For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vadinamma Serial June 15th Episode: సీత బాడీ మిస్సింగ్.. బ్యాగ్ చెట్లలో దాచేసిన భరత్.. రఘురామ్ సీరియస్!

  |

  కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ దశలవారీగా ఎత్తివేసేందుకు సిద్దంగా ఉన్నారు. అయితే లాక్ డౌన్ లో సినిమాలు పెద్దగా లేకపోవడంతో ఎక్కువ మంది టీవీ సీరియల్స్ కి అలవాటు పడ్డారు. దీంతో తెలుగు టీవీ సీరియల్స్ కి మంచి రేటింగ్ లభిస్తోంది. అలా తెలుగులో టాప్ ఫైవ్ సీరియల్స్ లో ఒకటిగా కొనసాగుతున్న స్టార్ మా వదినమ్మ సీరియల్ రోజుకొక ఆసక్తికరమైన ట్విస్ట్ తో సాగిపోతోంది. తాజా ఎపిసోడ్లో ఏం జరిగింది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

  బస్ స్టాండ్ కి వెళ్లి

  బస్ స్టాండ్ కి వెళ్లి

  చివరి ఎపిసోడ్ లో రఘురాం సిరి తల్లికి వార్నింగ్ ఇస్తాడు. సీతకి ఏమీ కాలేదని పిచ్చిపిచ్చిగా ఎలా పడితే అలా వాగవద్దు అంటూ ఆయన వార్నింగ్ ఇస్తాడు. ఇంతలో విషయం తెలుసుకోవడానికి బస్ స్టాప్ వరకు వెళ్లి రావడానికి రఘురాం, భాస్కర్ ఇద్దరు బయలుదేరగా భాస్కర్ కి అర్జెంట్ పని పడుతుంది. దీంతో వాళ్ళిద్దరూ కాకుండా భరత్ ని బస్టాండ్ కి వెళ్లి వాకబు చేసే రమ్మని పంపిస్తారు. ఇక బస్ స్టాండ్ కి వెళ్ళిన భరత్ అసలు ఏమైంది అని కనుక్కునే ప్రయత్నం చేస్తాడు.

  ఆశలు వదులుకోవడమే

  ఆశలు వదులుకోవడమే

  పాసింజర్ పేరు చెప్పమని కోరగా సీతామహాలక్ష్మి అనే పేరు చెబుతాడు. అయితే సీతామహాలక్ష్మి అనే పేరు గల వాళ్లు ఎవరు హాస్పిటల్లో లేరని, అంటే దానర్థం ఆమె లోయలోనే ఎక్కడో పడిపోయి ఉండొచ్చని, వంద అడుగుల లోయ కావడంతో ఆమె బాడీ కూడా దొరకలేదని అధికారులు చెబుతారు. ఇక ఆశలు వదులుకోవడమే అని బాడీ దొరకకపోయినా బాడీ దొరకని వాళ్ళకు సంబంధించిన కొన్ని వస్తువులు దొరికాయని చెబుతూ అక్కడికి వెళ్లి చూసుకుని మీ వాళ్ళ వస్తువులు ఉంటే తీసుకెళ్ళమని చెబుతారు.

  వదిన బ్యాగ్, ఫోన్

  వదిన బ్యాగ్, ఫోన్

  అక్కడికి వెళ్లిన భరత్ కి తన వదిన బ్యాగ్ అలాగే ఫోన్ కనిపిస్తాయి. తమ వదిన ఇక తమకు దూరం అయినట్టే అని భావిస్తూ భరత్ అక్కడే కన్నీళ్లు పెట్టుకుంటాడు. తర్వాత బ్యాగ్ తీసుకుని వెళ్ళడానికి బయలుదేరుతున్న సమయంలోనే రఘురాం ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉంటాడు. కొద్దిసేపటి క్రితమే భరత్ వెళ్ళినా రఘురాంకి భరత్ వెళ్లి చాలాసేపు అయింది అనిపిస్తూ ఉంటుంది.

   భయపడాల్సింది ఏమీ లేదు

  భయపడాల్సింది ఏమీ లేదు

  రెండు మూడు సార్లు ఫోన్ చేసినా అనంతరం భరత్ ఫోన్ లిఫ్ట్ చేసి త్వరలోనే వదిన వచ్చేస్తుంది అని చెప్పారని ఇందులో భయపడాల్సింది ఏమీ లేదని చెబుతాడు. దీంతో సంతోషపడిన రఘురాం మరిన్ని వివరాలు అడగ్గా తాను ఇంటికి వచ్చేస్తున్నాను అని అని వివరంగా అక్కడ మాట్లాడుకుందాం అని చెబుతూ భరత్ బ్యాగ్ తో సహా ఇంటికి బయలుదేరుతాడు.

  అరగంటలో

  అరగంటలో

  భరత్ ఇంటికి వచ్చే సమయానికి ఒక పక్క శైలు మరో పక్క అత్తగారు సీత వచ్చేస్తుంది అన్న విషయం తెలుసుకొని ఆనంద పడుతూ ఉంటారు. ఆమెకు ఏమైనా జరిగితే ఆ బాధ జీవితాంతం తమని వేధిస్తుందని, కానీ ఇప్పుడు వచ్చేస్తుంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేవని ఇంట్లో అందరూ కాస్త ఆనందిస్తూ వుంటారు. ఈ విషయం బయటి నుంచి చూసిన భరత్ ఇప్పుడు బ్యాగుతో సహా లోపలికి వెళ్తే ఇబ్బంది కలుగుతుందని భావించి బ్యాగ్ అక్కడే చెట్లలో దాసి లోపలికి వెళ్తాడు.

   అందరినీ మరో బస్సులో

  అందరినీ మరో బస్సులో


  లోపలికి వెళ్ళాక మరో అరగంటలో సీత వదిన వచ్చేస్తుందని, ప్రమాదం నుంచి బయటపడిన వారందరినీ మరో బస్సులో ఎక్కించి పంపించారు అని చెబుతాడు. దీంతో అందరూ సంతోష పడుతూ ఉంటారు. భరత్ తన గదిలోకి వెళ్లి బాధపడుతూ ఉంటాడు. అరగంట దాటాక కూడా సీత రాకపోవడంతో రఘురాం కింద నుంచి అరుస్తూ ఉంటాడు. ఇంకా రాలేదు, వచ్చేస్తుంది అని చెప్పి నువ్వు పైకి వెళ్ళి కూర్చున్నావు కిందకి రా రా అంటూ అరుస్తూ ఉంటాడు. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  అందరికీ ఫోన్

  అందరికీ ఫోన్

  ఇక కమింగ్ అప్ లో చూపించిన దాని ప్రకారం భరత్ ఏం చేయాలో పాలుపోక తన వదిన ఫోన్ తీసుకువెళ్లి అందరి ముందు హాల్లో పెడతాడు. దీంతో ఈ ఫోన్ నీకు ఎక్కడ దొరికింది ? అసలు సీతకు ఏమైంది అని రఘురాం నిలదీసే ప్రయత్నం చేస్తాడు. సీతకు ఏమైంది అనే విషయం తదుపరి ఎపిసోడ్ లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

  English summary
  Vadinamma Episode 569: Vadinamma is a Telugu soap which airs on Star Maa and streams on Disney+Hotstar. The series premiered on 6 May 2019. It stars Prabhakar, Sujitha, Rajesh Dutta, Maheshwari, Raj and Priyanka. In the latest episode seetha met with an accident. raghu ram famiy is in deep sadness now.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X