For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vadinamma Serial July 31 Episode: దమయంతి దెబ్బకి మైండ్ బ్లాంక్.. హార్ట్ ఎటాక్ ప్లాన్ తో శోభనం మటాష్!

  |

  స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ప్రతి ఎపిసోడ్ ఆసక్తి రేకెత్తిస్తోంది. మరీ ముఖ్యంగా సీరియల్ లో ప్రతి ట్విస్ట్ ప్రేక్షకులను అలరిస్తోంది.. తాజా ఎపిసోడ్ లో ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

  Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

   నిన్న ఏమైందంటే?

  నిన్న ఏమైందంటే?

  ఇక నిన్నటి ఎపిసోడ్ ప్రకారం శోభనం ఎలా అయినా వాయిదా వేయించాలి అని ప్లాన్ చేసిన దమయంతి అందుకు తగ్గట్టుగానే ఒక మాస్టర్ స్కెచ్ వేసింది. నిజానికి ముందుగా తన కూతురు శిల్పకు అన్ని నీ నూరిపోసి లోపలికి పంపించింది. కానీ శిల్ప మీద పూర్తిగా నమ్మకం పెట్టుకోకూడదు అని అది ఎప్పుడైనా హ్యాండ్ ఇవ్వచ్చు అని భయపడుతూ ఉంటుంది. ఆ భయం లేకుండా సరికొత్త ప్లాన్ సిద్ధం చేసి రంగంలోకి దిగుతుంది.

  అంతా ఓకే అనుకుంటే

  అంతా ఓకే అనుకుంటే

  అయితే ఇదంతా తెలియని రఘురాం కుటుంబం పంతులు గారు పెట్టిన ఈ ముహూర్తం వల్ల శుభం జరుగుతుందని రేపొద్దున పంతులుగారికి మంచిగా బట్టలు కూడా పెట్టాలి అని భావిస్తూ ఉంటారు. అయితే తన ప్లాన్ సిద్ధం చేసిన దమయంతి అందరిని రప్పించడానికి సిద్ధమవుతుంది. ఈలోపు శిల్ప కూడా తల్లి చెప్పిన బాటలోనే నడుస్తూ నానీ దగ్గరకు వచ్చినా సరే దూరం పెడుతూ ఉంటుంది. అంతేగాక తనకు సిగ్గుగా ఉందని చెబుతూ దూరం పెంచుకుంటూ వెళుతుంది. అలాగే పాలు తాగాలని చెబుతూ తల్లి ఇచ్చి పంపిన పాలు నానికి పట్టిస్తుంది.

  దమయంతి మాస్టర్ ప్లాన్

  దమయంతి మాస్టర్ ప్లాన్

  ఈలోపు రంగంలోకి దిగిన దమయంతి కూడా తన భర్తకు హార్ట్ ఎటాక్ వచ్చిందని నాటకం మొదలు పెడుతుంది. గట్టి గట్టిగా ఏమండీ ఏమండీ అని అరుస్తూ ఉంటే ముందుగా రఘురాం కుటుంబం అంతా లోపలికి పరిగెడుతుంది. ఈలోపు శిల్పా నాని కూడా అక్కడికి చేరుకుంటారు.. ఏమైంది అంటే ఏమైందో తెలియదు అని తాను గదిలోకి వచ్చేటప్పటికి ఆయన ఇలా గుండెను పట్టుకుని మంచం మీద పడిపోయాడు అని చెబుతోంది. దీంతో వెంటనే హాస్పిటల్కు తీసుకు వెళ్దాం పదండి అంటే అలా వద్దు అని హాస్పిటల్కి తీసుకువెళ్లడం కంటే డాక్టర్ ని ఇంటికి రమ్మని చెప్పాను అని చెబుతోంది.

   పర్వాలేదు కానీ

  పర్వాలేదు కానీ

  ఇంతలో దమయంతి ఫోన్ చేసిన డాక్టర్ కూడా ఇంటికి చేరుకుంటాడు. ఇంటికి చేరుకున్న డాక్టర్ రాజశేఖర్ ని పరీక్షించి ప్రస్తుతానికి పర్వాలేదని ఉదయానికి స్పృహ రాకపోతే అప్పుడు నేరుగా హాస్పిటల్ లో చేర్పించాల్సి వస్తుందని చెబుతాడు.. దీంతో శిల్ప మాత్రం తాను రానని రాత్రంతా ఇక్కడే ఉంటాను అని చెబుతోంది.. దీంతో దమయంతి కావాలని సీత నువ్వైనా ఆమెకు చెప్పు అంటే, అలా ఎలా చెప్పమంటారు తండ్రికి బాగోకపోతే ఏ కూతురు అయినా బాధ పడుతుంది కదా ఇక్కడే ఉండనివ్వండి అని అంటుంది.

   నా ప్లానే ఇదంతా

  నా ప్లానే ఇదంతా

  ఇక మనం అందరం బయట ఎదురు చూద్దామని రఘురాం అంటాడు. అలా రఘురాం సహా మిగతా అందరూ బయటకు వెళ్తారు. కేవలం శిల్ప, కిషోర్, దమయంతి ఉండగా ఇదంతా తన ప్లాన్ అని నువ్వు ఎక్కడ వాడికి లొంగిపోతావో అని భయంతో ఇలా ప్లాన్ చేశానని దమయంతి వెల్లడిస్తుంది. అయితే ముందుగా శిల్ప షాక్ అవుతుంది కానీ తన తల్లి ఎంతకైనా తెగిస్తుందని ఈ విషయం చూశాక అర్థమవుతుంది. నాని ఇల్లరికం వచ్చేదాకా శోభనం జరగకూడదని ఒకవేళ నా మొగుడే కదా అని నువ్వు జాలి పడితే తర్వాత నీ జీవితం అంతా ఇబ్బంది పడతావు అని అంటుంది.

   ఆషాడం ఎఫెక్ట్

  ఆషాడం ఎఫెక్ట్

  శిల్ప కూడా ఆ వదినమ్మ ఇదంతా చూసి ఏడవాలని నానినీ ఇంటికి తీసుకొచ్చే పూచీ నాది అని అంటుంది. ఇదంతా జరిగిన తర్వాత కాసేపట్లో ఆషాడమాసం వస్తుంది కాబట్టి శిల్పను ఈ నెల మొత్తం మేమే ఉంచుకుంటామనీ మీ ఇంటికి పంపమని చెబుతుంది. అయితే ముందు కాస్త భయపడినా తర్వాత దమయంతి మారిపోయింది అని భావిస్తున్నారు కాబట్టి సరే ఇంటికి వెళ్లి వస్తానని సీత సహా మిగతా కుటుంబ సభ్యులు అందరూ వెళ్లిపోతారు. అలా దమయంతి స్కీచ్ పని చేసి శోభనం కాన్సిల్ అయింది.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  నాని సీక్రెట్ మిషన్

  నాని సీక్రెట్ మిషన్

  ఇక తరువాతి ఎపిసోడ్ లో నానిని ఇంట్లో వాళ్లు అందరూ ఆటపట్టిస్తూ ఉంటారు. నీకు కాబట్టి ఎలా జరిగిందని శోభనం కూడా జరగకుండా ఆషాడమాసం వచ్చేసిందని అంటూ ఉంటారు. ఇంతలో శిల్ప ఫోన్ చేసి నిన్ను చూడాలని ఉంది అంటే అప్పుడు అప్పుడు బయలుదేరి వెళతాడు నాని. శిల్ప ఇంట్లో ఎవరికీ తెలియకుండా నాని శిల్ప గదికి వెళ్లి ఉంటాడు. దీంతో తదుపరి ఎపిసోడ్ కూడా ఆసక్తికరంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి ఏం జరిగింది ఏమిటి అనేది తెలియాలంటే వచ్చే ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

  English summary
  Vadinamma Episode 609 : Vadinamma is a Telugu soap which airs on Star Maa and streams on Disney+Hotstar. The series premiered on 6 May 2019. It stars Prabhakar, Sujitha, Rajesh Dutta, Maheshwari, Raj and Priyanka. In the latest episode damayanthi manages raghuram family and executes her evil plan. Later she request sita to postpone Nani and shilpas nupital night.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X