Vadinamma Serial July 6 Episode: దమయంతి ఇంట గలాటా.. కొట్టుకున్న నాని - శిల్ప అన్న!

ఈ మధ్యకాలంలో తెలుగు సీరియల్స్ కూడా సినిమాలకు ఏ మాత్రం తగ్గని విధంగా మంచి టీఆర్పీ రేటింగ్స్ తో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా తెలుగులో వదినమ్మ సీరియల్ ఇప్పుడు టాప్ ఫైవ్ లో ఉంటూ తెలుగు ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. ప్రతి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతున్న ఈ సీరియల్ తాజా ఎపిసోడ్ లో ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం .

నిశ్చితార్థం కోసం

నిశ్చితార్థం కోసం

నిన్నటి ఎపిసోడ్ ప్రకారం నాని పెళ్లి కోసం నిశ్చితార్థం చేసుకోవడానికి గాను భాస్కర్, భాస్కర్ భార్య సహా రఘురాం కుటుంబమంతా శిల్ప ఇంటికి వెళతారు. అక్కడికి వెళ్ళాక శిల్ప, శిల్ప అక్క, తండ్రి రఘురామ్ కుటుంబాన్ని సాదరంగా ఇంట్లోకి ఆహ్వానిస్తారు. ఇంట్లోకి వచ్చాక సీత, శైలు, సిరి, అందరూ శిల్పను దగ్గరకు తీసుకుని క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకుంటూ ఉంటారు. ఇక అక్కడితో నిన్నటి ఎపిసోడ్ ముగిసింది.

నానిని పక్కకు పంపి

నానిని పక్కకు పంపి

ఇది ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో శిల్పం నాని పక్కన లేదా సీతక్క పక్కన కూర్చోమని శైలు చెబుతుంది. ఆమె ఎటు తేల్చుకోలేక ఇబ్బంది పడుతున్న సమయంలోనే తల్లి దమయంతి ఎంట్రీ ఇస్తుంది. దమయంతి వచ్చీరాగానే తన కూతురిని తన పక్కన కూర్చోవాలి అని చెబుతుంది. అంతేకాక ఇల్లు చూసి రావాలని చెబుతూ నానిని పక్కకు పంపిస్తుంది.

నాని - శిల్ప డ్యూయెట్లు

నాని - శిల్ప డ్యూయెట్లు

నాని వెళ్లిన వెంటనే శిల్ప కూడా ఇల్లు చూపించాలి అనే వంకతో నాని దగ్గరికి వెళుతుంది.. ఇక పైకి వెళ్ళాక వీళ్లిద్దరు సరససల్లాపాలలో మునుగుతూ 2,3 డ్యూయెట్లు కూడా వేసుకుంటారు.. ఈ లోపు ఎలా అయినా రఘురాం కుటుంబాన్ని అవమానించాలని ఫిక్సయిన దమయంతి సరిగ్గా సమయానికి కొడుకును వచ్చేలా చేస్తుంది. కొడుకు వచ్చాక పెళ్లి కూతురిని తీసుకురమ్మని పూజారి చెబుతూ ఉంటే తన డ్రైవర్ చెల్లెల్ని రెడీ చేసి తీసుకొస్తుంది.

మీ రేంజ్ అది కూడా కాదు

మీ రేంజ్ అది కూడా కాదు

అదేంటి శిల్పని తీసుకు రమ్మంటే ఇలా వేరే ఎవరినో తీసుకొస్తున్నారు అంటే మా డ్రైవర్ చెల్లెలు రేంజ్ మీదని చెబుతూ, మా డ్రైవర్ కూడా తన చెల్లెలిని సొంత ఇంటి లేని ఒక వ్యక్తికి ఇవ్వాలని అనుకోడు అంటూ అవమానిస్తుంది. అలాగే తన పని మనిషి తన కూతురునిచ్చి పెళ్లి చేస్తుందేమో అని ఆమెను కూడా పిలిచి తీవ్రంగా అవమానిస్తుంది. ఇంతలో భాస్కర్ కి కోపం వచ్చి లేచి ఏంటిది అని గట్టిగా ప్రశ్నిస్తాడు.

కొట్టుకున్న నాని- శిల్ప అన్న

కొట్టుకున్న నాని- శిల్ప అన్న

ఇంతలో దమయంతి కొడుకు కూడా రైజ్ అయ్యి భాస్కర్ మీదకు దూసుకు వెళ్ళబోతాడు. ఇంతలో రఘురాం అడ్డుకుని నువ్వు అలా చేయడం సరి కాదని దమయంతికి తేల్చి చెబుతాడు. గొడవ పెద్దది కావడంతో రఘురాం కాలర్ పట్టుకుని దమయంతి కొడుకు రెచ్చిపోతాడు. అయితే అప్పుడే కిందకి వస్తున్న నానీ ఇదంతా చూసి కోపం పట్టలేక పెళ్లి దమయంతి కొడుకుతో గొడవ పడతాడు. తనకు ఈ పెళ్ళి వద్దు ఏమి వద్దు అని నా ని సీరియస్ అవుతుంటే శిల్ప ఇదంతా చూసి కన్నీళ్లు పెట్టుకుంది.

ఆ అమ్మాయే కావాలి

ఆ అమ్మాయే కావాలి

మీ తమ్ముళ్లను ఇక్కడి నుంచి తీసుకు వెళ్ళిపో అంటూ దమయంతి చెబుతున్న డైలాగుతో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.. తర్వాత ఎపిసోడ్ లో ఇంట్లో అందరూ సమావేశం కాగా నాని తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని చేసుకోకపోవడం మంచిదయిందని చెబుతూ వెళ్ళిపోతాడు. నువ్వు ఎంత బాధ పడుతున్నావో ముఖం చూస్తే తెలుస్తుందని రఘురామ్ అనగా అదేమీ లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సీత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో శిల్పతోనే నాని పెళ్లి జరగాలి అని రఘురామ్ ని గట్టిగా కోరుతోంది.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!

Photos Courtesy: Star MAA and Disney+Hotstar

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X