా మత్తు మందు కలిపిన గ్లాసు అందిస్తుంది. అయితే నాని అనుకోకుండా పక్కనే ఉన్న మామ గారికి అందిస్తాడు. అల్లుడు ఇచ్చాడు కదా అనే ఉద్దేశంతో మామగారు కూడా వెంటనే గటగటా తాగేసి గ్లాసు పక్కన పెడతాడు. దీంతో నాని శోభనం ఫెయిల్ చేయించాలని దమయంతి వేసిన స్కెచ్ ఫెయిల్ అయింది. తన భర్త మత్తుమందు కలిపిన జ్యూస్ తాగడంతో వెంటనే ఆయన తీసుకు వెళ్లి పడకగదిలో పడుకోబెడుడుతుంది. ఎప్పుడు చూడు ఇలా ఏదో ఒకటి అడ్డం పడుతూ తన ప్లాన్స్ కి అడ్డం పెడుతున్నాడు అని భావిస్తోంది.

  చెంపపగలకొట్టి

  చెంపపగలకొట్టి

  మరో పక్క నాని - శిల్ప సోదరుడు కిషోర్ గొడవ పడుతూ ఉంటారు. నాని తల మీద ఫ్లవర్ వాజ్ తో కొట్టపోతే రఘురామ్ ఎంట్రీ ఇచ్చిన వార్నింగ్ ఇస్తాడు..అయినా వినకపోతే చెంప పగలగొట్టి నువ్వు నా కాలర్ పట్టుకున్నప్పుడే నీ సంగతి చూడాల్సింది కానీ బాకీలు నెమ్మదిగా తీరుతాయని ఆగాను, కానీ నువ్వు మాత్రం ఆగేట్టు కనిపించడం లేదు.. నీ బాకీ వెంట వెంటనే తీర్చేస్తా అని అంటాడు. దీంతో రఘురాం కొట్టడంతో అవమానం తట్టుకోలేక శిల్ప సోదరుడు కిషోర్ అక్కడ నుంచి వెళ్ళి పోతాడు. మరోపక్క బిందెలో ఉంగరాలు ఆట కోసం రఘురాం ఫ్యామిలీ అంతా సిద్ధం అవుతుంది. దమయంతిని కూడా పిలుచుకురమ్మని పంపిస్తారు.

  వెన్నుపోటుకు సిద్ధం

  వెన్నుపోటుకు సిద్ధం

  అయితే దమయంతి అక్కడికి వెళ్లి తన భర్త అలసిపోయి పడుకున్నాడు అని చెబుతుంది. ఇలా జరుగుతున్న క్రమంలో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. అయితే తర్వాత ఎపిసోడ్ కమింగ్ అప్ ప్రకారం శిల్ప సోదరుడు కిషోర్ ఇల్లు విడిచి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతాడు. కానీ దమయంతి శోభనం ఎలా జరుగుతుందో చూస్తావు కదా, ఒక్కోసారి ధర్మంగా యుద్ధం చేయలేనప్పుడు వెన్నుపోటు పొడవడానికి సిద్దంగా ఉండాలని ఇప్పుడు తాను అదే చేయబోతున్నా అని అంటుంది. మరి చూడాలి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది అనేది.

  English summary
  Vadinamma Episode 607: Vadinamma is a Telugu soap which airs on Star Maa and streams on Disney+Hotstar. The series premiered on 6 May 2019. It stars Prabhakar, Sujitha, Rajesh Dutta, Maheshwari, Raj and Priyanka. In the latest episode Dhamayanthi gets frustrated as her ploy against Nani goes for a toss. In the meantime, Kishore and Nani get into a fight.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X