Vadinamma : మళ్ళీ శోభనం ఫట్.. సరికొత్త ప్లాన్ తో వచ్చిన దమయంతి.. ఈ సారి ఏమైంది అంటే?

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం తెలుగులో టాప్ ఫైవ్ సీరియల్స్ లో ఒకటిగా ఈ సీరియల్ కొనసాగుతోంది. ఇక ఈ సీరియల్ తాజా ఎపిసోడ్ లో ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం


Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

శోభనానికి సిద్దం

శోభనానికి సిద్దం

నిన్నటి ఎపిసోడ్ ప్రకారం నాని-శిల్ప శోభనం కోసం నాని కుటుంబం అంతా దమయంతి ఇంటికి చేరుకుంటారు. అయితే శోభనం కోసం చేస్తున్న కొన్ని సరదా పనులలో నాని కుటుంబం చేసే అతి ఒకపక్క దమయంతికి కానీ కిషోర్ కి గాని నచ్చదు.. ఎలా అయినా శోభనం ఫెయిల్ చేయించాలని నానికి మత్తు మందు కలిపిన జ్యూస్ తాగించపోతే ఆ జ్యూస్ దమయంతి మొగుడు తాగేసి పడుకుంటాడు. అయినా సరే ఎలా అయినా శోభనం క్యాన్సిల్ చేయించాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. నిన్నటి ఎపిసోడ్ ముగిసే సమయానికి నాని శిల్పా ఇద్దరూ బిందెలో ఉంగరం ఆడుతూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగింది అని తెలుసుకుందాం.

 కిషోర్ రాద్ధాంతం

కిషోర్ రాద్ధాంతం

ఈ బిందెలో ఉంగరం వెతికే ఆటలో నాని గెలవాల్సి ఉన్నా భార్యని గెలిపిస్తాడు ఈ విషయం తెలుసుకుని ఇది నిజమైన దాంపత్యం తాము గెలుస్తామని అనుకున్న చోట కూడా తమను నమ్మిన వారిని గెలిపించాలని సీత చెబుతుంది. ఇక ఈ ఆట ఇలా జరుగుతూ ఉంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని కిషోర్ నానా రాద్ధాంతం చేస్తాడు.

తల్లిని దెప్పి పొడిచి

తల్లిని దెప్పి పొడిచి

ఒకప్పుడు నీలా బతకాలని అనుకున్నాను అని కానీ ఇప్పుడు నువ్వు నానీ కుటుంబం చేతిలో ఇలా అయిపోవడం చూస్తూ ఉంటే తనకు చాలా బాధగా ఉందని తల్లిని దెప్పిపొడుస్తాడు. అయితే ఇదంతా తన ప్లాన్ లో భాగమేనని ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో శోభనం జరుగదు అని మాట ఇస్తుంది. అంతేకాక తన ప్లాన్ ఏంటో చెప్పనని చేసి చూపిస్తానని అంటుంది.

కూతురికి నూరిపోసి

కూతురికి నూరిపోసి

ఇక ఈలోపు శోభనానికి సిద్ధమవుతున్న నాని దగ్గరకు రఘురాం సీత వెళ్లి భార్యతో ఎలా మసలుకోవాలి ? ఎలా ఉంటే భార్య మనతోనే ఉంటుంది ? అనే విషయాలు నూరిపోస్తూ ఉంటారు. ఇక మీదట నీకు అన్ని భార్యనే అని, ఏం చేసినా ఆమెను సంప్రదించి ఆమె ఇష్టంతోనే చేయాలని చెబుతూ ఉంటారు. మరోపక్క దమయంతి మాత్రం కూతురు దగ్గరికి వెళ్లి ఈ రోజు శోభనం జరగకూడదని ఎలా అయితే కుక్కకి మాంసం ముక్క ఆశ చూపించి మాట వినేలాగా చేయాలని చూస్తామో అలాగే నానిని కూడా చేయాలి అని అంటుంది. ఒక్కసారి ఆ మాంసం ముక్క దొరికింది అంటే ఎలా అయితే మన మాట వినదొ నాని కూడా మన మాట అలాగే వినడు అని అనేక విషయాలు నూరి పోస్తుంది.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
 మరో స్కెచ్ వేసిన దమయంతి

మరో స్కెచ్ వేసిన దమయంతి

మొత్తం మీద నాని శిల్ప ఇద్దరు శోభనం గదిలోకి వెళ్తారు. వాళ్ళిద్దరి మధ్య కొన్ని డ్యూయెట్ లు కూడా ప్లాన్ చేశారు. ఇదంతా ఇలా జరుగుతున్న క్రమంలో ఎలా అయినా శోభనాన్ని క్యాన్సిల్ చేయించాలని భావిస్తున్నా దమయంతి తన మొగుడు మత్తు మందు తాగి నిద్రపోతుంటే అతనికి ఏదో ఆరోగ్య సమస్య వచ్చినట్లు ప్లాన్ చేస్తున్నట్లు కమింగ్ అప్ లో చూపించారు. ఏమండీ అని అరుస్తూ గగ్గోలు పెడుతున్న కిరణ్ నాని శిల్ప మొదలు అందరూ రాజశేఖర్ వద్దకు పరిగెత్తుకు వస్తారని ఆమె ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. దీనిమీద మరి ఇంత క్లారిటీతో ఎపిసోడ్ లో వచ్చే అవకాశం కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X