Vadinamma Serial June 12th Episode: కుమిలిపోతున్న రఘురామ్ ఫ్యామిలీ.. స్వయంకృతం అంటూ, సిరి తల్లికి రఘురామ్ వార్
తెలుగు రాష్ట్రాల్లో కరోనా లాక్ డౌన్ ఇంకా కొనసాగుతుండడంతో దాదాపు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో టెలివిజన్ సీరియల్ రేటింగ్స్ కూడా దూసుకుపోతున్నాయి. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో టాప్ ఫైవ్ లో ఉన్న వదినమ్మ సీరియల్ రోజుకొక ఆసక్తికరమైన మలుపు తీసుకుంటూ ప్రేక్షకులను కట్టి పడేస్తోంది. ఇక ఈ రోజు జరిగిన ఎపిసోడ్ విషయానికి వస్తే..
నవ్వుతోనే క్రేజ్ అందుకుంటున్న పవిత్ర లక్ష్మీ

బాధలో కుటుంబం
సీత వెళుతున్న బస్సు యాక్సిడెంట్ కి గురైందని యాక్సిడెంట్ తర్వాత బస్సులో పడిపోయిందని కోయంబత్తూర్ కు చెందిన ప్రశాంత్ రఘురాంకి విషయం చెప్పిన సంగతి తెలిసిందే. ఆ విషయం తెలియడంతో కుప్పకూలిపోయిన రఘురాం ఆ తర్వాత కాసేపటికి తేరుకుని, బావమరిది భాస్కర్ ని అలాగే భరత్ ని బస్టాండ్ కి వెళ్లి వివరాలు తెలుసుకోమని పంపుతాడు. మరోపక్క కుటుంబం అంతా కూర్చుని బాధపడుతూ ఉంటారు.

మారిన శైలు
ముఖ్యంగా శైలు అయితే సీతక్క తన వల్లే బయటికి వెళ్ళింది అనే విషయాన్ని తలుచుకొని కుమిలిపోతూ ఉంటుంది. తాను డబ్బు విషయంలో ఇంత ఒత్తిడి పెట్టకుండా ఉంటే సీతక్క ఇంకా తమ మధ్య ఉండేదని భర్త లక్ష్మణ్ కి చెప్పి బాధ పడుతుంది. సీతక్క రాగానే ఆమె కాళ్ళను తన కన్నీళ్లతో కడిగితే కానీ తనకు మనశ్శాంతి లభించదని శైలు చెబుతుంది. అయితే అదేమీ వద్దని నువ్వు మారిపోవడమే సీత వదినకు ఇచ్చే పెద్ద బహుమతి అని లక్ష్మణ్ చెబుతాడు.

తమ వల్లే అని
మరోపక్క సీత వదిన ఇల్లు వదిలి వెళ్లడానికి కారణం తానేనని నాని బాధపడుతూ ఉంటాడు. తాను అన్నం తినకపోయినా సహించలేని వదిన తనకు అన్నం తినిపించిన విషయాలన్నీ గుర్తుకు తెచ్చుకుని మరి బాధపడుతూ ఉంటాడు. మరో పక్క లక్ష్మణ్ కూడా బాధపడుతూ ఉంటాడు. తనకు అసలు ఈ డబ్బు సమస్య రాకపోయి ఉంటే సీత వదిన బయటకు అసలు వెళ్ళేది కాదని దీనికంతటికీ కారణం తానేనని బాధపడుతూ ఉంటాడు.

ఎవరికి వారే
ఇక బాధపడుతున్న శైలు వద్దకు వెళ్లి సిరి ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. తన వల్లే సీతక్క బయటకు వెళ్లిందని శైలు సిరి వద్ద కూడా బాధపడుతుంది. అయితే అలా బాధపడవద్దు అని సిరి కోరుతుంది. తన వల్లే సీతక్క బయటకు వెళ్లిందని శైలు అలాగే తన వల్ల వదిన బయటికి వెళ్ళింది అని లక్ష్మణ్, నాని ఇద్దరు బాధపడుతూ ఉంటారు. మరో పక్క సీత అత్తయ్య కూడా సీత అలా వెళ్లి ఉండాల్సింది కాదని బాధపడుతూ ఉంటుంది.

వదిలి వెళ్ళిపోయిందని
మరోపక్క రఘురాం కూడా సీత గురించి ఆలోచిస్తూ ఆమె విషయాలను జ్ఞాపకం తెచ్చుకుని బాధపడుతూ ఉంటాడు. తనను వదిలి పుట్టింటికి కూడా వెళ్లని సీత ఇలా ఎక్కడో ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందో కూడా తెలియకుండా బాధ పడుతోందని ఆ విషయాలన్నీ జ్ఞప్తికి తెచ్చుకుని బాధపడుతూ ఉంటాడు. ఇంతలో తెల్లవారుతుంది. అయినా ఏం జరిగిందన్న విషయం మీద కోయంబత్తూరు నుంచి ఎలాంటి కబురు రాదు.

రఘురామ్ వార్నింగ్
అందరూ బాధపడుతూ కూర్చుని ఉన్న సమయంలో శైలు కాఫీ కలిపి తీసుకువచ్చి రఘురాంను కోరుతుంది. కానీ రఘురాం తాగాలని లేదని బలవంతం పెట్టవద్దు అని కోరుతాడు. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక తదుపరి ఎపిసోడ్ లో సిరి తల్లి, భాస్కర్ భార్య వచ్చి ఇంట్లో ఉన్న అందరికీ భోజనం సిద్ధం చేసి తినమని కోరుతారు. తినలేమని చెబితే మనిషి పోతే పోయిన వాళ్ల కోసం బాధ పడవద్దని సిరి తల్లి నోరు జరుగుతుంది. దీంతో సీరియస్ అయిన రఘురాం అలాంటి మాటలు మాట్లాడ వద్దు అని గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు. ఇక తదుపరి ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలియాలంటే సోమవారం వరకు వేచి ఉండాల్సిందే.


Click it and Unblock the Notifications











