Vadinamma Serial July 3rd Episode: రఘురామ్ ఫ్యామిలీకి ఘోర పరాభవం... షర్ట్ పట్టుకుని మరీ!

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది. రోజుకొక ట్విస్టుతో ఈ సీరియల్ ఆద్యంతం ఆసక్తికరంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక చివరి ఎపిసోడ్ లో సిరి పాప వైదేహి గుండెల్లో హోల్ ఉందని చూపించిన సంగతి తెలిసిందే. తాజా ఎపిసోడ్ లో ఏం జరిగింది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

సడన్ షాక్

సడన్ షాక్

నాని ప్రేమించిన శిల్ప తల్లిదండ్రులు రఘురాం కొత్త ఇంటికి వచ్చి సంబంధం మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. అయితే ముందుగా వచ్చింది ఎవరో అర్థం కాక కాసేపు సీత, శైలు, సిరి అందరో వాళ్ళు ఎవరో అనుమాన పడతారు. అయితే వచ్చిన వాళ్ళు ఎవరు ? ఏమిటి ? అనే విషయాలు తెలిసినాక వాళ్లను కూర్చోబెట్టి మర్యాదలు చేసే ప్రయత్నం చేస్తారు.. అయితే వారి కుటుంబం పరిస్థితి ఏమీ బాలేదని భరత్, లక్ష్మణ్ మాటలతో శిల్ప తల్లి దమయంతికి అర్థమవుతుంది.

డబ్బు లేకే ఇలా

డబ్బు లేకే ఇలా

దీంతో ఆమె నాని ఉద్దేశిస్తూ అనరాని మాటలు అంటుంది.. ఆస్తి లేదు కాబట్టి ఆస్తి ఉన్న అమ్మాయిలను పటాయించాలని ఇలా ప్లాన్ చేసి తన కూతురు ని ప్రేమలోకి దింపాడని ఆమె ఆరోపిస్తోంది. అన్న ప్రోద్బలంతోనే ఇదంతా జరిగిందని ఆమె ఆరోపిస్తోంది. అంతేకాక మొగుడు చెప్పుకోలేకపోతే పిల్లలు లాంటి మరుదులకు ఏం చేయాలి ? ఏం చేయకూడదు ? అనే విషయాలు చెప్పు లేదా అంటూ సీతను సైతం ఆమె టార్గెట్ చేస్తుంది.

అలాంటి వాళ్ళం కాదు

అలాంటి వాళ్ళం కాదు

అయితే తాము ఎవరం అలాంటి వాళ్ళం కాదని సీత, శైలు, సిరి మాట్లాడుతారు. రఘురాం సైతం తమ పరిస్థితిని వివరించే ప్రయత్నం చేస్తాడు. సిరి కూడా తమ మధ్య కలిసి పోయే లక్ష్మీ దేవి పిల్ల వస్తే చాలు కానీ ఆ పిల్లతో పాటు వచ్చే లక్ష్మీదేవి తమకు అవసరం లేదని చెబుతుంది. శైలు కూడా ఆమెకు అర్థం అయ్యే విధంగా తామెవరం డబ్బులకు వ్యాల్యూ ఇచ్చి మనుషులం కాదని చెబుతుంది.

 గ్రీన్ సిగ్నల్

గ్రీన్ సిగ్నల్

ఇక దమయంతి భర్త కూడా వాళ్ల మాటలు నిజాయితీగానే ఉన్నాయని నమ్మచ్చని చెప్పడంతో దమయంతి కాస్త ఆలోచించి నానికి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెబుతూ త్వరలోనే నిశ్చితార్థం చేసుకోవడానికి తన ఇంటికి రావాలని ఆహ్వానిస్తుంది. ఇక ఆమె వెళ్ళిపోయిన వెంటనే లక్ష్మణ్ సరదాగా నానిని పట్టుకుని కొట్టడానికి చూస్తాడు. తమకు ఎవరికీ చెప్పకుండా ఇలా ప్రేమ వ్యవహారాలు ఏమిటని అడుగుతాడు.

ఘోర పరాభవం

ఘోర పరాభవం

ఇక నాని నిద్రకు ఉపక్రమించే సమయంలోనే శిల్ప ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి తమ తల్లి పెళ్లికి ఒప్పుకున్న విషయం నువ్వు ఫోన్ చేసి చెబుదావని ఎదురు చూశాను అని నువ్వు చేయకపోవడంతో తానే చేశానని చెబుతోంది. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది ఇక తదుపరి ఎపిసోడ్ లో నిశ్చితార్థం కోసం వెళ్ళిన రఘురాం కుటుంబానికి ఘోరపరాభవం ఎదురవుతుంది. శిల్ప బదులు దమయంతి ఇంట్లో పనిచేస్తున్న డ్రైవర్ కూతురిని పెళ్లి కూతురుగా తీసుకురావడాన్ని చూపిస్తారు. అలాగే దమయంతి కొడుకు రఘురాం కాలర్ పట్టుకున్నట్లుగా ఎపిసోడ్ కమింగ్ అప్ చూపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X