Vadinamma Serial July 2nd Episode: రఘురామ్ ఫ్యామిలీకి గుండె పగిలే న్యూస్!
ప్రస్తుతం తెలుగులో సినిమాలతో పాటు సీరియల్స్ కూడా పోటీపడుతూ ఆసక్తికర టిఆర్పి రేటింగ్స్ సాధిస్తున్నాయి. మరీ ముఖ్యంగా వదినమ్మ సీరియల్ మంచి రేటింగ్ తెచ్చుకుంటూ తెలుగులో టాప్ ఫైవ్ సీరియల్స్ లో ఒకటిగా నిలుస్తోంది. ఈ సీరియల్లో రఘురాం కుటుంబం పడే కష్టాలను ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు. తాజా ఎపిసోడ్ లో ఏం జరిగింది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

డబ్బు కట్టి మరీ
నిన్నటి ఎపిసోడ్ లో సిరి కూతురు వైదేహికి జ్వరం రావడంతో ఆమెను హాస్పిటల్ కి తరలించారన్న సంగతి తెలిసిందే.. అయితే హాస్పిటల్ లో డబ్బులు కట్టడానికి కూడా ఎవరి దగ్గర డబ్బు ఉండదు.. ఇంతలో సిరి తన తల్లి పార్వతికి ఫోన్ చేయడంతో పార్వతి అప్పటికప్పుడు డబ్బు తీసుకు వచ్చి కడుతుంది. అక్కడితో నిన్నటి ఎపిసోడ్ ముగిసింది, అయితే డబ్బులు కట్టిన తరువాత ఎప్పటిలాగే ఆమె మళ్ళీ రఘురాం సీత అలాగే మిగతా కుటుంబ సభ్యులను టార్గెట్ చేసి విమర్శల వర్షం కురిపిస్తుంది.

పాప గుండెల్లో హోల్
పాపకి జ్వరం వస్తే ఆసుపత్రికి తీసుకు వెళ్లాలనే విషయం కూడా తెలియదా అంటూ ఆమె అందరినీ విమర్శిస్తుంది. ఇక పార్వతీ సహా మిగతా కుటుంబ సభ్యులు అందరూ ఇంటికి చేరుతారు. నిజానికి ఇంటికి వెళ్లే ముందే డాక్టర్ రఘురాంను పక్కకు పిలిచి అసలు విషయం జరుగుతుంది..
పాప గుండెల్లో హోల్ ఉందని ఇప్పుడు కాకపోయినా మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించిన ఒక ఆపరేషన్ చేయాలని చెబుతుంది. దీంతో ఒక రకంగా రఘురాం గుండెలు బద్దలై నట్లుగా చూపిస్తారు.

అందరినీ టార్గెట్ చేసి
ఇంటికి వెళ్ళాక కూడా పార్వతి తన మనవరాలిని ఆడిస్తూ మిగతా వాళ్లందరినీ ఆడిపోసుకుంటూ ఉంటుంది. మీరంతా ఉండి కూడా తన మనవరాలిని ఇబ్బందులపాలు చేశారని విమర్శిస్తుంది. అంతేగాక మీకు చూసుకోవడం చేతకాక పోతే చెప్పండి నేను తీసుకు వెళ్ళి పోతాను అంటుంది అంటుంది. దేవుడి దయ వల్ల ఇబ్బంది నుంచి గట్టెక్కామని రఘురాం తల్లి చెబితే మీకు చేతకాక ఈ మాటలు మాట్లాడుతున్నారని పార్వతి విమర్శిస్తుంది.

పార్వతి మీద చేయి ఎత్తిన సత్యమూర్తి
రఘురామ్ కి చేతకాకపోతే తమ్ముళ్ల బాధ్యత వదిలేయాలని ఎవరికి వారు విడివిడిగా ఉంటే బలంగా ఎదుగుతారని పార్వతి చెబుతుంది. ఇక సీత ఆమె మాటలను కాదని తాము అందరం కలిసే ఉంటామని చెబుతోంది. అయితే తన మనవరాలిని తమకి ఇచ్చేయాలని తాము తీసుకెళ్లి పెంచుకుంటామని ఆమె అంటుంది. దీంతో ఎప్పుడూ లేనిది సత్యమూర్తికి విపరీతమైన కోపం వచ్చి భార్య మీద చెయ్యి ఎత్తుతాడు. దీంతో అక్కడి నుంచి ఆమె విసురుగా నడుచుకుంటూ వెళ్ళి పోతుంది.

నాని ప్రియురాలి తల్లి ఎంట్రీ
ఇంటికి వెళ్ళాక మళ్ళీ భార్యను సముదాయించే ప్రయత్నం చేస్తాడు సత్యమూర్తి. వాళ్ళసలే బాధలో ఉంటే నువ్వు ఇంకా బాధ పెట్టడం సరికాదని సత్యమూర్తి ఆమెకు చెబుతాడు. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసినట్టు చూపించారు. ఇక తరువాతి ఎపిసోడ్ లో నాని ప్రియురాలి తల్లి తండ్రులు రఘురాం ఇంటికి వచ్చినట్టు చూపారు.


Click it and Unblock the Notifications











