Vadinamma July 7 Episode: టార్గెట్ నాని.. చంపడానికి ప్లాన్.. అసలు ఏమైంది?
స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటోంది.. ఈ సీరియల్ లో రఘురాం కుటుంబం అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటుంది. ఆ సమస్యలను కుటుంబం అంతా కలిసి ఎలా అధిగమించారు అనే యాంగిల్లో చూపిస్తూ ఉంటారు. తాజా ఎపిసోడ్ లో ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Photos Courtesy: Star MAA and Disney+Hotstar

ఘోర అవమానం
రఘురాం చిన్న తమ్ముడు నాని శిల్ప అనే అమ్మాయిని ప్రేమించగా అమ్మాయి తల్లిదండ్రులు రఘురాం ఇంటికి వచ్చి ముందు అవమానిస్తారు. తర్వాత తమ ఇంటికి నిశ్చితార్థం చేసుకోవడానికి రమ్మని ఆహ్వానిస్తారు. అయితే నిజమే అనుకుని సీత అన్నయ్య భాస్కర్ సహా రఘురాం కుటుంబం అంతా నాని ప్రియురాలి ఇంటికి నిశ్చితార్థం చేసుకునేందుకు వెళ్తారు. అక్కడ శిల్ప దమయంతి రఘురాం కుటుంబాన్ని అవమానిస్తుంది. ఇక్కడితో నిన్నటి ఎపిసోడ్ ముగిసింది

ఇదే మన చివరి కలయిక
ఇక నేటి ఎపిసోడ్ విషయానికి వస్తే దమయంతి కొడుకు రఘురాం కాలర్ పట్టుకోవడంతో రెచ్చిపోయిన నాని కొడుకుని కొట్టి దాడి చేయబోతాడు. అయితే ఇరు కుటుంబాల వాళ్ళు ఇద్దరినీ వెనక్కి లాగుతారు. దీంతో దమయంతి అందరినీ అక్కడినుంచి గెటవుట్ అంటూ మళ్ళీ అవమానిస్తుంది. ఈ సమయంలో నాని శిల్పని వచ్చేస్తే ఇప్పుడు వచ్చే చేయాలని లేదంటే ఇదే మన చివరి కలయిక అవుతుందని హెచ్చరిస్తాడు.

ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో
అయితే తల్లినీ కుటుంబాన్ని అప్పటికప్పుడు వదిలి వెళ్ళ లేక శిల్ప ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఏడుస్తూ ఉండిపోతుంది.. తన మాట కాదని రాకుండా ఉండిపోయిందని బాధపడుతూ నాని బయటకు వచ్చేస్తాడు. దీంతో అందరూ ఇంటికి వచ్చేస్తారు. తనకు ఆ అమ్మాయి అంటే ఇష్టమైనా ఇలా అన్నయ్యను అవమానిస్తుంటే చూడలేకపోయానని అందుకే దాడి చేశానని నాని చెబుతాడు. ఏది ఏమైనా అలా చేయడం తప్పు అని కుటుంబసభ్యులు నానికి తేల్చి చెబుతారు.

బాధలో నాని
నువ్వు ఎంత బాధ పడుతున్నానో నీ ముఖం చూస్తే తెలుస్తుందని రఘురామ్ అంటుండగా సీత కూడా ఖచ్చితంగా ఆ అమ్మాయిని ఇచ్చి నానికి పెళ్లి చేయాలని తేల్చి చెబుతోంది. మిగతా కుటుంబ సభ్యులు కూడా నాని ఆ పిల్లనే పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడతారు. అయితే తనకు ఈ విషయం మీద మాట్లాడే ఉద్దేశం లేదంటూ నాని వెళ్ళిపోతాడు. అయితే తను రమ్మని పిలిచిన రాకుండా శిల్ప తనను మోసం చేసిందని నాని బాధపడుతూ ఉంటాడు.

పెటాకులైంది
ఈ క్రమంలో శిల్ప వచ్చి తనతో మాట్లాడుతున్నట్లుగా ఊహించుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు. అయితే అదంతా ఊహేనని తెలిసి బాధపడతాడు. మరో పక్క శిల్ప కూడా తనలాగే బాధపడుతూ ఉంటుంది. ఇక ఇంటికి వెళ్ళిన భాస్కర్ ని పెళ్ళాం గుమ్మంలోనే ఆపేసి ఏం జరిగిందో చెప్పాలని అడుగుతుంది. ఇక విషయం అంతా చెప్పగా ఆనంద పడిపోతూ తాను రాలేదని తాను వస్తే తన వల్లే ఈ సంబంధం పెటాకులైంది నువ్వు అనేవాడివని అని అంటుంది.
Recommended Video

నానిని చంపడానికి
ఇక ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసినట్లే ఇక తరువాత ఎపిసోడ్ లో నాని శిల్పా కలుసుకోవడం చూసిన శిల్ప అన్నయ్య ఏకంగా నానిని చంపించడానికి ప్రయత్నం చేస్తాడు. నలుగురు రౌడీలను పెట్టి నాని సొంత ఊరిలోనే చంపించాలని ప్లాన్ చేస్తున్నట్లు చూపించారు.


Click it and Unblock the Notifications











