Vadinamma Serial June 10th Episode: రఘురామ్ కి షాక్.. సీతను అలా అంటే ఊరుకోనని.. రాజేంద్రకి ఘోర పరాభవం?

తెలుగు రాష్ట్రాల్లో టాప్ ఫైవ్ సీరియల్స్ లో ఒకటిగా సాగిపోతున్న స్టార్ మా వదినమ్మ సీరియల్ ప్రతిరోజు ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే ఈ సీరియల్ రోజుకొక ట్విస్ట్ తో సాగుతోంది. ప్రస్తుతానికి రఘురామ్ కుటుంబమంతా లక్ష్మణ్ కోసం 20 కోట్లు కట్టడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక నేటి ఎపిసోడ్ లో ఏం జరిగింది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

తండ్రికి శైలు షాక్

తండ్రికి శైలు షాక్

ముందుగా శైలు తన తండ్రికి ఫోన్ చేస్తుంది, సీత లక్ష్మణ్ కోసం డబ్బు కట్టేందుకు కిడ్నీ దానం ఇవ్వడానికి వెళ్ళిన సంగతి తెలుసుకొని తండ్రిని అనేక మాటలు అంటుంది. నీ వల్లనే తాను అత్తారింటి వారికి అందరికీ శత్రువులా కనిపిస్తున్నానని, నీ మాటలు నమ్మి వారందరి మీద ద్వేషం పెంచుకున్నానని ఆమె తండ్రిని దూషిస్తుంది.

రాజేంద్రకి ఘోర పరాభవం

రాజేంద్రకి ఘోర పరాభవం

తన భర్త అలాగే తన అక్క, బావలు తనను ఎంతగానో బాగా చూసుకుంటున్నారని డబ్బు కట్టేందుకు వారు చేయని ప్రయత్నం అంటూ లేదని ఆమె చెబుతుంది. అయితే రాజేంద్ర వాళ్లు అందరూ కలిసి నీ మనసు మార్చేసి మనను దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పబోతున్నాడు. అంతేకాక రఘురాం దగుల్బాజీ అని ఏదో అనుభూతి ఆ మాట అంటే మర్యాద దక్కదని తన బావను గాని బావ కుటుంబాన్ని గాని ఏదైనా అంటే ఊరుకోననిని శైలు తేల్చి చెబుతోంది.

 ఏమీ బాలేదని

ఏమీ బాలేదని


ఇక జీవితంలో ఇంటికి తిరిగి రానని చెప్పిన ఆమె తమకు ఇబ్బందులు తీరిపోయాయి అని నాని పొలం తగ్గట్టు కాగితాల మీద సంతకం పెట్టడానికి కూడా తండ్రికి చెబుతుంది. దీంతో రాజేంద్ర రగిలి పోతూ ఉంటాడు భార్య వచ్చి ఇప్పటికైనా తప్పు ఒప్పుకుని శైలు ని క్షమించమని అడుగుదాం అని అంటే ఆమెను కొట్టినంత పని చేస్తాడు. బావమరిది అడ్డుపడి అక్కను అలా కొట్టడానికి వెళ్ళడం ఏమీ బాగోలేదు అని చెబుతాడు.

సీతకు ఏమైంది ?

సీతకు ఏమైంది ?


ఇక మరో పక్క రఘురాం సీతకు ఏమైంది అనే విషయం మీద బాధపడుతూ ఉంటాడు.. కుటుంబం అంతా ఆమెకు ఏమైందా అని అక్కడే కూర్చుని ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో కోయంబత్తూర్ నుంచి ఫోన్ వస్తుంది. సీత కిడ్నీ ఇవ్వడానికి వెళ్ళిన మహిళ సోదరుడు రఘురాం కి కాల్ చేసి విషయం చెబుతాడు. సీత తన చెల్లెలి కోసమే కిడ్నీ ఇవ్వడానికి వచ్చింది అని చెప్పడంతో ఒక్కసారిగా తమ్ముళ్లు, అన్న అందరూ కలిసి ఫోన్ లోనే అతని టార్గెట్ చేస్తారు.

క్రిమినల్ కేసు

క్రిమినల్ కేసు


ఇలా కిడ్నీ ఇవ్వడం నేరమని బయట వాళ్లు కిడ్నీ ఇస్తే క్రిమినల్ కేసులు కూడా బుక్ చేస్తారని అతనిని భయపెట్టటానికి చూస్తారు. కేవలం కుటుంబ సభ్యులు కిడ్నీల మాత్రమే తీసుకోవాలని అదికూడా ఒక కమిటీ ముందు హాజరై ఆ కమిటీ ఒప్పుకుంటేనే కిడ్నీ ఇవ్వాలని చెబుతారు. అయితే తనకు అన్ని విషయాలు తెలుసని ఆయన చెప్పడంతో రఘురాం సీరియస్ అవుతాడు.

డబ్బు కోసం రాలేదని

డబ్బు కోసం రాలేదని

ఆయనను తిట్టడమే కాక సీతను కూడా ఇలా చెప్పకుండా వెళ్లినందుకు ఏదో అనబోతే తనను ఏమైనా అంటే భరిస్తాను కానీ సీతని ఏమీ అనవద్దని ఆయన చెబుతాడు. సీత డబ్బు కోసం ఇక్కడికి రాలేదని కిడ్నీ ఇచ్చి ఒకవేళ అప్పుగా డబ్బు ఇవ్వగలిగితే ఇవ్వమని అడిగిందని చెబుతాడు.. ఈ విషయం తెలుసుకుని రఘురాం ఆమెను అపార్థం చేసుకున్నందుకు బాధపడతాడు.

కిడ్నీ దొరికింది

కిడ్నీ దొరికింది

అయితే కిడ్నీ ఇవ్వాల్సిన అవసరం లేకుండానే పని పూర్తయిందని అప్పటికప్పుడు ఒక బ్రెయిన్డెడ్ పర్సన్ కిడ్నీ దొరకడంతో సీత కిడ్నీ తీసుకోలేదని ఆయన చెబుతాడు. అయితే మరి సీత ఇప్పటికే రావాలి కదా రాలేదేమిటా అని ప్రశ్నిస్తే రాత్రి తాను బస్సు ఎక్కించానని ఆయన చెబుతాడు. అయితే ఇంకా రాలేదని చెప్పడంతో తన మనుషులను పంపి కనుక్కుంటాను అని ఆయన చెబుతాడు.

అక్కడితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. సీత యాక్సిడెంట్ అయిన విషయం ఆమె వెళుతున్న బస్సులో పడిందన్న విషయం మళ్ళీ తరువాత ఎపిసోడ్లో సదరు వ్యక్తి రఘురామ్ కి చెప్పినట్లు చూపించారు. ఈ సస్పెన్స్ మరో రోజు వరకు కొనసాగిస్తున్నారన్నమాట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X