Vadinamma July 9 Episode: నాని మీద ఎటాక్.. తీవ్రగాయాలు.. ఇంతలో ఊహించని మరో షాక్!

తెలుగులో టాప్ ఫైవ్ సీరియల్స్ లో ఒకటిగా కొనసాగుతున్న స్టార్ మా వదినమ్మ సీరియల్ కూడా ప్రతి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతోంది. తాజా ఎపిసోడ్ లో ఏం జరిగింది అనే విషయాన్ని పరిశీలిస్తే

Photos Courtesy: Star MAA and Disney+Hotstar

 బైక్ మీద ఆఫీస్ కి

బైక్ మీద ఆఫీస్ కి

రఘురామ్ కాలు బెణకకడంతో షాప్ కి భరత్, సిరి, శైలు ముగ్గురు వెళతారు. అయితే అక్కడ పొట్లాలు కట్టడానికి శైలు అనేక తంటాలు పడుతూ ఉంటుంది. ఆ తంటాలు పడటం అందరికీ నవ్వు తెప్పిస్తూ ఉంటుంది. అరకేజీ పుట్నాల పప్పు కట్టమంటే కేజీ పేపర్లు వాడి మరి వాటిని కడుతుంది. ఇదంతా జరుగుతూ ఉండగా నాని ఉద్యోగానికి బయలుదేరుతాడు. రఘురాం తన బండి వేసుకుని వెళ్ళమనడంతో బైక్ మీద ఆఫీస్ కి బయలుదేరతాడు.

 శిల్ప నేరుగా వెళ్లి

శిల్ప నేరుగా వెళ్లి

ఇక మరోపక్క శిల్ప తన తల్లి చెప్పింది చెప్పినట్లు నానిని ఒప్పించి పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో వరుసగా ఫోన్లు చేస్తూ ఉంటుంది. కానీ నాని మాత్రం ఫోన్ ఎత్తడానికి ఇష్టపడడు.. తనను కాదన్నదని రమ్మంటే రాలేదని కోపంతో ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇగ్నోర్ చేస్తూనే ఉంటాడు. దీంతో ఇక లాభం లేదు అనుకుని శిల్ప నేరుగా వెళ్లి నాని వెళ్లే రూట్ కి అడ్డంగా నిలబడుతుంది..

బండి తాళం లాక్కుని

బండి తాళం లాక్కుని

నాని బండి ఆపిన వెంటనే వెళ్లి బండి తాళం లాక్కుని తన ఫోన్ ఎందుకు ఎత్తడం లేదని ప్రశ్నిస్తుంది.. ఫోన్ ఎత్తితే లాభం ఏమిటి నీ పెళ్లి వద్దు అనుకున్నాక ఇవన్నీ అనవసరం అని అంటాడు. తనకు నువ్వంటే చాలా ఇష్టం అని కానీ తల్లిదండ్రులను వదిలి వచ్చేయడం తన వల్ల కాదని శిల్ప చెబుతుంది.. అయితే ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు అని ఇప్పటికైనా నువ్వు వస్తానంటే తాను నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతాడు.

నాని అంతు చూడాలి

నాని అంతు చూడాలి

అయితే పెళ్లి చేసుకోవాలంటే మాత్రం తన అన్నకు వదినకు క్షమాపణ చెప్పాలని అప్పుడే తాను మీ ఇంటికి వచ్చి మీ అమ్మతో మాట్లాడతాను అని అంటాడు. అది జరగని పని అని జరగని వాటి గురించి మాట్లాడటం అనవసరం అని శిల్ప అంటుంది. అది జరగదని తెలుసు కాబట్టే తాను ఫోన్ ఎత్తడం లేదని ఆయన తేల్చి చెబుతాడు. అయితే ఇదంతా దూరం నుంచి చూస్తున్న శిల్ప అన్న ఎలా అయినా నాని అంతు చూడాలని ఇప్పుడైతే తన చెల్లి ఉంది కాబట్టి తర్వాత అతని సంగతి చూడాలని తన స్నేహితుడితో అంటాడు.

నానిని కొట్టించడానికి

నానిని కొట్టించడానికి

ఇక ఇంట్లో భోజనం చేస్తూ ఉండగా శైలు ఈరోజు షాప్ లో చేసిన వింతలన్నీ చెప్పి నవ్వుకుంటూ ఉంటారు. ఆమెకు కందిపప్పు, శనగపప్పు కూడా తేడా తెలియదు అంటూ అందరూ కామెంట్ చేసి నవ్వుకుంటారు. లేటుగా వచ్చిన నాని అన్నం తింటున్న సమయంలో శిల్పని కలిసావా అని సీత ప్రశ్నిస్తుంది. అయితే అది నచ్చని నాని అప్పటికప్పుడు లేచి అన్నం తినకుండా వెళ్ళిపోతాడు. ఇక మరోపక్క నానిని కొట్టించడానికి శిల్ప అన్న మనుషులను తీసుకొస్తాడు.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
 నానికి షాక్

నానికి షాక్

ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగుస్తుండగా మనుషులను తీసుకువచ్చిన శిల్ప అన్న నాని బండికి అడ్డంగా నిలుస్తాడు. ఇక కమింగ్ అప్ లో చూపించిన దాని ప్రకారం నానీ మీద శిల్ప అన్న దాడి చేస్తాడు. నాని తలకు గాయాలు కూడా అయితే కట్టు కూడా కట్టుకుంటాడు. టాబ్లెట్స్ ఇస్తూ ఈ బిళ్ళలు నీ నొప్పిని తగ్గిస్తాయి గాని గుండెల్లో ఉన్న బాధ తగ్గించలేవని, అంటుంది సీత. బ్రేకప్ అయిపోయిందని ఈ విషయం ఎప్పుడు మాట్లాడొద్దని ఎన్ని సార్లు చెప్పాలి అంటూ నాని ఫైర్ అవుతాడు. ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకుంటానంటే చేసుకుంటావు కదా అంటుండగా దమయంతి ఎంట్రీ ఇస్తుంది. తన కూతురికి పెళ్లి కుదిరిందని చెప్పి షాక్ ఇస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X