Vadinamma Serial July 8 Episode: నానితో పెళ్ళికి దమమయంతి ఓకే..కానీ అదే కండిషన్!
స్టార్ మా లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ప్రేక్షకులందరినీ ఆకర్షింప చేస్తోంది. ప్రతి ఎపిసోడ్ లో ఏదో ఒక ట్విస్ట్ పెడుతూ దర్శకుడు సీరియల్ మీద ఆసక్తి రేకెత్తిస్తున్నాడు. తాజా ఎపిసోడ్ లో ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Photos Courtesy: Star MAA and Disney+Hotstar,

ముగిసిన అధ్యాయం
శిల్పతో ఇక ఎలాంటి సంబంధం లేదని నాని తేల్చి చెబుతాడు.. ఇక శిల్ప విషయంలో తన వద్ద ఏమీ ప్రస్తావించవద్దని అందరినీ కోరుతాడు. అది ముగిసిన అధ్యాయం అని ప్రేమించుకున్నాం కానీ కుదరలేదు కాబట్టి ఇక ఆ విషయం గురించి ఎప్పుడూ మాట్లాడవద్దని అందరినీ కోరి వెళ్ళిపోతాడు. అయితే అలా వెళ్ళి పోతాడు గానీ శిల్ప తన వద్దకు రాలేదని బాధపడుతూ ఆమె తనను మోసం చేసిందని అనుకుంటాడు. ఇక నేటి ఎపిసోడ్ విషయానికి వస్తే

శిల్పకి చెప్పవా
శిల్ప తన అక్కను తనకు సహాయం చేయాల్సిందిగా కోరుతుంది. కానీ ఇంట్లో అమ్మకు నచ్చని పని చేస్తే అమ్మ ఊరుకోదు అని నువ్వేం చేసినా నేను నీకు సపోర్ట్ చేస్తాను కానీ అమ్మకు ఎదిరించే ధైర్యం లేదని చెబుతోంది. మరోపక్క నాని కొత్త ఉద్యోగానికి వెళ్ళడానికి సిద్ధం అవుతున్నాడు. ఉద్యోగానికి వెళుతున్నట్టు శిల్పకి చెప్పవా అని వదిన అడిగితె అది ముగిసిన అధ్యాయమని ఇక ఇష్టం లేని విషయాలు మాట్లాడవద్దని కోరుతాడు. అంతేకాక ఇక మీదట తాము శిల్పతో మాట్లాడేది లేదన్నట్లు వదినమ్మకు చెబుతాడు.

బెణికిన రఘురామ్ కాలు
ఇక మరో పక్క దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళమంటే తనకు ప్రత్యేక దేవుళ్ళు మీరే అని చెబుతూ సీతా రఘురాం కాళ్లకు దండం పెట్టుకుని ఉద్యోగానికి బయలుదేరుతాడు.. ఇంతలో రఘురాం భరత్ ఇద్దరూ కలిసి షాప్ కి వెళ్ళబోతున్న క్రమంలో రఘురాం కాలు బెణుకుతుంది. అయినా సరే స్టాక్ అంతా వచ్చింది అందరికీ సప్లై చేయాలని భావించి వెళ్ళాలని భావిస్తున్న సమయంలో తాము సహాయంగా ఉంటామని సిరి, శైలు ఇద్దరికీ ఇద్దరు భరత్ తో పాటు షాప్ కి వెళ్తారు.

భూమ్మీద ఆగే వాడా
ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా దుర్గ నాని పెళ్లి పెటాకులు అయిన విషయం తీసుకెళ్లి పార్వతికి చెబుతుంది.. దీంతో పార్వతి, దుర్గ ఇద్దరు ఆనందంలో మునిగి పోయి ఉంటారు. ఒకవేళ నాని గాని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇక రఘురాం భూమ్మీద ఆగే వాడు కాదని దేవుడు మంచి పని చేశారని ఇద్దరూ అనుకుంటూ ఆనంద పడుతూ ఉంటారు. మరోపక్క శిల్ప తన తల్లితో తాను నానిని విడిచి ఉండలేనని తనకి నానికి పెళ్లి చేయాలని కోరుతోంది

అలా అయితే పెళ్లి
అయితే ముందు ససేమిరా అన్న దమయంతి తర్వాత ఎలాగూ జరగదేమో అన్న ఉద్దేశంతో కచ్చితంగా వాళ్ళందరూ తప్పు చేశారని వాళ్ళు అందరూ వచ్చి తన కాళ్ళ మీద పడితే అప్పుడు నానిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెబుతుంది. అలాగే నాని ఇల్లరికం రావాలని కండిషన్ పెడుతోంది. ఈ కండిషన్స్ అన్ని ఒప్పుకుంటే అప్పుడు దానికి నీకు పెళ్లి చేస్తాను అని చెబుతుంది.. ఇక షాప్ కి వెళ్ళిన శైలు, సిరి ఇద్దరు సామాన్లు సర్దుతూ ఉంటారు. షాప్ కి వచ్చిన కస్టమర్ తో పరాచికాలు ఆడుతూ ఉంటుంది శైలు. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.
Recommended Video

చంపడానికి ప్లాన్
తర్వాత ఎపిసోడ్ విషయానికి వస్తే తల్లి చెప్పినట్లు నానిని ఒప్పించడానికి శిల్ప నాని దగ్గరికి వెళ్ళినట్లు చూపిస్తారు.. అయితే శిల్ప నాని కి ఫోన్ చేస్తున్న విషయం చూసి శిల్ప అన్న నానిని కొట్టాలని ముందు ఫిక్స్ అవుతాడు, తర్వాత ఇద్దరూ కలిసి ఉండటం చూసి ఏకంగా చంపించాలని ప్లాన్ చేసి మనుషులను దింపుతాడు. దీంతో తర్వాత ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఎపిసోడ్ చూడాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











