Vadinamma Serial July 5th Episode: నానికి ఉద్యోగం... రఘురామ్ కు ఘోర అవమానం!

తెలుగులో టాప్ ఫైవ్ సీరియల్స్ లో ఒకటిగా కొనసాగుతున్న స్టార్ మా వదినమ్మ సీరియల్ ఆసక్తి రేకెత్తిస్తోంది.. మరీ ముఖ్యంగా రఘురాం కుటుంబంలో ఎదురవుతున్న కష్టాలను వాటిని ఎదుర్కొనే తీరు ప్రేక్షకులకు మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది అని చెప్పవచ్చు. తాజా ఎపిసోడ్ లో ఏమి జరిగింది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

నిన్నటి ఎపిసోడ్ లో

నిన్నటి ఎపిసోడ్ లో

నాని ప్రేమించిన శిల్ప తల్లిదండ్రులు రఘురాం కుటుంబాన్ని చూసుకోవడానికి వచ్చారన్న సంగతి తెలిసిందే. ముందు రఘురాం కుటుంబాన్ని అవమానించే ప్రయత్నం చేసిన తర్వాత తాను పెళ్లికి ఒప్పుకున్నానని చెప్పి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది దమయంతి. వాళ్ళు వెళ్ళిపోయాక నాని ఎంతసేపటికి ఫోన్ చేయకపోవడంతో శిల్ప ఫోన్ చేసి విషయం చెప్పి ఆనందపడుతుంది. ఇక అక్కడితో నిన్నటి ఎపిసోడ్ ముగిసింది.

 నానికి ఉద్యోగం

నానికి ఉద్యోగం

ఇక నేటి ఎపిసోడ్ లో ఏం జరిగింది అంటే నాని హడావిడిగా అందరినీ పిలుస్తూ ఉంటాడు. ఇంట్లో అందరినీ సమావేశపరిచి విషయం చెప్పకుండా సిగ్గు పడుతూ ఉంటాడు. కాబోయే భార్య దగ్గర నుంచి ఏదైనా మెసేజ్ వచ్చిందా ఏంటి అంటూ వదినలు ఇద్దరూ ఆట పట్టిస్తూ ఉంటారు. అయితే అదేమీ కాదని తనకు సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంటర్న్షిప్ అవకాశం వచ్చిందని ఆ ఇంటర్న్షిప్ కోసం నెలకు పదివేల రూపాయల స్టైఫండ్ ఇస్తారని ఆ ట్రైనింగ్ ముగిసిన తర్వాత ఏడాదికి పది లక్షల జీతంతో ఉద్యోగం వస్తుందని చెబుతాడు.

పెళ్లి ఎలా చేయాలా అని

పెళ్లి ఎలా చేయాలా అని

దీంతో పెళ్లి కుదిరిన వేళా విశేషమే నీకు ఈ ఉద్యోగం వచ్చిందని ఇంట్లో అందరూ చెబుతారు. ఉద్యోగం సద్యోగం లేని వాడికి పెళ్లి ఎలా చేయాలా అని ఆలోచిస్తున్న సమయంలో ఉద్యోగం ఫిక్స్ కావడంతో రఘురాం కూడా ఆనందపడతాడు. ఇదే విషయాన్ని చెబుతూ ఇక నీ పెళ్ళికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని ఆయన చెబుతాడు.. అయితే ఇదంతా ఇలా జరుగుతున్న క్రమంలో సీత అన్న భాస్కర్ ఇంట్లో మరో రచ్చ జరుగుతూ ఉంటుంది.

దెప్పి పొడుస్తూ

దెప్పి పొడుస్తూ

భాస్కర్ భార్య నానికి పెళ్లి చూపులు జరిగిన విషయాన్ని చెప్పి అతనిని దెప్పి పొడుస్తూ ఉంటుంది. నేను లేకపోతే ఏమీ జరగదు అని చెబుతూ ఉంటావు నానికి పెళ్లి చూపులు కూడా అయిపోయాయి, పెళ్లి కూడా అయిపోతుంది అయినా నీకు తెలియదు అంటూ ఎద్దేవా చేస్తుంది. ఆమె అలా అంటున్న సమయంలోనే భాస్కర్ కి రఘురామ్ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి పెళ్లి కుదిరింది అన్న విషయం చెబుతాడు.

వాడికి పెళ్ళి ఎందుకు ?

వాడికి పెళ్ళి ఎందుకు ?

దీంతో అప్పుడే వాడికి పెళ్ళి ఎందుకు ? ఇంకా స్థిరపడలేదు కదా ? అంటాడు. ఈ లోపు వాడి ప్రేమ విషయం చెప్పి అనుకోకుండా వాళ్ళు ఇంటికి వచ్చారని విషయం చెబుతాడు. రేపు వాళ్ళ ఇంటికి నిశ్చయ తాంబూలాలు తీసుకోవడానికి వెళ్లాలని నువ్వు దుర్గా పొద్దున్నే రావాలని కోరాడు

అందరూ కలిసి

అందరూ కలిసి

ఇక ఆ విధంగా తర్వాతి రోజు అందరూ ఉదయాన్నే రఘురాం ఇంటికి చేరుతారు. రఘురాం ఇంటి నుంచి శిల్ప ఇంటికి బయలు దేరి వెళతారు. శిల్పను చూసి రఘురాం, సీత సహా కుటుంబ సభ్యులందరూ ఆనందపడతారు/ నానికి మంచి భార్య దొరికిందని ఆనంద పడుతూ ఉంటారు. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
 రఘురామ్ కు ఘోర అవమానం

రఘురామ్ కు ఘోర అవమానం

ఇక కమింగ్ అప్ లో చూపించిన దాని ప్రకారం దమయంతి తన దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్న వ్యక్తి కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాను అంటూ అవమానించినట్లు చూపించారు. దమయంతి కొడుకు రఘురాం కాలర్ పట్టుకుని అవమానించినట్టు చూపించారు. అలా మొత్తం మీద ఆ సస్పెన్స్ మాత్రం కొనసాగిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X