Vadinamma Serial June 14th Episode: సీత చచ్చిపోయినట్టేనా...బాడీ మిస్సింగ్.. ఇక ఆశలు వదులుకోవాల్సిందే!

తెలుగులో టాప్ ఫైవ్ సీరియల్స్ లో ఒకటిగా కొనసాగుతున్న స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే వదినమ్మ ఆసక్తికరంగా సాగుతోంది. ఒక సమస్య ఎదురైతే దాన్ని పరిష్కరించుకునే లోపు మరో సమస్యలు వస్తూ ఉండటంతో సీరియల్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ప్రేక్షకులు బాగా ఈ సీరియల్ ను ఆదరిస్తున్నారు. ఇక తాజా ఎపిసోడ్ లో ఏం జరిగింది అనే విషయానికి వస్తే..

బాధలో మునిగిపోయి

బాధలో మునిగిపోయి

సీతకు ఏం జరిగింది అనే విషయం ఎంతకూ క్లారిటీ రాకపోవడంతో కుటుంబం అంతా బాధలో మునిగిపోయి ఉంటారు. రాత్రి సమయంలో కూడా ఎవరు నిద్రపోకుండా ఆమె కోసమే ఆలోచిస్తూ ఉంటారు. పగలు అవ్వగానే శైలు రాత్రంతా తాను సీతక్క కోసం ఫోన్ ప్రయత్నిస్తూనే ఉన్నానని ఒకసారి కాకపోతే ఒక సారి అయినా ఫోన్ కలుస్తుంది ఏమోనన్న ధైర్యంతో చేస్తున్నానని చెబుతుంది.

సిరి తల్లి టార్చర్

సిరి తల్లి టార్చర్

ఈ లోపు ఆమె ఫోన్ ఎప్పుడో చార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయి ఉంటుందని ఇప్పుడు ఫోన్ చేసి కూడా ఉపయోగం లేదని చెబుతారు మిగతా కుటుంబ సభ్యులు. ఆమెకు ఏమైంది ? ఎప్పుడు వస్తుంది ? అంటూ బాధ పడుతున్న తరుణంలో సిరి తల్లి అలాగే భాస్కర్ భార్య దుర్గ ఇద్దరు ఇంటికి చేరుకుంటారు. ఇంటికి వచ్చింది మొదలు సిరి తల్లి రకరకాల మాటలతో వాళ్ళని మరింత బాధ పెడుతూ ఉంటుంది.

ఎప్పుడో తాకట్టు పెట్టుకోమనేదాన్ని

ఎప్పుడో తాకట్టు పెట్టుకోమనేదాన్ని

ఆ మాటలకు సిరి తట్టుకోలేక ఇక్కడ నుంచి వెళ్ళిపోమని తల్లిని కోరుతుంది. అయితే తాను వచ్చింది మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదని పరామర్శించడానికి అని చెబుతోంది. అయితే ఇందులో సిరి తల్లి తప్పేమీ లేదని తన భార్య ఇదంతా రెచ్చగొట్టి చేయిస్తుందని భాస్కర్ భార్యను నిందిస్తాడు.. ఆడపడుచుకి నగలు తాకట్టు పెట్టుకోవడానికి కూడా ఇవ్వడానికి ఇష్టపడని మనిషి ఇప్పుడు మాట్లాడుతోందని అనగా ఇంత జరుగుతుందని తెలిస్తే నగలు ఎప్పుడో తాకట్టు పెట్టుకోమని చెప్పేదాన్ని అని దుర్గ చెబుతుంది.

రఘురామ్ కోపం నషాలానికి

రఘురామ్ కోపం నషాలానికి

ఇక మీ అందరికీ టీ పెట్టుకుని వస్తానని సిరి తల్లి చెప్పగా ఎవరు తాగే ఉద్దేశం లేదని అలాంటి ప్రయత్నాలేవీ చేయవద్దని సిరి కోరుతుంది. అయినా సరే వినకుండా మీరు కాకపోతే మేమైనా తాగుతామని వంటగదిలోకి వెళ్ళిన సిరి తల్లి, దుర్గ ఇద్దరు కుటుంబం మొత్తానికి భోజనం తయారు చేసి వస్తారు. తినమని కోరితే ఎవరు తినడానికి ఇష్టం లేదని చెబుతారు. అయితే ఒక మనిషి పోతే తినకుండా మానేస్తారని ప్రశ్నించడంతో రఘురామ్ కోపం నషాలానికి చేరుతుంది.

చచ్చిపోయినట్టేనా ?

చచ్చిపోయినట్టేనా ?

ఒక మనిషి ఒక్క రోజు కనిపించకపోతే చచ్చిపోయినట్టేనా ? అసలు ఏం మాట్లాడుతున్నారు వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఏదో ఒక విధంగా మమ్మల్ని బాధ పెడుతూనే ఉన్నారు ఇప్పటికైనా అలా మాట్లాడడం ఆపకపోతే బాగోదని వార్నింగ్ ఇస్తాడు. అంతేకాక మేము అంటే ఇష్టం లేకపోతే మా ఇంటికి రావడం మానేయండి అంతే కానీ ఇలా సూటిపోటి మాటలతో మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు అని అంటాడు.

అర్జెంట్ గా ఆఫీస్ కి

అర్జెంట్ గా ఆఫీస్ కి

ఇంతలో భాస్కర్ కల్పించుకుని అంత సీరియస్ అవద్దని కాస్త కంట్రోల్ అవ్వమని రఘురామ్ ని కోరతాడు. ఇక కాసేపటికి బస్టాండ్ కి వెళ్లి అసలు ఏం జరిగింది అనే విషయం తెలుసుకోవడానికి రఘురాం బయలుదేరుతాడు. భాస్కర్ తాను కూడా వస్తానని చెప్పడంతో బయలుదేరుతున్న సమయంలో భాస్కర్ అర్జెంట్ గా ఆఫీస్ కి వెళ్లాల్సి వస్తుంది. నువ్వు కూడా వెళ్లవద్దని తమ్ముడు పంపిద్దాం అని చెప్పి భరత్ ని బస్టాండ్ కి పంపిస్తారు.

సీతకి ఏమయింది?

సీతకి ఏమయింది?

ఇక ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాత ఎపిసోడ్ ప్రకారం అక్కడ భరత్ కి షాకింగ్ విషయం చెబుతారు బస్టాండ్ అధికారులు. యాక్సిడెంట్ జరిగిన సమయంలో హాస్పిటల్ లో సీతామహాలక్ష్మి అనే పేరు లేదని అంటే ఆ మనిషి మిస్సింగ్ అయినట్లేనని దీంతో ఆమె మీద ఆశలు వదులుకోవాలని చెబుతారు. దీంతో సీతకి ఏమైంది ? నిజంగా చనిపోయిందా ? లేక మిస్ అయిందా ? అనే వివరాలు వచ్చే ఎపిసోడ్స్ లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X